మౌస్‌లో పీసీ...
మౌస్‌లో యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయేమిటా? అనేనా మీ సందేహం. అవి మాత్రమే కాదు... ఓ ప్రాసెసర్, మదర్‌బోర్డ్, ర్యామ్, మెమరీ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకోలా చెప్పాలంటే ఇది కేవలం మౌస్ మాత్రమే కాదు. పూర్తిస్థాయి పర్సనల్ కంప్యూటర్. మానిటర్, కీబోర్డులను చేర్చుకుంటే చాలు!
మౌస్‌బాక్స్ అని పిలుస్తున్న ఈ పీసీలో 1.4 గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తోపాటు 128 జీబీల ఫ్లాష్ మెమరీ, యూఎస్‌బీ 3.0 పోర్టులు రెండు ఉన్నాయి. పోలండ్ ఇంజినీర్లు కొందరు సిద్ధం చేసిన ఈ నమూనాను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.