cable
-
కేబుల్‌రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్: తమ్ముడిని చంపి, స్టోర్‌రూంలో
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేయొద్దని వారించిన తమ్ముడిని అక్క(మైనర్ బాలిక )అమానుషంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయ్ బరేలి జిల్లాలో ఈ ఘటన గత గురువారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 15 ఏళ్ల బాలిక తన సోదరుడు (9)ని ఇయర్‌ఫోన్ కేబుల్ గొంతుకు బిగించి చంపేసింది. తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బాయ్ ఫ్రెండ్‌తో అక్క ఫోన్లో చాట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. గంటలు గంటలు ఫోన్ ఎందుకు మాట్లాడతావంటూ గతంలో చాలాసార్లు అక్కను ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని అమ్మానాన్నకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతోవారు బాలికను మందలించారు. అయితే తాజాగా అదే తరహాలో ఫోన్లోమాట్లాడటం గుర్తించి వారించాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో అక్కపై దాడి చేశాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన బాలిక ఇయర్ ఫోన్స్ కేబుల్‌ను అతడి మెడకు బిగించడంతో ఊపరాడక చనిపోయాడు. ఆ తరువాత మృతదేహాన్ని గుట్టుగా స్టోర్ రూంలో దాచి పెట్టి, ఏమీ తెలియనట్టుగా నటించింది. అయితే పిల్లవాడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి పొరుగువారిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను కూడా ఆరా తీయాలని భావించారు. మరుసటి రోజు, దుర్వాసన రావడంతో స్టోర్ రూం తెరిచి కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరికి పోలీసుల విచారణలో బాలిక తన నేరాన్ని అంగీకరించింది. అయితే తనపై అమ్మా నాన్నకు పదే పదే ఫిర్యాదు చేయడంతో కోపం వచ్చిందని, కానీ తమ్ముడిని చంపాలని అనుకోలేదని పోలీసులతో వాపోయింది. సోమవారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని రాయ్ బరేలి పోలీస్ సూపరింటెండెంట్ శ్లోక్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితురాలిని జువైనల్ హోంకు తరలించినట్టు చెప్పారు. -
బ్లాడర్‌లో కేబుల్ : నిజం తెలిస్తే షాక్!
మనషుల మానసిక రుగ్మతకు, వింత ప్రవర్తనకు నిదర్శనమైన ఉదంతం ఒకటి అసోంలో వెలుగు చూసింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేసిన వైద్యులు అతని మూత్రాశయంలో మొబైల్ హెడ్ ఫోన్ వైర్ ను చూసి విస్తుపోయారు. చివరికి ఆ కేబుల్ ను తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే అసోంకు చెందిన రోగి (30) తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పొరపాటున హెడ్‌ఫోన్ కేబుల్‌ను మింగేశానని చెప్పాడు. దీంతో మల పరీక్ష, ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు, ఫలితం లేకపోవడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయినా జీర్ణాశయంలో కేబుల్ జాడ దొరకలేదు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆపరేషన్ బెడ్ మీదే ఎక్స్ రే పరీక్ష నిర్వహించారు. ఇక్కడే డాక్టర్లకు దిమ్మదిరిగే విషయం తెలిసింది. రోగి మూత్రాశయం లోపల దాదాపు రెండు అడుగుల పొడవైన కేబుల్‌ను గుర్తించారు. అతడు వైద్యులకు అబద్దం చెప్పాడనీ నోటి ద్వారా కాకుండా పురుషాంగం ద్వారా కేబుల్ చొప్పించబడిందని తేలిందని సర్జన్ డాక్టర్ వాలియుల్ ఇస్లాం వెల్లడించారు. “యురేత్రల్ సౌండింగ్'' అని పిలిచే ఒక రకమైన హస్త ప్రయోగమని, ఇది చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత నొప్పితో తమ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇలా అబద్ధం చెబుతాడని అస్సలు ఊహించలేదన్నారు. తన పాతికేళ్ల చరిత్రలో ఆపరేషన్ టేబుల్ మీద ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ సంగతి ముందే చెప్పి ఉంటే.. ఆపరేషన్ లేకుండానే కేబుల్‌ను తొలగించేవారిమని చెప్పారు. -
యాపిల్ ఛార్జింగ్ కేబుల్‌తో డాటా చోరీ..!
