USB
-
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం 35,000 ఉద్యోగాలు కట్
-
యాపిల్ ఛార్జింగ్ కేబుల్‌తో డాటా చోరీ..!
సాన్‌ఫ్రాన్సిస్కో: ఈ వార్త చదివాక ఇక మీదట వేరే వారికి డాటా కేబుల్ ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే.. చార్జింగ్ కేబుల్స్ కూడా డాటాను చోరీ చేస్తున్నాయట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అంటున్నాడో హ్యాకర్. ఇప్పటికే అవసరం నిమిత్తం కొన్ని.. అలవాటుగా కొన్ని యాప్స్‌ని మొబైల్స్‌లో ఇన్స్టాల్ చేసుకుని.. మన వ్యక్తిగత సమాచారాన్ని మూడో వ్యక్తికి అందజేస్తున్నాం. చార్జింగ్ కేబుల్ కూడా ఇదే పని చేస్తుందంటున్నాడు సదరు హ్యాకర్. చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. యాపిల్ యూఎస్బీ కేబుల్‌తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు. దీని గురించి సదరు హ్యాకర్ వివరిస్తూ.. ‘ఈ కాలంలో చాలా మంది ఫ్లాష్ డ్రైవర్స్‌ని వారి డివైజ్‌కి కనెక్ట్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అదే చార్జింగ్ కేబుల్ దగ్గరకు వచ్చే సరికి ఇలాంటి అనుమానాలేవి కలగవు. కానీ చార్జింగ్ కేబుల్ కూడా మీ డాటాను చోరీ చేస్తుంది. ఓ.ఎంజీ కేబుల్‌గా పిలవబడే యాపిల్ యూఎస్బీ లైటెనింగ్ కేబుల్ చూడ్డానికి సాధరణ చార్జింగ్ కేబుల్‌లానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ కేబుల్‌ని మీ డివైజ్‌కు కనెక్ట్ చేశారనుకోండి. వితిన్ వైఫై రేంజ్లో హ్యాకర్ మీకు తెలియకుండా మీ డివైస్‌లోకి హానికరమైన పేలోడ్స్‌ని వైర్‌లెస్‌గా పంపించగల్గుతాడు’ అని వివరించాడు. ‘ఈ చార్జింగ్ కేబుల్‌లో ఉండే కమాండ్స్, స్క్రిప్ట్స్, పేలోడ్స్‌ను ఉపయోగిస్తూ.. హ్యాకర్ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడు. అంతేకాదు ఒకసారి ఈ కేబుల్‌ను మీ సిస్టంకు కనెక్ట్ చేశారంటే.. అటాకర్ ఆటోమెటిగ్గా మీ కంప్యూటర్ను లాగాఫ్ చేయడం.. ఆ తర్వాత మీరు ఎంటర్ చేసే పాస్‌వర్డ్‌ను కూడా తస్కరించడానికి అవకాశం ఉంది’ అంటున్నాడు సదరు హ్యాకర్. మరి దీనిపై యాపిల్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. -
తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు!
న్యూయార్క్: కళాశాలకు చెందిన కంప్యూటర్లకు భారీగా నష్టం కల్గించినందుకు తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) స్టూడెంట్ వీసాపై 2015లో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలో సెయింట్ రోజ్ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో ‘యూఎస్బీ కిల్లర్’ అనే పెన్‌డ్రైవ్ సాయంతో కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేశాడు. ఈ పనిని మొబైల్లో షూట్‌చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నార్త్ కరోలినా పోలీసులు విశ్వనాథ్‌ను అరెస్ట్‌చేశారు. కావాలనే ఈ పనికి పూనుకున్నట్లు ఒప్పుకున్న అతడు జరిగిన నష్టం రూ.40 లక్షలు చెల్లించేందుకు కూడా అంగీకరించాడు. ఆగస్టులో కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. -
నిరోధ్లో మొబైల్ పెట్టి పావురం వీపుపై కట్టి..
అది తూర్పు కొలంబియాలోని కాంబిటా జైలు. ఎత్తయిన గోడ.. దానికి కరెంటు సరఫరాతో ఫెన్సింగ్.. జైలు లోపలాబయటా కాపలాదారులు. ఓ రకంగా చెప్పాలంటే చీమ కూడా లోపలికి దూరనివ్వనింత పటిష్టమైన భద్రతగల విశాలమైన జైలు ప్రాంగణం. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. అందులో ఉండేవాళ్లంతా ఏదో ఒక నేరాల్లో ఉన్న ఖైదీలే ముఖ్యంగా బందిపోట్లు.. డ్రగ్స్ బారిన పడిన వారు.. లైంగిక దాడులకు దిగేవారు. సుదీర్ఘకాలం జైలు శిక్షపడితేనే ఖైదీలను ఈ జైలుకు తరలిస్తారు. అలాంటి భద్రతగల జైలులోని ఖైదీకి సహాయం చేసేందుకు ఓ పావురం ఎగిరొచ్చింది. వీపుపై ఓ మొబైల్ ఫోన్.. అందులో ఓ పెన్ డ్రైవ్ మోసుకొచ్చింది. అయితే, దాని ప్రయత్నానికి మధ్యలోనే గండిపడింది. జైలు అధికారుల కంటపడింది. దీంతో ఆ పావురాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న జైలు గార్డులు అవాక్కయ్యారు. చాలా పకడ్బందీగా ఓ మొబైల్ ఫోన్ ను, పెన్ డ్రైవ్‌ను కలిపి అవి వర్షానికి తడవకుండా నిరోధ్లో పెట్టి ప్యాక్ చేసి ఆ పావురం వీపునకు కట్టి పంపించిన తీరుతో ఖిన్నులయ్యారు. పావురానికి అమర్చిన ఆ ప్యాకెట్‌ను స్మాల్ నెయిల్ కట్టర్ ద్వారా తొలగించి అనంతరం దానిని గాల్లోకి విడిచిపెట్టారు. పరిశీలిన కోసం మొబైల్‌ను, పెన్‌డ్రైవ్‌ను తీసుకెళ్లారు. దీని ప్రకారం జైలు నుంచి సెటిల్ మెంట్లు కూడా జరుగుతున్నాయని వారు కొత్తగా కనుగొన్నారు. ఈ పావురానికి వాటిని ఇచ్చి పంపించినవారికోసం దర్యాప్తు చేస్తున్నారు. -
మౌస్‌లో పీసీ...
మౌస్‌లో యూఎస్బీ పోర్టులు ఉన్నాయేమిటా? అనేనా మీ సందేహం. అవి మాత్రమే కాదు... ఓ ప్రాసెసర్, మదర్బోర్డ్, ర్యామ్, మెమరీ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకోలా చెప్పాలంటే ఇది కేవలం మౌస్ మాత్రమే కాదు. పూర్తిస్థాయి పర్సనల్ కంప్యూటర్. మానిటర్, కీబోర్డులను చేర్చుకుంటే చాలు! మౌస్బాక్స్ అని పిలుస్తున్న ఈ పీసీలో 1.4 గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తోపాటు 128 జీబీల ఫ్లాష్ మెమరీ, యూఎస్బీ 3.0 పోర్టులు రెండు ఉన్నాయి. పోలండ్ ఇంజినీర్లు కొందరు సిద్ధం చేసిన ఈ నమూనాను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.