బండబడ.. పనిసాగదే.. | GVMC Officials Worried About Cable Works | Sakshi
Sakshi News home page

బండబడ.. పనిసాగదే..

Published Thu, Feb 7 2019 7:43 AM | Last Updated on Thu, Feb 7 2019 7:43 AM

GVMC Officials Worried About Cable Works - Sakshi

భూగర్భ కేబుల్‌ కోసం తవ్వుతున్న గోతుల్లో బండరాళ్లను డ్రిల్లింగ్‌తో తొలగిస్తున్న దృశ్యం

ఆశ చూపి ఊరించడం.. ఆనక తేలిగ్గాతప్పించుకోవడం చంద్రన్న పాలనలో సహజపరిణామాలు. బాబుగారి జమానాలో ఇలా ఆశలుఅడియాసలైన బాధితుల జాబితా పెద్దదేఉంటుందన్నది తెలిసిందే. తాజాగా జీవీఎంసీకిబాబు మరోసారీ ఝలక్‌ ఇచ్చారు. ఈసారి ఓట్లమోళీ బడ్జెట్‌లో బోలెడు హామీలు ఇచ్చినఆర్థిక మంత్రి యనమల జీవీఎంసీని, అందులోపనిచేసే వేలాది మంది సిబ్బందిని ఊరించిఉసూరనిపించారు. 010 పద్దు అమలు చేయాలంటూమహావిశాఖ నగరపాలక సంస్ధ నాలుగున్నరేళ్లు పైగానివేదిస్తున్నా.. అపుడో ఇపుడో అన్నట్టు ఆశలు రేకెత్తించి,చివరికి బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తీసుకురాకుండాఉద్యోగులను వెక్కిరించినంత పనిచేశారు.భారం తగ్గుతుందనుకున్నజీవీఎంసీకీ రిక్తహస్తం చూపారు.

విశాఖసిటీ: ఓటు బడ్జెట్‌ను ఓటి బడ్జెట్‌గా మార్చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. మరోసారి జీవీఎంసీకి సారీ చెప్పేసింది. 010 పద్దు అమలు చెయ్యాలంటూ నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వానికి నివేదిస్తున్నా.. ఇదిగో అదిగో అంటూ మీనమేషాలు లెక్కించిన సర్కారు.. చివరి బడ్జెట్‌లోనూ పద్దు ప్రస్తావనే తీసుకురాకపోవడంతో.. మహా విశాఖ నగర పాలక సంస్థ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. మరోవైపు.. 113 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిప్‌ పేరుతో రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని బాహాటంగా చెప్పిన సర్కారు.. బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లతోనే సరిపెట్టడం సర్వత్రా విస్మయానికి గురిచేసింది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశపెడతారా అని మహా విశాఖ నగర పాలక సంస్థకు చెందిన 5 వేల మంది ఉద్యోగులు ఎదురు చూశారు. విత్త మంత్రి బడ్జెట్‌ చదువుతున్నంత సేపూ.. ఆశగా విన్నారు. కానీ.. వారి ఆశల్ని నీరుగార్చేలా.. ప్రసంగ పాఠం

విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ ప్రాజెక్టు పనుల్లో ప్రతికూలత ఏర్పడుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్‌ తుపానుకు విశాఖలో విద్యుత్‌ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో రూ.787 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ ప్రాజెక్టును చేపట్టింది.

2017 అక్టోబర్‌ పదో తేదీన ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. నగరంలో మొదటి దశ కింద నాలుగు ప్యాకేజీల్లో దాదాపు 2,015 కిలోమీటర్ల మేర విద్యుత్‌ కేబుల్‌ లైన్లు వేయాలని నిర్ణయించారు. ఈ పనులు ప్రారంభించి నప్పట్నుంచి 18 నెలల్లో అంటే.. ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కేబుళ్ల కోసం జరుపుతున్న తవ్వకాల్లో రాళ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు, టెలిఫోన్‌ కేబుళ్లు అడ్డంకిగా మారుతున్నాయి. తవ్వకాలకు అన్నిటికంటే రాళ్లు ప్రతిబంధకాలుగా మారాయి. ముఖ్యంగా వెంకటేశ్వరమెట్ట, నౌరోజీరోడ్డు, దస్‌పల్లా హిల్స్‌ తదితర ప్రాంతాల్లో రాళ్ల బెడద అధికంగా ఉంది.

ఈ రాళ్లను తొలగించడం సంబం«ధిత కాంట్రాక్టు సంస్థలకు కష్టసాధ్యమవు తున్నాయి. ఇలాంటి చోట డ్రిల్లింగ్‌ యంత్రాల ద్వారా రాళ్లను తొలగిస్తున్నారు. వీటిని తొలగించి పనులు కొనసాగించడానికి ఎక్కువ సమయం పడుతోంది. భూగర్భ విద్యుత్‌ కేబుళ్లను 1.2 మీటర్ల లోతున అమరుస్తున్నారు. వాటికి పైన ఉన్న వివిధ కేబుళ్లను సరిచేస్తూ దిగువన విద్యుత్‌ కేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో భూగర్భ కేబుల్‌ పనులు ఆశించినంతంగా ముందుకు సాగడం లేదని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు చెబుతున్నారు.

మరో ఏడాది ఆలస్యం..!
ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ ప్రాజెక్టు పూర్తికి నిర్ణీత సమయం (జులై 2019) కంటే మరో ఏడాది అదనంగా పట్టే అవకాశం ఉందని ఈపీడీసీఎల్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ పనుల కోసం ఆయా ప్రాంతాల్లో ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రాళ్లు పడిన చోట్ల పనులు ముందుకు సాగకపోవడంతో ఇనుప బారికేడ్లను అక్కడే ఉంచేయడం వల్ల స్థానికులకు ఇబ్బందులెదురవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేబుల్‌ వైర్లు ఏర్పాటు చేసిన చోట పనులు పూర్తయ్యాకే కొత్తగా మరో ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాలని ఈపీడీసీఎల్‌ అధికారులు నిర్ణయించారు.

సత్వరమే పనులు పూర్తి చేస్తాం
నగరంలో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ పనులు కొన్నిచోట్ల వేగంగానే జరుగుతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం బండరాళ్లు ఉండడం వల్ల తవ్వకాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని తొలగించడానికి చాలా సమయం పడుతుండడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమవుతోంది. సత్వరమే భూగర్భ కేబుల్‌ ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి కృషి చేస్తున్నాం.– రమేష్‌ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ఏపీఈపీడీసీఎల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement