కాక్పిట్లో చాటింగ్..పైలెట్ సస్పెన్షన్ | Handsome pilot with massive social media following suspended | Sakshi
Sakshi News home page

కాక్పిట్లో చాటింగ్..పైలెట్ సస్పెన్షన్

Published Sat, Apr 2 2016 6:29 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

కాక్పిట్లో చాటింగ్..పైలెట్ సస్పెన్షన్ - Sakshi

కాక్పిట్లో చాటింగ్..పైలెట్ సస్పెన్షన్

ఆన్ లైన్లోనే ఎక్కువ సమయం గడపాలన్న మోజు.. ఓ పైలెట్ సస్పెన్షన్ కు దారితీసింది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో తాను చేస్తున్న పనిని అందరికి చూపించాలన్న అతగాడి ఆతురత కొంపముంచింది. సదరు పైలెట్ విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో కూడా కాక్ పిట్ నుంచి లైవ్ వీడియోలో చాటింగ్ చేశాడు. దీనికి సంబంధించి యూనిఫాం ధరించి, సన్గ్లాసెస్ పెట్టుకుని ఉన్న పైలెట్ ఫోటోలు, వీడియోలు చైనీస్ ట్విట్టర్(వీబో)లో చక్కర్లు కొట్టాయి.

అయ్యాగారి ఘనకార్యానికి సోషల్ మీడియాలో ఓ వర్గం అతడిని పొగడ్తలతో ముంచెత్తితో  మరో వర్గం మాత్రం విమాన ప్రయాణ సమయంలో ఇలాంటి పనులేంటని విమర్శించింది. ఆ ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టడంతో అతనికి ఏకంగా 6వేలమంది కొత్తవారు ఫాలోవర్లుగా మారారు. అయితే  ప్రయాణికుల రక్షణ గాలికొదిలేసి వెధవ వేషాలు వేసినందుకు పైలెట్ ను ఉద్యోగం నుంచి తీసేయాలని మరోవర్గం గట్టిగా డిమాండ్ చేసింది. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో విమనాయాన సంస్థ ఎయిర్ చైనా దీనిపై వివరణ ఇచ్చుకుని అయ్యగారిపై సస్పెన్షన్ వేటు వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement