బీజింగ్ : చైనాలో పాముల వేపుడు, కప్పల పులుసు తినడం చూసే ఉంటాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం మరో అడుగు ముందుకేసి ఏకంగా బతికున్న ఎలుకల్నే ఫలహారంగా నమిలి మింగేశాడు. చిన్న చిన్న ఎలుకల్ని ఓ చైనీయుడు చోప్‌స్టిక్‌లతో పొడుచుకుని.. సాస్‌లో ముంచుకుని తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ జుగుప్సాకర సన్నివేశం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో వెలుగుచూసింది. బుల్లి ఎలుకలు ప్లేట్‌లో నుంచి పారిపోతుండగా.. ఈ కర్కోటకుడు ఎలా తింటున్నాడో చూడండి అంటూ.. సదరు వీడియోని @sauwingso యూజర్ ట్విటర్‌లో పోస్టు చేశారు.
ఇక ఈ పచ్చి మాంస భక్షకుడిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాగారిక సమాజంలో ఇంతటి అనాగరిక చర్యలకు పాల్పడతారా..! అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నచ్చిన ఆహారం తినడంలో తప్పులేదు. కానీ, ఆ మూగ ప్రాణుల్ని హింసించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ‘ఓ మై గాడ్..! అప్పుడే పుట్టిన చిన్న చిన్న ఎలుకల్ని తింటున్నాడా..! వాంతులు వస్తున్నాయి’ అని ఓ యూజర్ వికారం వ్యక్తం చేశాడు. గబ్బిలాలు, ఎలుకలు, పునుగు పిల్లులను తినడం వల్లే ప్రాణాంతక వైరస్‌లు మానవాళిని కబలిస్తున్నాయని మరొక యూజర్ పేర్కొనగా.. నా కర్మ కొద్దీ ఈ వీడియో చూశానని ఇంకొకరు విచారం వ్యక్తం చేశారు. 30 సెకన్ల నివిడి ఉన్న ఈ వీడియో 1.4 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment