the Indian Air Force
-
దీపికా పడుకోన్
ఉమన్ నమః శిక్షణలో ఉన్న భారతీయ వైమానిక దళం కెప్టెన్ పక్కన కాక్‌పిట్‌లో దీపికా పడుకోన్ అతిథిగా ఆశీనురాలై ఉంటే కనుక ఆ కొద్ది నిమిషాలూ విమానం ఎన్ని ఆహ్లాదకరమైన చక్కర్లు కొట్టగలదో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం కోసం పరీక్ష రాస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల హృదయాలు కూడా ప్రశ్నపత్రంలో ఒక్కసారిగా దీపిక కనిపించగానే కొన్ని క్షణాలపాటు అంతకుమించిన ఉల్లాసంతో రెపరెపమని అన్ని చక్కర్లూ కొట్టే ఉంటాయి! ‘2016లో ఏ చిత్రానికి దీపికా పడుకోన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు?’ అన్నది ఆ క్వశ్చన్ పేపర్లోని ఒక ప్రశ్న. ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న తొలి పది మందిలో దీపికా పడుకోన్ ఒకరు. ఇప్పుడీ విద్యార్థులు సాధించబోయే ఆలిండియా ర్యాంకుకు కూడా ఆమె ఒక ‘మార్కు’ అవడం.. జీవన సాఫల్య పురస్కారానికి ఆమెను క్రమంగా దగ్గర చేసే ఒక ఘనతే! -
యుద్ధవిమానాలకు త్వరలో మహిళా పైలట్లు
గయ: భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) యుద్ధవిమానాలకు త్వరలో మహిళలను పైలట్లుగా నియమించే అవకాశం ఉందని వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా చెప్పారు. గయలో శనివారం రహా మాట్లాడుతూ, వైమానిక దళంలోని అన్ని విభాగాల్లో మహిళలు ఇప్పటికే పనిచేస్తున్నారని, భవిష్యత్తులో వారిని యుద్ధవిమానాల పైలట్లుగా నియమించే అవకాశం ఉందని అన్నారు. యుద్ధవిమానాల పైలట్లుగా మహిళలకు తగిన శారీరక అర్హతలేదని, ప్రత్యేకించి గర్భిణీలుగా ఉన్నపుడు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు వారు ఇబ్బంది పడతారని అరూప్ రహా ఈ ఏడాది ప్రారంభంలో అన్నారు. అయితే ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. -
తేజస్ యానం విజయవంతం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తేలికపాటి యుద్ధ విమానాల్లో (ఎల్సీఏ) మొదటిదైన తేజస్ విజయవంతంగా గగన వీధుల్లో ప్రయాణించిందని హెచ్ఏఎల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్ఏఎల్ చీఫ్ టెస్ట్ ఫ్లైయింగ్ కేఏ. ముతన మంగళవారం సాయంత్రం తొలిసారిగా దీనిని నడిపారని పేర్కొం ది. గత ఏడాది డిసెంబరులో తేజస్‌కు ఐఓసీ సర్టిఫికేషన్ లభించిందని, తొమ్మిది నెలల్లో మరో మైలురాయిని అధిగమించామని హెచ్ఏఎల్ చైర్మన్ డాక్టర్ ఆర్కే. త్యాగి తెలిపారు. భారతీయ వైమానిక దళం కార్యకలాపాలకు ఇక తేజస్ సిద్ధమైనట్లేనని వెల్లడించారు. ఇతర శ్రేణుల్లోని ఎయిర్‌క్రాఫ్ట్ వివిధ నిర్మాణ దశల్లో ఉందని తెలిపారు. ఎల్సీఏ తయారీలో హెచ్ఏఎల్ అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొందని, కార్బన్ ఫైబర్ దిగుమతిలో అమెరికా ఆంక్షలకు గురైందని ఆయన గుర్తు చేశారు.