సాన్‌ఫ్రాన్సిస్కో: ఈ వార్త చదివాక ఇక మీదట వేరే వారికి డాటా కేబుల్ ఇవ్వాలన్నా.. తీసుకోవాలన్నా కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే.. చార్జింగ్ కేబుల్స్ కూడా డాటాను చోరీ చేస్తున్నాయట. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం అంటున్నాడో హ్యాకర్. ఇప్పటికే అవసరం నిమిత్తం కొన్ని.. అలవాటుగా కొన్ని యాప్స్‌ని మొబైల్స్‌లో ఇన్స్టాల్ చేసుకుని.. మన వ్యక్తిగత సమాచారాన్ని మూడో వ్యక్తికి అందజేస్తున్నాం. చార్జింగ్ కేబుల్ కూడా ఇదే పని చేస్తుందంటున్నాడు సదరు హ్యాకర్. చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. యాపిల్ యూఎస్బీ కేబుల్‌తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు. దీని గురించి సదరు హ్యాకర్ వివరిస్తూ.. ‘ఈ కాలంలో చాలా మంది ఫ్లాష్ డ్రైవర్స్‌ని వారి డివైజ్‌కి కనెక్ట్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. అదే చార్జింగ్ కేబుల్ దగ్గరకు వచ్చే సరికి ఇలాంటి అనుమానాలేవి కలగవు. కానీ చార్జింగ్ కేబుల్ కూడా మీ డాటాను చోరీ చేస్తుంది. ఓ.ఎంజీ కేబుల్‌గా పిలవబడే యాపిల్ యూఎస్బీ లైటెనింగ్ కేబుల్ చూడ్డానికి సాధరణ చార్జింగ్ కేబుల్‌లానే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఈ కేబుల్‌ని మీ డివైజ్‌కు కనెక్ట్ చేశారనుకోండి. వితిన్ వైఫై రేంజ్లో హ్యాకర్ మీకు తెలియకుండా మీ డివైస్‌లోకి హానికరమైన పేలోడ్స్‌ని వైర్‌లెస్‌గా పంపించగల్గుతాడు’ అని వివరించాడు. ‘ఈ చార్జింగ్ కేబుల్‌లో ఉండే కమాండ్స్, స్క్రిప్ట్స్, పేలోడ్స్‌ను ఉపయోగిస్తూ.. హ్యాకర్ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడు. అంతేకాదు ఒకసారి ఈ కేబుల్‌ను మీ సిస్టంకు కనెక్ట్ చేశారంటే.. అటాకర్ ఆటోమెటిగ్గా మీ కంప్యూటర్ను లాగాఫ్ చేయడం.. ఆ తర్వాత మీరు ఎంటర్ చేసే పాస్‌వర్డ్‌ను కూడా తస్కరించడానికి అవకాశం ఉంది’ అంటున్నాడు సదరు హ్యాకర్. మరి దీనిపై యాపిల్ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. -
అక్రమాల పుట్ట..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ నిర్మాణ పనుల కాంట్రాక్టుల రూపకల్పనలో కీలకమైన తెలంగాణ స్టేట్ స్టాండర్డ్స్ రేట్స్(ఎస్ఎస్ఆర్)జాబితా అక్రమాల పుట్టగా మారింది. నిపుణుల కమిటీ సిఫార్సు చేయకుండా, ఆయా కంపెనీల ఉత్పత్తుల నాణ్యతను ల్యాబ్‌లో పరీక్షించకుండా వాటికి ధరలు, కేటగిరీలు నిర్ణయించడంలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (టీఈసీఏ)ఆరోపించింది. ఇటు గుర్తింపు పొందిన విద్యుత్ కాంట్రాక్టర్లకే కాకుండా ప్రభుత్వానికి నష్టా లు తెచ్చిపెడుతున్న ఈ ఎస్ఎస్ఆర్ రూపకల్పనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. నిజానికి ప్రభుత్వ నిర్మాణాల్లో ఉపయోగించే ఏదైనా వస్తువు నాణ్యతను, ధరలను నిర్ణయించాలంటే నిపుణుల కమిటీ ముందుగా ఆయా వస్తువులను పరీక్షించాలి. అయితే విద్యుత్ వైర్లు, స్విచ్‌లు, ప్యానల్ బోర్డులు, కాపర్‌వైర్లు, ఫ్యూజ్‌లు, ఫ్యాన్లు, ఇంట్లో, వీధుల్లో వెలుగులు విరజిమ్మే ఎల్ఈడీ లైట్లు, స్విచ్గేర్లు, జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఏసీ, తదితర విద్యుత్ మెటీరియల్ ఎంపిక, వాటి ధర, నాణ్యతకు సంబంధించిన ఎస్ఎస్ఆర్ జాబితాను చీఫ్ విద్యుత్ తనిఖీ అధికారి(సీఈఐజీ) కాకుండా రహదారులు, భవనాలశాఖ చీఫ్ ఇంజినీర్ రూపొందిస్తుండటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కనీసం నిపుణుల కమిటీని సంప్రదించకుండా, మెటీరియల్‌ను ల్యాబ్‌లో పరీ క్షించకుండా ఏకపక్షంగా ఎస్ఎస్ఆర్ జాబితాను ఎంపిక చేస్తుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబందించి ఆర్అండ్బీ విభాగంలో కనీసం టెస్టింగ్ ల్యాబ్ లేకపోయినా విద్యుత్ మెటీరియల్ నాణ్యతతో పాటు ధరలను ఎలా నిర్ణయిస్తున్నారనే ప్రశ్నకు సంబంధిత అధికారుల వద్ద సమాధానం లేదు. ఒకే కేటగిరిలో అనేక కంపెనీల ఉత్పత్తులు ఉండటం, వాటిని కాంట్రాక్టర్లు వాడటం వల్ల ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది.నాసిరకం ఉత్పత్తుల కారణంగా ఆయా భవనాల్లో తరచూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరిగి కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన ఫైళ్లు దగ్ధం అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. సమగ్ర విచారణ జరిపించాలి ప్రభుత్వం చేపట్టే ఏ నిర్మాణ పనుల్లోనైనా ఆర్అండ్బీ రూపొందించిన స్టేట్ స్టాండర్డ్స్ రేట్స్ (ఎస్ఎస్ఆర్) ప్రకారం ఆయా కంపెనీల విద్యుత్ మెటీరియల్‌ను వాడాల్సి ఉంది. ఎస్ఎస్ఆర్ జాబితా రూపొందించిన ధరల ప్రకారమే ప్రభుత్వ శాఖలు ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలుస్తాయి. ఎస్ఎస్ఆర్ జాబితాలో 1518 విద్యుత్ వస్తువులు ఉండగా, వీటిని మూడు కేటగిరిలుగా విభజించారు. ఒక్కో కేటగిరిలో 10 నుంచి 15 కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను చేర్చారు. ఐటమ్ స్పెసిఫికేషన్ పరిశీలించకుండా వీటిని జాబితాలో చేర్చి, కేటగిరీల వారీగా ధరలు నిర్ణయించడం వల్ల ఏదీ నాణ్యమైనదో? ఏదీ నాసిరకమైనదో తెలియక విద్యుత్ కాంట్రాక్టర్లే కాదు..