
ముంబై: కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో ఉన్న హాత్‌వే తాజాగా ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత ఓవర్ ద టాప్ సెట్ టాప్ బాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఓవర్ ద టాప్ విభాగంలో టీవీ వీక్షణం సులభతరం చేసే లక్ష్యంగా కంపెనీ దీనిని రూపొందించింది. రిమోట్ కంట్రోల్‌కు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ప్లే కోసం ప్రత్యేక బటన్లు ఏర్పాటు చేశామని హాత్‌వే ఎండీ రాజన్ గుప్తా ఈ సందర్భంగా వెల్లడించారు.
అంతర్జాతీయ, దేశీయ టీవీ సిసీస్, మూవీస్ వంటి కంటెంట్‌ను నేరుగా పొందేందుకు ఈ బాక్స్ తోడ్పడుతుంది. ఫోన్లో ఉన్న కంటెంట్‌ను టీవీలో వీక్షించొచ్చు. గూగుల్ ప్లే కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు. అల్ట్రా స్మార్ట్ హబ్ పేరుతో కేబుల్ హైబ్రిడ్ బాక్స్‌ను సైతం హాత్‌వే ప్రవేశపెట్టింది. కార్యక్రమంలో సినీ నటి రాధిక ఆప్టే, ఆండ్రాయిడ్ టీవీ అపాక్ హెడ్ మార్క్ సీడెన్‌ఫెడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment