పద్మారావునగర్(హైదరాబాద్): పద్మారావునగర్ డివిజన్ భోలక్‌పూర్ ఏరియాలో గురువారం రాత్రి అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్‌లో పేలుడు చోటుచేసుకుంది. భోలక్‌పూర్ మేకలమండి ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఈ సంఘటన జరిగింది. చిలకలగూడ నుంచి బన్సీలాల్‌పేట్‌కు సబ్‌స్టేషన్ వరకు భోలక్‌పూర్ మీదుగా ఏడాది క్రితం అండర్‌గ్రౌండ్ విద్యుత్తు కేబుల్‌ను ఏర్పాటు చేశారు.
అయితే, ఉన్నట్టుండి గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భోలక్‌పూర్ మేకలమండి ప్రభుత్వ పాఠశాల సమీపంలో పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయకంపితులయ్యారు. ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి రోడ్డుపై చిన్నపాటి గుంతపడింది. స్ధానికంగా డ్రై నేజీ పైపులైన్ పనుల సందర్భంగా ప్రొక్లెయినర్‌తో తవ్వకాలు జరుగుతుండటంతో విద్యుత్తు కేబుల్ ఏమైనా డ్యామేజ్ అయి విస్ఫోటం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
అండర్‌గ్రౌండ్ విద్యుత్తు కేబుల్‌లో విస్ఫోటం
Published Wed, Jul 1 2015 11:01 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
Advertisement
Advertisement