ఆయా విభాగాల ఇంజినీర్లు సైతం తలపట్టుకుంటున్నారు. వాస్తవానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ ప్రకారం నాణ్యమైన వస్తువులను వాడాల్సి ఉంది. అయితే ఎస్ఎస్ఆర్ జాబితాలో మూడు కేటగిరీలు ఉండటం, ఒక్కో కేటగిరిలో లెక్కకు మించి కంపెనీలు ఉండటం ఇబ్బందిగా మారుతోంది. అంతేకాదు సివిల్ కాంట్రాక్టర్లకు 13.61 శాతం ఓవర్‌హెడ్ కలుపుతూ, రిజిస్టర్డ్ విద్యుత్ కాంట్రాక్టర్లపై వివక్ష చూపుతున్నారు. ఇప్పటికైనా ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలి.–కందుకూరి శ్రీనివాస్, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్ ఏడాది తిరిగేలోపే కేటగిరి మార్పు గతంలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలోనే ఎస్ఎస్ఆర్ రూపొందించేవారు. నిర్మాణ పనులతో పాటు ఎలక్ట్రికల్ పరికరాలకు సంబంధించిన పనులు నిర్వహించేవారు. జాబితాలో రూపొందించిన ధరల ప్రకారమే టెండర్ పిలిచేవారు. మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఏ విభాగానికి ఆ విభాగం ఇంజినీరింగ్ సెక్షన్‌ను ప్రత్యే కంగా ఏర్పాటు చేసుకుని, ప్రత్యేకంగా ఇంజినీర్లను నియమించుకుంది. నిజానికి ఏదైనా కంపెనీ మెటీరియల్ ఎస్ఎస్ఆర్ జాబితాలో చేర్చాలన్నా..ధరలను పెంచాలన్నా..తగ్గించాలన్నా..ఆయా విభాగాల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్ నిపుణులతో చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గత ఐదేళ్లుగా ఎలాంటి చర్చలు, నాణ్యత పరీక్షలు జరుపకుండానే విద్యుత్ వస్తువులను జాబితాలో చేర్చుతుండమే కాదు ఏకంగా వాటిని తొలి కేటగిరిలో చేర్చుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వాటి ధరలను మార్చాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. అడిగినంత అప్పగిస్తే చాలూ.. మూడో కేటగిరిలో ఉన్న కంపెనీ ఉత్పత్తులను మొదటి కేటగిరిలోకి మార్చడం, మొదటి కేటగిరిలో ఉన్న కంపెనీ ఉత్పత్తులను మూడో కేటగిరిలోకి మార్చడం పరిపాటిగా మారింది. ఒకసారి కేటగిరి నిర్ధారించిన తర్వాత అదే కంపెనీకి చెందిన అదే వస్తువుకు ఆ తర్వాతి ఏడాది కేటగిరీల్లో మార్పు ఎందుకు చోటు చేసుకుంటుందో అర్థం కావడం లేదు. –మాజీద్, కార్యదర్శి, టీఈసీఏ -
బండబడ.. పనిసాగదే..
ఆశ చూపి ఊరించడం.. ఆనక తేలిగ్గాతప్పించుకోవడం చంద్రన్న పాలనలో సహజపరిణామాలు. బాబుగారి జమానాలో ఇలా ఆశలుఅడియాసలైన బాధితుల జాబితా పెద్దదేఉంటుందన్నది తెలిసిందే. తాజాగా జీవీఎంసీకిబాబు మరోసారీ ఝలక్ ఇచ్చారు. ఈసారి ఓట్లమోళీ బడ్జెట్లో బోలెడు హామీలు ఇచ్చినఆర్థిక మంత్రి యనమల జీవీఎంసీని, అందులోపనిచేసే వేలాది మంది సిబ్బందిని ఊరించిఉసూరనిపించారు. 010 పద్దు అమలు చేయాలంటూమహావిశాఖ నగరపాలక సంస్ధ నాలుగున్నరేళ్లు పైగానివేదిస్తున్నా.. అపుడో ఇపుడో అన్నట్టు ఆశలు రేకెత్తించి,చివరికి బడ్జెట్లో ఆ ప్రస్తావనే తీసుకురాకుండాఉద్యోగులను వెక్కిరించినంత పనిచేశారు.భారం తగ్గుతుందనుకున్నజీవీఎంసీకీ రిక్తహస్తం చూపారు. విశాఖసిటీ: ఓటు బడ్జెట్‌ను ఓటి బడ్జెట్‌గా మార్చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. మరోసారి జీవీఎంసీకి సారీ చెప్పేసింది. 010 పద్దు అమలు చెయ్యాలంటూ నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వానికి నివేదిస్తున్నా.. ఇదిగో అదిగో అంటూ మీనమేషాలు లెక్కించిన సర్కారు.. చివరి బడ్జెట్లోనూ పద్దు ప్రస్తావనే తీసుకురాకపోవడంతో.. మహా విశాఖ నగర పాలక సంస్థ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. మరోవైపు.. 113 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిప్ పేరుతో రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని బాహాటంగా చెప్పిన సర్కారు.. బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లతోనే సరిపెట్టడం సర్వత్రా విస్మయానికి గురిచేసింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారా అని మహా విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 5 వేల మంది ఉద్యోగులు ఎదురు చూశారు. విత్త మంత్రి బడ్జెట్ చదువుతున్నంత సేపూ.. ఆశగా విన్నారు. కానీ.. వారి ఆశల్ని నీరుగార్చేలా.. ప్రసంగ పాఠం విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టు పనుల్లో ప్రతికూలత ఏర్పడుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపానుకు విశాఖలో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో రూ.787 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టును చేపట్టింది. 2017 అక్టోబర్ పదో తేదీన ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. నగరంలో మొదటి దశ కింద నాలుగు ప్యాకేజీల్లో దాదాపు 2,015 కిలోమీటర్ల మేర విద్యుత్ కేబుల్ లైన్లు వేయాలని నిర్ణయించారు. ఈ పనులు ప్రారంభించి నప్పట్నుంచి 18 నెలల్లో అంటే.. ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కేబుళ్ల కోసం జరుపుతున్న తవ్వకాల్లో రాళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, టెలిఫోన్ కేబుళ్లు అడ్డంకిగా మారుతున్నాయి. తవ్వకాలకు అన్నిటికంటే రాళ్లు ప్రతిబంధకాలుగా మారాయి. ముఖ్యంగా వెంకటేశ్వరమెట్ట, నౌరోజీరోడ్డు, దస్పల్లా హిల్స్ తదితర ప్రాంతాల్లో రాళ్ల బెడద అధికంగా ఉంది. ఈ రాళ్లను తొలగించడం సంబం«ధిత కాంట్రాక్టు సంస్థలకు కష్టసాధ్యమవు తున్నాయి. ఇలాంటి చోట డ్రిల్లింగ్ యంత్రాల ద్వారా రాళ్లను తొలగిస్తున్నారు. వీటిని తొలగించి పనులు కొనసాగించడానికి ఎక్కువ సమయం పడుతోంది. భూగర్భ విద్యుత్ కేబుళ్లను 1.2 మీటర్ల లోతున అమరుస్తున్నారు. వాటికి పైన ఉన్న వివిధ కేబుళ్లను సరిచేస్తూ దిగువన విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో భూగర్భ కేబుల్ పనులు ఆశించినంతంగా ముందుకు సాగడం లేదని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. మరో ఏడాది ఆలస్యం..! ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ ప్రాజెక్టు పూర్తికి నిర్ణీత సమయం (జులై 2019) కంటే మరో ఏడాది అదనంగా పట్టే అవకాశం ఉందని ఈపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల కోసం ఆయా ప్రాంతాల్లో ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రాళ్లు పడిన చోట్ల పనులు ముందుకు సాగకపోవడంతో ఇనుప బారికేడ్లను అక్కడే ఉంచేయడం వల్ల స్థానికులకు ఇబ్బందులెదురవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేబుల్ వైర్లు ఏర్పాటు చేసిన చోట పనులు పూర్తయ్యాకే కొత్తగా మరో ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాలని ఈపీడీసీఎల్ అధికారులు నిర్ణయించారు. సత్వరమే పనులు పూర్తి చేస్తాం నగరంలో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు కొన్నిచోట్ల వేగంగానే జరుగుతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం బండరాళ్లు ఉండడం వల్ల తవ్వకాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని తొలగించడానికి చాలా సమయం పడుతుండడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమవుతోంది. సత్వరమే భూగర్భ కేబుల్ ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి కృషి చేస్తున్నాం.– రమేష్‌ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీఈపీడీసీఎల్ -
హాత్వే ఓటీటీ సెట్ టాప్ బాక్స్
ముంబై: కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో ఉన్న హాత్వే తాజాగా ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత ఓవర్ ద టాప్ సెట్ టాప్ బాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఓవర్ ద టాప్ విభాగంలో టీవీ వీక్షణం సులభతరం చేసే లక్ష్యంగా కంపెనీ దీనిని రూపొందించింది. రిమోట్ కంట్రోల్‌కు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ప్లే కోసం ప్రత్యేక బటన్లు ఏర్పాటు చేశామని హాత్వే ఎండీ రాజన్ గుప్తా ఈ సందర్భంగా వెల్లడించారు. అంతర్జాతీయ, దేశీయ టీవీ సిసీస్, మూవీస్ వంటి కంటెంట్‌ను నేరుగా పొందేందుకు ఈ బాక్స్ తోడ్పడుతుంది. ఫోన్లో ఉన్న కంటెంట్‌ను టీవీలో వీక్షించొచ్చు. గూగుల్ ప్లే కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు. అల్ట్రా స్మార్ట్ హబ్ పేరుతో కేబుల్ హైబ్రిడ్ బాక్స్‌ను సైతం హాత్వే ప్రవేశపెట్టింది. కార్యక్రమంలో సినీ నటి రాధిక ఆప్టే, ఆండ్రాయిడ్ టీవీ అపాక్ హెడ్ మార్క్ సీడెన్ఫెడ్ పాల్గొన్నారు. -
హైటెక్ సిటీలో 7వ కేబుల్ ఎక్స్పో విజన్
-
నిర్లక్ష్యం ఖరీదు కోటిన్నర!
చీమకుర్తి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెండు బాధ్యతాయుతమైన శాఖల మధ్య కొరవడిన సమన్వయం తీవ్ర నష్టానికి కారణమైంది. కోట్లాది రూపాయల విలువైన కేబుల్ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఒంగోలు నగరం నుంచి కర్నూలు రోడ్డును ఫోర్‌లైన్‌గా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా ఆర్అండ్బీ అధికారులు ఒంగోలు బైపాస్ సమీపంలోని నవభారత్ భవనాల నుంచి పేర్నమిట్ట సంతనూతలపాడు వైపునకు సుమారు 5 కి.మీ పొడవునా రోడ్డును తవ్వేశారు. విచక్షణా రహితంగా తవ్వేయడంతో మార్జిన్ కింద ఉన్న టెలికం రంగానికి చెందిన కోట్ల విలువ చేసే కేబుల్ వైర్లు ధ్వంసమయ్యాయి. బీఎస్ఎన్ఎల్కు చెందిన విలువైన కేబుల్ పూర్తిగా ధ్వంసమైందని టెలికం అధికారులు వాపోతున్నారు. ఆర్అండ్బీ, టెలికం రంగాలకు చెందిన రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే టెలికం కేబుల్ ధ్వంసం కావడానికి కారణంగా కనిపిస్తోంది. ఒంగోలు అంజయ్యరోడ్డు, పేర్నమిట్ట పరిధిలోనున్న టెలికం కార్యాలయాలకు చెందిన కేబుల్ కర్నూల్ రోడ్డులో ఎక్కువగా ఉంది. ధ్వంసమైన కేబుల్ విభాగాల్లో 200 పెయిర్, 100, 20, 15 పెయిర్ కేబుల్స్ ఉన్నట్లు సాంకేతిక సిబ్బంది తెలిపారు. మెయిన్‌లైన్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ లైన్ల నుంచి పక్కనున్న వీధులకు సరఫరా చేసే కేబుల్స్ «ధ్వంసమైన వాటిలో ఉన్నాయన్నారు. మూగబోయిన ఫోన్లు.. ధ్వంసమైన కేబుల్, మళ్లీ వాటిస్థానంలో ఏర్పాటు చేయాల్సిన కొత్త కేబుల్ విలువలే బీఎస్ఎన్ఎల్కు చెందిన వాటి విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉండొచ్చని, ఇక ప్రైవేటు రంగానికి చెందిన ఐడియా, ఎయిర్టెల్, రిలయన్స్ వంటి సంస్థలకు చెందిన కేబుల్స్ విలువ మరో రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా. వాటితో పాటు నెల రోజులుగా కేబుల్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడంతో వాటి పరి«ధిలోనున్న ల్యాండ్‌లైన్ ఫోన్లు, బ్రాడ్‌బాండ్‌లు, సెల్ఫోన్లు వేల సంఖ్యలో మూగబోయినట్లు వినియోగదారులు వాపోతున్నా రు. వాటి ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని టెలికం కంపెనీలకు రెవెన్యూ ద్వారా సుమారు మరో రూ.50 లక్షలు ఆదాయాన్ని కోల్పోయినట్లు ఆయా శాఖల అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన కేబుల్‌కు పరిహా రాన్ని ఆర్అండ్బీ డిపార్టుమెంట్ నుంచి వసూలు చేసుకోవచ్చా..? రోడ్డు విస్తరణలో టెలికం వారికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా..? అనే అంశాలపై ఆర్అండ్బీ అధికారుల వద్ద స్పష్టత లేకపోవడం గమనార్హం. నెల రోజుల పాటు ప్రజలకు అందాల్సిన టెలికం సేవలకు ప్రజలు పడిన అవస్థలకు ఎంత విలువ కడతారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. -
కేబుల్ వార్
నంద్యాలలో సరికొత్త రాజకీయం - కేబుల్ విస్తరణ పనుల చుట్టూ టీడీపీ నేత ఎత్తులు – శిల్పా కేబుల్ పనులను అడ్డుకోవాలని ఎస్పీకి భూమా వర్గం ఫిర్యాదు – అధికార పార్టీలో ఇప్పటికే ఉప ఎన్నికల వేడి - తాజాగా కేబుల్ వైర్లకు రాజకీయ రంగు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి కేబుల్ వైర్లను తాకింది. శిల్పా కేబుల్ విస్తరణ పనులను అడ్డుకోవాలని భూమా కేబుల్ వర్గం నేరుగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ)కి ఫిర్యాదు చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేబుల్ విస్తరణ పనులను చేపట్టకూడదని.. అయినప్పటికీ శిల్పాకు చెందిన కేబుల్ సంస్థ విస్తరణ పనులను చేస్తుందని ఈ ఫిర్యాదులో భూమా కేబుల్ వర్గం ఎస్పీకి చేసిన పిర్యాదులో పేర్కొంది. వాస్తవానికి ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల రాజకీయ వేడి అధికార పార్టీలో కాక పుట్టిస్తోంది. తాజాగా కేబుల్ వార్తో ఇది మరింత ముదరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. భూమా కేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలని నంద్యాల డీఎస్పీని ఎస్పీ ఆదేశించినట్లు తెలిసింది. ఆది నుంచి వార్ వాస్తవానికి నంద్యాలలో భూమా, శిల్పా వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది రాజకీయాలతో పాటు కేబుల్ బిజినెస్‌లోనూ ప్రస్పుటమవుతోంది. తాజాగా నంద్యాల ఉప ఎన్నికలు రావడం, అందులో తమ కుటుంబానికే సీటు ఇవ్వాలని భూమా వర్గం కోరుతుంది. మరోవైపు శిల్పా మోహన్‌రెడ్డి తనకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కోవలో ఆయన నేరుగా ముఖ్యమంత్రిని కూడా కలిసి విన్నవించారు. ఒకవేళ తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించారు కూడా. అయితే భూమా కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య రాజకీయ వేడి మరింత రాజుకుంది. తాజాగా శిల్పా కేబుల్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఇది ఇరువర్గాల మధ్య చిచ్చు రాజేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకోర్టు ఆదేశాలపైనే ఫిర్యాదు ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్, ఫోన్, టీవీ ప్రసారాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైబర్ నెట్ పథకానికి శ్రీకారం చుట్టింది. నంద్యాల డివిజన్లో ఈ పనులను భూమా కేబుల్ సంస్థ దక్కించుకుంది. వాస్తవానికి సైబర్ నెట్ ఉద్దేశాల మేరకు ఇతర కేబుల్ సంస్థలకు చెందిన కేబుల్ తీగలు విద్యుత్ స్తంబాలపై వేలాడకూడదు. అలాంటి కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని స్వయంగా సీఎం ఆదేశించారు. అయితే దీనిపై ఇతర కేబుల్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇదే కోవలో హైకోర్టు కూడా ప్రస్తుతం ఉన్న యధాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఆదేశాలకు భిన్నంగా శిల్పా కేబుల్ సంస్థ యధాతథ స్థితిలో ఉంచకుండా విస్తరణ పనులను చేపడుతుందనేది ఇప్పుడు భూమా కేబుల్ సంస్థ వాదన. అందువల్ల ఎస్పీకి చేసిన ఫిర్యాదులో ఎలాంటి రాజకీయం లేదని, కేవలం హైకోర్టు ఆదేశాలపైనే ఫిర్యాదు చేశామనేది భూమా కేబుల్ సంస్థ చెబుతోంది. అయినప్పటికీ కేబుల్ వ్యాపారంలోనూ ఇటు భూమా, అటు శిల్పా వర్గాలు ఉండటంతో రాజకీయ రంగు అలుముకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకే సీటు వస్తుందని భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొంటుండగా తమకే వస్తుందని శిల్పావర్గం అంటోంది. మరోవైపు ఇదే సీటు కోసం మాజీ మంత్రి ఫరూక్, ఎస్పీవై రెడ్డి వర్గాలు కూడా ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ రాజకీయ చదరంగానికి తోడు కేబుల్ వ్యాపారంలో పట్టు కోసం సాగుతున్న పోరు నంద్యాల రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఈ పరిణామాలు చివరికి ఎటు దారి తీస్తాయన్నది తేలాల్సి ఉంది. -
కేబుల్ ఆపరేటర్లను అనుమానిస్తున్నారు
సెటాప్ బాక్సుల ధరలు ఒకేలా ఉండాలి కేబుల్ టీవీ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు పి.గన్నవరం : ఒకొక్క కంపెనీ సెటాప్ బాక్సు ఒక్కో రకంగా ఉండడం వల్ల, కేబుల్ ఆపరేటర్లను వినియోగదారులు అనుమానిస్తున్నారని కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెలాఖరులో విజయవాడలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో పి.గన్నవరం నియోజకవర్గ కేబుల్ టీవీ ఆపరేటర్ల సమావేశం జరిగింది. సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఉలిశెట్టి బాబీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వెంకట్రావు మాట్లాడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలు విక్రయిస్తున్న సెటాప్ బాక్సుల ధరలన్నీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి, భద్రత కల్పించాలని, రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. కేబుల్ ఆపరేటర్లతో పే చానల్స్ నిర్వాహకులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని విడనాడాలని సమావేశం డిమాండ్ చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని తీర్మానించింది. సమావేశంలో సంఘ నాయకులు ఎస్.సూర్యనారాయణ, ఇడుపుగంటి రామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
డమ్మీ కేబుల్ ఆపరేటర్‌కు సహకరిస్తున్న ఎస్సై
పోలీసు కమిషనర్‌ను కలిసిన ఆపరేటర్లు వరంగల్ : పర్వతగిరి మండలం నారాయణపురంలోని కేబుల్ ఆపరేటర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న డమ్మీ ఆపరేటర్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఆయనకే సహకరిస్తున్న ఎస్సైపై విచారణ జరపాలని తెలంగాణ రూరల్ ఎంఎస్ఓ, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు శనివారం పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్స్ వెల్పేర్ అసోసియేషన్‌కు చెందిన ఓఎఫ్సీ కేబుల్‌ను నారాయణపురంలోని వాటర్ ట్యాంకు వద్ద మూడ్ రవి కట్ చేసి తన బంధువులకు కనెక్షన్ ఇచ్చాడని తెలిపారు. ఈ విషయమై పర్వతగిరి ఎస్సైకి ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాల సీడీ అందజేస్తే ప్రొబెషనరీ ఎస్సైతో విచారణ చేయించారని పేర్కొన్నారు. అనంతరం అక్రమంగా బిగించిన ఓఎఫ్సీ వైరు తొలగించారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మళ్లీ గత నెలలో వైర్ కట్ చేసి వేరే కనెక్షన్లు ఇస్తుండగా సూర రమేష్‌ను పట్టుకుని ప్రశ్నిస్తే ఎస్సై చెబితేనే చేస్తున్నట్లు తెలిపాడన్నారు. ఈ విషయమై ఎస్సైని కలిస్తే పట్టించుకోకపోగా పర్వతగిరి ఎంఎస్ఓకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపిం చాలని పర్వతగిరి ఎంఎస్ఓ గోగినేని భవానీశంకర్రావుతో పాటు అసోసియేషన్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్, సెక్రటరీ బైరీ శ్రీనివాస్, వంగాల ఉమాశంకర్లింగం, రాజేష్ కోరారు. -
డమ్మీ కేబుల్ ఆపరేటర్‌కు సహకరిస్తున్న ఎస్సై
పోలీసు కమిషనర్‌ను కలిసిన ఆపరేటర్లు వరంగల్ : పర్వతగిరి మండలం నారాయణపురంలోని కేబుల్ ఆపరేటర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న డమ్మీ ఆపరేటర్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఆయనకే సహకరిస్తున్న ఎస్సైపై విచారణ జరపాలని తెలంగాణ రూరల్ ఎంఎస్ఓ, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు శనివారం పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్స్ వెల్పేర్ అసోసియేషన్‌కు చెందిన ఓఎఫ్సీ కేబుల్‌ను నారాయణపురంలోని వాటర్ ట్యాంకు వద్ద మూడ్ రవి కట్ చేసి తన బంధువులకు కనెక్షన్ ఇచ్చాడని తెలిపారు. ఈ విషయమై పర్వతగిరి ఎస్సైకి ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాల సీడీ అందజేస్తే ప్రొబెషనరీ ఎస్సైతో విచారణ చేయించారని పేర్కొన్నారు. అనంతరం అక్రమంగా బిగించిన ఓఎఫ్సీ వైరు తొలగించారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మళ్లీ గత నెలలో వైర్ కట్ చేసి వేరే కనెక్షన్లు ఇస్తుండగా సూర రమేష్‌ను పట్టుకుని ప్రశ్నిస్తే ఎస్సై చెబితేనే చేస్తున్నట్లు తెలిపాడన్నారు. ఈ విషయమై ఎస్సైని కలిస్తే పట్టించుకోకపోగా పర్వతగిరి ఎంఎస్ఓకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపిం చాలని పర్వతగిరి ఎంఎస్ఓ గోగినేని భవానీశంకర్రావుతో పాటు అసోసియేషన్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్, సెక్రటరీ బైరీ శ్రీనివాస్, వంగాల ఉమాశంకర్లింగం, రాజేష్ కోరారు. -
హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం..చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్
అట్లాంటిక్ సముద్రంలో 6,600 కి.మీ. కేబుల్ ఏర్పాటుకు ప్రయత్నం శాన్ఫ్రాన్సిస్కో: హై-స్పీడ్ ఇంటర్నెట్ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు రెండూ చేతులు కలిపాయి. అట్లాంటిక్ సముద్రం అడుగున కేబుల్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఒకే వేదికపైకి వచ్చాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్, క్లౌడ్ సేవల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, దాన్ని అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు 6,600 కిలోమీటర్ల మేర కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీనికి ‘మరియా’ అని నామకరణం చేశాయి. దీని సామర్థ్యం 160 టీబీపీఎస్‌గా ఉంటుందని అంచనా. దీంతో అట్లాంటిక్ సముద్రంలో నిర్మితమౌతున్న అత్యధిక సామర్థ్యం ఉన్న కేబుల్‌గా మరియా అవతరించనున్నది. అలాగే అమెరికా, యూరప్‌ను కలుపుతూ ఏర్పాటవుతోన్న తొలి కేబుల్ కూడా ఇదే. కేబుల్ ఏర్పాటు వర్జీనియా బీచ్ (అమెరికా) నుంచి బిల్బావు (స్పెయిన్) వరకు జరగనున్నది. 2017 నాటికి పూర్తి: కేబుల్ నిర్మాణ పనులు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం అవుతాయని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఇక కేబుల్ ఏర్పాటు 2017 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని పేర్కొన్నాయి. -
రూ.149కే ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్
విజయవాడ: హీరో మోటార్స్ కు 600 ఎకరాలు (ఎకరా లక్ష చొప్పున), యాక్సిలరీ యూనిట్స్‌కు 200 ఎకరాలు(ఎకరా 10 లక్షల చొప్పున) కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోమవారం విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.3,200 కోట్ల పెట్టుబడితో, ప్రత్యక్షంగా 10వేలు, పరోక్షంగా మరో 10వేలు ఉద్యోగాల కల్పించనున్నారు. ఇది పూర్తయితే సౌత్ ఇండియాలో హీరో మోటార్స్ పరిశ్రమ ఇదే ప్రథమం. మరోపక్క, అర్జున అవార్డు గ్రహీత, పోలీస్ బాక్సింగ్ కోచ్ శ్రీశీ రాజయరాం కు విశాఖలో ఎండాడ గ్రామంలో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నారు. రెవెన్యూ గెస్ట్ హౌస్ నిర్మాణానికి నర్సీపట్నంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారికి 10సెంట్లు స్థలం(చ.గ రూ.1000 చొప్పున) అనంతపురం జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్టుల స్థాపనకు (ఎ) పుట్లూరు మండలంలో మాదుగుపల్లి, ఎల్లుట్ల గ్రామాలలో 9.88 ఎకరాలు (బి) తాడిమర్రి మండలంలోని చిల్లవారి పల్లి గ్రామంలో 11.42 ఎకరాలు (సి) నార్పాల మండలంలో నార్పాల మరియు గూగుడు గ్రామాలలో 77.28 ఎకరాలు మొత్తం 98.58 ఎకరాలు అనంత సాగర్ నాన్ రెన్వూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ మరియు అనంత సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి సంయుక్తంగా 25 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నిర్మించడానికి దక్షణ మధ్య రైల్వే వారికి 16.45 ఎకరాల భూమి ఉచితంగా కేటాయించాలని నిర్ణయించారు. పీపీపీ పద్ధతిలో ట్రిపుల్ ఐటి స్థాపించడానికి చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని మల్లవారి పాలెం గ్రామంలో 35.09 ఎకరాలను కమిషనర్ సాంకేతిక విద్య వారికి ఉచితంగా కేటాయించనున్నారు. ఇ-ప్రగతిలో ఒరాకిల్ కస్టమర్ హబ్ ప్రోడక్ట్, వారి కన్సల్టెన్స్ సర్వీసులను ఉపయోగించుకుని పీపుల్ హబ్ డేటాను తయారుచేయాలని నిర్ణయించారు. దీనివల్ల రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలకు సంబందించిన పూర్తి డేటా, ఇండివిడ్యువల్ బెనిఫిట్స్, రేషన్ కార్డుల వివరాలు తెలుస్తాయి. మే 20లోగా దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. రాబోయే జూలై లోపు రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి రూ.149కే ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్, కేబుల్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. -
హైటెన్షన్ వైర్లు తెగిపడి 11మంది మృతి
గౌహతి: అసోంలోని టిన్సుకియా జిల్లాలో నిరసనకారుల ఆందోళన పెను ప్రమాదానికి దారి తీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హై వోల్టేజీ కేబుల్ తెగిపడిన దుర్ఘటనలో 11మంది మరణించగా, మరో 20మందికి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..మూడు రోజుల క్రితం జరిగిన జంట హత్యలకు కారకులైన వారిని తమకు అప్పగించాలంటూ కొంతమంది...స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కత్తులు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పటంతో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే గాల్లోకి దూసుకుపోయిన కొన్ని బుల్లెట్లు దగ్గరలో వున్న కరెంట్ పోల్‌కు తాకడంతో అది కుప్పకూలింది. అది నేరుగా ఆందోళన చేస్తున్న వారిపై పడటం, హై వోల్టేజి కేబుల్ వైర్లు వారిని తాకడం క్షణాల్లో జరిగిపోయింది. ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో మరి కొంతమందికి బుల్లెట్ గాయాలు తగిలాయి. కాగా పరిస్థితి చేయి దాటడంతో గాల్లోకి, ఆందోళనకారులపై కాల్పులు జరపాల్సివ చ్చిందని డీజీపీ ముఖేష్ సహాయ్ చెప్పారు.కేంద్ర పారామిలిటరీ దళాలు, పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి తరలించిన సీనియర్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. -
అండర్‌గ్రౌండ్ విద్యుత్తు కేబుల్‌లో విస్ఫోటం
పద్మారావునగర్(హైదరాబాద్): పద్మారావునగర్ డివిజన్ భోలక్‌పూర్ ఏరియాలో గురువారం రాత్రి అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్‌లో పేలుడు చోటుచేసుకుంది. భోలక్‌పూర్ మేకలమండి ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ సంఘటన జరిగింది. చిలకలగూడ నుంచి బన్సీలాల్‌పేట్‌కు సబ్‌స్టేషన్ వరకు భోలక్‌పూర్ మీదుగా ఏడాది క్రితం అండర్‌గ్రౌండ్ విద్యుత్తు కేబుల్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఉన్నట్టుండి గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భోలక్‌పూర్ మేకలమండి ప్రభుత్వ పాఠశాల సమీపంలో పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయకంపితులయ్యారు. ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి రోడ్డుపై చిన్నపాటి గుంతపడింది. స్ధానికంగా డ్రై నేజీ పైపులైన్ పనుల సందర్భంగా ప్రొక్లెయినర్‌తో తవ్వకాలు జరుగుతుండటంతో విద్యుత్తు కేబుల్ ఏమైనా డ్యామేజ్ అయి విస్ఫోటం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
HDSD ఫార్మెట్లో జిపిటీఎల్ ద్వారాప్రసారాలు
-
పంచుకుతిన్నది..రూ.15కోట్ల పైనే!
ఎన్పీడీసీఎల్లో భారీ కుంభకోణం 11,223 ట్రాన్స్ఫార్మర్లకు అదనంగా చెల్లించిన అధికారులు ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రూ.13వేల పైచిలుకు చెల్లింపు హన్మకొండ, న్యూస్‌లైన్ : మనం ఏదైనా కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్తే రూ.100 చెప్పిన వస్తువును రూ.80కు ఇవ్వాలంటూ బేరమాడతాం. రూ.100 వస్తువుకు రూ.150 మాత్రం చెల్లించేందుకు అంగీకరించం. కానీ, ఎన్పీడీసీఎల్ అధికారులు అదే చేశారు. వినియోగదారుల నుంచి రూపాయి రూపాయి ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. ఇప్పటికే కేబుల్ కుంభకోణంతో అభాసుపాలైన అధికారులు... ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులోనూ చేతివాటం ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో ఒకటి కాదు రెండు కాదు.. కాంట్రాక్టర్లతో కలిసి రూ.15 కోట్లు పంచుకున్నారు. కంపెనీ ధరను కాదని అదనంగా చెల్లించిన ఈ వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. హెచ్‌వీడీఎస్ కింద కొనుగోళ్లు ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్ సర్కిల్‌తో పాటు పలు డివిజన్లలో 2010-2011 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేశారు. హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూటరీ సిస్టం(హెచ్‌వీడీఎస్) కింద 16కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 6114, 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 5109 కొనుగోలు చేశారు. వీటి కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించినప్పుడు కాంట్రాక్టర్లు 16 కేవీ ట్రాన్స్ఫార్మర్కు రూ.47,687, 25 కేవీకేకు రూ.54,553 చొప్పున కోట్ చేశారు. కానీ అంతకుముందు అధికారులు రూ.37,200, రూ.47,724 గానే ధర నిర్ధారించారు. అయితే, ఈ ధరకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మూడుసార్లు పరిశీలించిన అధికారులు చివరకు 16 కేవీఏకు రూ. 46,350, 25 కేవీఏ ట్రాన్మ్‌ఫార్మర్‌కు రూ.54,570గా కంపెనీ ధరను నిర్ణయించారు. ఇక్కడే కలిసిపోయారు.. మూడు సార్లు ధరలను పరిశీలన చేసి సవరించిన కాలంలోనే కాంట్రాక్టర్లు, అధికారులు కలిసిపోయారు. తలా కొంత పంచుకునేందుకు ప్లాన్ వేశారు. సవరించిన ధర కంటే అదనంగా చెల్లింపులు చేసేందుకు పకడ్బందీగా పథకం రచించారు. విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తే సరిపోతుంది... ధరలు ఎవరు చూస్తారనే నెపంతో ప్రజాధనాన్ని దోచుకోవాలని ప్లాన్ చేశారు. కాంట్రాక్టర్లు ట్రాన్స్‌ఫార్మరు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదనే సాకుతో ఎన్పీడీసీఎల్ అధికారులు ధరలను సవరించారు. 16కేవీఏ ట్రాన్మ్‌ఫార్మర్‌కు రూ.46,350, 25 కేవీకేకు రూ.54,570 చెల్లించేందుకు అంగీకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా 16 కేవీకే ట్రాన్మ్‌ఫార్మర్‌కు రూ.59,581 చొప్పున అంటే మార్కెట్ ధర కంటే రూ.13,231 అదనంగా చెల్లించారు. ఇక 25 కేవీకేకు రూ.68,248 చొప్పున అంటే ఒక్కో ట్రాన్మ్‌ఫార్మర్‌కు రూ.13,678 అదనంగా చెల్లించినట్టు. 16కేవీకే ట్రాన్మ్‌ఫార్మర్లు 6114 కొనుగోలు చేయగా అదనంగా రూ.8,08,94,334, 25 కేవీకే ట్రాన్మ్‌ఫార్మర్లు 5109 కొనుగోలు చేస్తే అదనంగా రూ.6,98,80,902 కాంట్రాక్టర్లకు చెల్లిం చారు. మొత్తంగా రూ.15,07,75,236 కాంట్రాక్టర్లు అదనంగా చెల్లించిన అధికారులు ఇందులో చెరి సగం పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారుల నుంచి రెండు, మూడేళ్ల క్రితం వాడుకున్న విద్యుత్ బిల్లుల్లో రూపాయి సైతం వదలకుండా వసూలు చేసే అధికారులు.. కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
ఎయిర్‌సెల్ కస్టమర్లకు ఫేస్బుక్ ఉచితం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు టెలికం రంగ కంపెనీ ఎయిర్‌సెల్ తాజాగా ఉచిత ఫేస్బుక్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త కస్టమర్లకు 60 రోజుల కాల పరిమితితో నెలకు 50 ఎంబీ చొప్పున, పాత కస్టమర్లకు 30 రోజుల కాలపరిమితితో 50 ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. 50 ఎంబీ పూర్తి అయితే 10 కేబీ డేటా వాడకానికి 2 పైసలు చార్జీ చేస్తారు. స్టార్121స్టార్999హ్యాష్ డయల్ చేసి కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఫేస్బుక్ కోసం ప్రత్యేక టారిఫ్ ప్యాక్‌లను సైతం కంపెనీ ప్రవేశపెట్టింది. రూ.14 ప్యాక్‌తో 100 ఎంబీ 2జీ/3జీ డేటాను 28 రోజులపాటు వినియోగించుకోవచ్చు. 5 రోజుల వ్యాలిడిటీగల రూ.5 ప్యాక్‌తో 25 ఎంబీ డేటా ఉచితం. అలాగే రూ.5 రీచార్జ్ చేస్తే రూ.10, 20, 30 రీచార్జ్‌పై పూర్తి టాక్‌టైం అందిస్తున్నట్టు ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ తివానా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు.