
ఫొటో క్రెడిట్ (mediadrum world.com/@dzulfikri72)
జకార్తా : ఎముకలను పిండి చేస్తున్న ఒత్తిడి. ఊపిరి ఆడని పరిస్థితి. కళ్లు మామూలుకంటే పెద్దవయ్యాయి. కొద్దిగా బయటకు పొడుచుకొచ్చాయి. నోరు తెరిచింది.. కీస్.. కీస్ అని అరిచింది. సహాయం కోసం అన్నట్లు చేతులు బార్లా చాచింది... ఓ కొండ చిలువ చుట్టలో నలిగి ప్రాణాల కోసం గిలగిల్లాడిన ఓ ఎలుక పరిస్థితి ఇది. కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాకు చెందిన జుల్ జుల్‌ఫిక్రి తన పెంపుడు కొండచిలువకు బతికున్న ఎలుకను ఆహారంగా వేశాడు.
ఫొటో క్రెడిట్ (mediadrum world.com/@dzulfikri72)
వెంటనే కెమెరా తీసుకుని ఫొటోలు తీయటం మొదలుపెట్టాడు. కొండచిలువ.. ఎలుకను చుట్టి, మింగేస్తున్న దృశ్యాలను ఫొటోలు తీశాడు. దాదాపు 5 నిమిషాల ఈ బతుకుపోరాటాన్ని కెమెరాలో బంధించాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఫొటోలు తీసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నా.. ఆఖరి క్షణాల్లో ఎలుక ప్రాణాలకోసం విలవిల్లాడటం చూస్తూ బాధేసింది’’ అని పేర్కొన్నాడు.
ఫొటో క్రెడిట్ (mediadrum world.com/@dzulfikri72)

ఫొటో క్రెడిట్ (mediadrum world.com/@dzulfikri72)
Comments
Please login to add a commentAdd a comment