ఓ పక్క ఫోన్‌.. మరో పక్క కొండ చిలువ.. భళా బాలిక అంటున్న నెటిజన్స్‌ | Viral: Giant Python Sleeps On Girl Lap Video | Sakshi
Sakshi News home page

Viral:ఓ పక్క ఫోన్‌.. మరో పక్క కొండ చిలువ.. భళా బాలిక అంటున్న నెటిజన్స్‌

Published Sat, Oct 2 2021 8:01 PM | Last Updated on Sat, Oct 2 2021 8:26 PM

Viral: Giant Python Sleeps On Girl Lap Video - Sakshi

పాములంటే అందరికీ భయమే. అవి కంటికి కనపడితే చాలు పరుగుల పందెంలో పోటీలా పరుగెత్తుతాము. అయితే కొంతమంది పాములను కూడా పెంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అలాంటి పెంపుడు పాములు ఆ ఇంటి వారికి ఎటువంటి హాని కలిగించవు. అలా అని వాటితో ఏమరుపాటుగా ఉండి అవి హాని కలిగించిన ఘటనలు ఉన్నాయి. ఇందులో అంత రిస్క్‌ ఉండగా ఓ అమ్మాయి ఏకంగా పామును పెంచుకుంటుంది. అంతేనా తన ఒడిలో కూడా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

ఆ వీడియోలో ఓ బాలిక తన ఇంటి వెలుపల కూర్చొని మొబైల్‌ ఆపరేట్‌ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఓ పెద్ద కొండ చిలువ ఆ ఇంటి ప్రాంగణంలో పాకుతూ ఆ బాలిక ఒడిలో తల పెడుతుంది.  ఆ బాలిక కూడా ఎలాంటి భయం, బెరుకు లేకుండా.. ఒక చేత్తో ఫోన్‌ ఆపరేట్ చేస్తూ మరో చేత్తో పసి పాపను తడిమినట్లుగా ఆ కొండచిలువను తడుముతూ ఉంది. ఈ వీడియో సోషల్‌మీడియోలో షేర్‌ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే గాక ఆ పాప ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

చదవండి: Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement