సాన్‌ఫ్రాన్సిస్కో: ఈ వార్త చదివాక ఇక మీదట వేరే వారికి డాటా కేబుల్ ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే.. చార్జింగ్ కేబుల్స్ కూడా డాటాను చోరీ చేస్తున్నాయట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అంటున్నాడో హ్యాకర్. ఇప్పటికే అవసరం నిమిత్తం కొన్ని.. అలవాటుగా కొన్ని యాప్స్‌ని మొబైల్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని.. మన వ్యక్తిగత సమాచారాన్ని మూడో వ్యక్తికి అందజేస్తున్నాం. చార్జింగ్ కేబుల్ కూడా ఇదే పని చేస్తుందంటున్నాడు సదరు హ్యాకర్. చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. యాపిల్ యూఎస్‌బీ కేబుల్‌తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు.
దీని గురించి సదరు హ్యాకర్ వివరిస్తూ.. ‘ఈ కాలంలో చాలా మంది ఫ్లాష్ డ్రైవర్స్‌ని వారి డివైజ్‌కి కనెక్ట్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అదే చార్జింగ్ కేబుల్ దగ్గరకు వచ్చే సరికి ఇలాంటి అనుమానాలేవి కలగవు. కానీ చార్జింగ్ కేబుల్ కూడా మీ డాటాను చోరీ చేస్తుంది. ఓ.ఎంజీ కేబుల్‌గా పిలవబడే యాపిల్ యూఎస్‌బీ లైటెనింగ్ కేబుల్ చూడ్డానికి సాధరణ చార్జింగ్ కేబుల్‌లానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ కేబుల్‌ని మీ డివైజ్‌కు కనెక్ట్ చేశారనుకోండి. వితిన్ వైఫై రేంజ్‌లో హ్యాకర్ మీకు తెలియకుండా మీ డివైస్‌లోకి హానికరమైన పేలోడ్స్‌ని వైర్‌లెస్‌గా పంపించగల్గుతాడు’ అని వివరించాడు.
‘ఈ చార్జింగ్ కేబుల్‌లో ఉండే కమాండ్స్, స్క్రిప్ట్స్, పేలోడ్స్‌ను ఉపయోగిస్తూ.. హ్యాకర్ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడు. అంతేకాదు ఒకసారి ఈ కేబుల్‌ను మీ సిస్టంకు కనెక్ట్ చేశారంటే.. అటాకర్ ఆటోమెటిగ్గా మీ కంప్యూటర్‌ను లాగాఫ్ చేయడం.. ఆ తర్వాత మీరు ఎంటర్ చేసే పాస్‌వర్డ్‌ను కూడా తస్కరించడానికి అవకాశం ఉంది’ అంటున్నాడు సదరు హ్యాకర్. మరి దీనిపై యాపిల్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment