పర్వతగిరి: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని ఓ కోడలు తన అత్తకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించింది. అత్త చికిత్స పొందుతూ మృతిచెందగా, తన తల్లిని చంపిందని భార్యపై భర్త శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండాలో చోటుచేసుకుంది. స్థానికులు, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన భూక్య మంజుల, దేవేందర్ భార్యాభర్తలు.
మంజుల మూడేళ్లుగా వరంగల్‌లోని పెరుకవాడకు చెందిన సారయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం అత్త భూక్య గమ్మి(55)కి తెలిసి పలుమార్లు వారించింది. దీంతో మంజుల తన ప్రేమకలాపాలకు అత్త గమ్మి తరచూ అడ్డు వస్తుందని గతంలో రెండు సార్లు తలపై గాయం చేయగా, మరోసారి చేయి విరగ్గొట్టింది. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీన మంజుల తన అత్త గమ్మికి థమ్సప్‌లో పురుగుల మందు కలిపి తాగించింది.
కొద్ది సేపటి అనంతరం గమ్మి కిందపడి కొట్టుకుంటుండగా కుమారుడు దేవేందర్ చూసి స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించగా ఆయన సూచన మేరకు తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించే క్రమంలో శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment