దీపికా పడుకోన్ | Indian Air Force entrance exam had a question on Deepika Padukone | Sakshi
Sakshi News home page

దీపికా పడుకోన్

Published Sun, Sep 11 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

దీపికా పడుకోన్

దీపికా పడుకోన్

ఉమన్ నమః
శిక్షణలో ఉన్న భారతీయ వైమానిక దళం కెప్టెన్  పక్కన కాక్‌పిట్‌లో దీపికా పడుకోన్ అతిథిగా ఆశీనురాలై ఉంటే కనుక ఆ కొద్ది నిమిషాలూ విమానం ఎన్ని ఆహ్లాదకరమైన చక్కర్లు కొట్టగలదో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం కోసం పరీక్ష రాస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల హృదయాలు కూడా ప్రశ్నపత్రంలో ఒక్కసారిగా దీపిక కనిపించగానే కొన్ని క్షణాలపాటు అంతకుమించిన ఉల్లాసంతో రెపరెపమని అన్ని చక్కర్లూ కొట్టే ఉంటాయి! ‘2016లో ఏ చిత్రానికి దీపికా పడుకోన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు?’ అన్నది ఆ క్వశ్చన్ పేపర్‌లోని ఒక  ప్రశ్న.

ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న తొలి పది మందిలో దీపికా పడుకోన్ ఒకరు. ఇప్పుడీ విద్యార్థులు సాధించబోయే ఆలిండియా ర్యాంకుకు కూడా ఆమె ఒక ‘మార్కు’ అవడం.. జీవన సాఫల్య పురస్కారానికి ఆమెను క్రమంగా దగ్గర చేసే ఒక ఘనతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement