
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్ వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే భయపడకుండా ఉండలేం! తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి కూడా. ప్రస్తుతం అటువంటి ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఓ చెరువులో ఆహారం కోసం వెతుకుతున్న చిరుతకు అదే సమయంలో ఒక చిన్న పైథాన్ ఎదురుపడింది. అయితే ఒక్కసారిగా చిరుత.. ఫైథాన్‌ను నోట కరిచింది. దీంతో పైథాన్ చిరుతను చుట్టేయడానికి ప్రయత్నించింది. చిరుత పంజా ముందు పైథాన్ ప్రయత్నం సాగలేదు. కొండచిలువను చిరుత నోట కరుచుకొని దగ్గరల్లో ఉన్న గట్టుపైకి ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను wild_animals_creation అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పైథాన్‌ను చిరుత ఏం చేసింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.