air china
-
భారతీయులపై ఎయిర్ చైనా హెచ్చరిక
న్యూఢిల్లీ: చైనా విమానాయాన సంస్థ 'ఎయిర్ చైనా' జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా లండన్ సురక్షిత నగరమని, కానీ, అక్కడ భారతీయులు, పాకిస్తానీలు, నల్లజాతీయులు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని తన ప్రయాణికులను హెచ్చరించింది. భారతీయులను కించపరిచేలా తన మ్యాగజీన్ లో ఎయిర్ చైనా చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలను ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు వెలుగులోకి తెచ్చారు. 'ఎయిర్ చైనా' మ్యాగజీన్ లో జారీచేసిన హెచ్చరికను చైనీస్ జర్నలిస్టు అయిన హేజ్ ఫ్యాన్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ మ్యాగజీన్ స్క్రీన్ షాట్ ను పోస్టుచేసిన ఆమె.. ఈ ట్వీట్ కు లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ను ట్యాగ్ చేశారు. 'పాకిస్థాన్ దంపతులకు జన్మించిన మేయర్ సాధిక్ ఖాన్ లండన్ నగరం అందరినీ ఆహ్వానిస్తుందని ప్రచారం చేస్తున్నారు. భారతీయులు-పాకిస్థానీలు అధికంగా నివసించే దక్షిణ లండన్ లోని సందర్శనీయ ప్రాంతాల గురించి ఆయన తన బ్లాగ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆయన ప్రచారాన్ని నీరుగార్చేలా ఎయిర్ చైనా సలహా జారీ చేసింది' అని ఆమె సీఎన్ఎన్ మీడియాతో పేర్కొన్నారు. గతంలోనూ చైనాలో జాతివివక్షను చూపేలా డిటర్జంట్ ప్రకటనను ప్రసారం చేసిన సంగతిని ఆమె గుర్తు చేశారు. -
కాక్‌పిట్‌లో చాటింగ్..పైలెట్ సస్పెన్షన్
ఆన్ లైన్లోనే ఎక్కువ సమయం గడపాలన్న మోజు.. ఓ పైలెట్ సస్పెన్షన్ కు దారితీసింది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో తాను చేస్తున్న పనిని అందరికి చూపించాలన్న అతగాడి ఆతురత కొంపముంచింది. సదరు పైలెట్ విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలో కూడా కాక్ పిట్ నుంచి లైవ్ వీడియోలో చాటింగ్ చేశాడు. దీనికి సంబంధించి యూనిఫాం ధరించి, సన్‌గ్లాసెస్ పెట్టుకుని ఉన్న పైలెట్ ఫోటోలు, వీడియోలు చైనీస్ ట్విట్టర్(వీబో)లో చక్కర్లు కొట్టాయి. అయ్యాగారి ఘనకార్యానికి సోషల్ మీడియాలో ఓ వర్గం అతడిని పొగడ్తలతో ముంచెత్తితో మరో వర్గం మాత్రం విమాన ప్రయాణ సమయంలో ఇలాంటి పనులేంటని విమర్శించింది. ఆ ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొట్టడంతో అతనికి ఏకంగా 6వేలమంది కొత్తవారు ఫాలోవర్లుగా మారారు. అయితే ప్రయాణికుల రక్షణ గాలికొదిలేసి వెధవ వేషాలు వేసినందుకు పైలెట్ ను ఉద్యోగం నుంచి తీసేయాలని మరోవర్గం గట్టిగా డిమాండ్ చేసింది. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో విమనాయాన సంస్థ ఎయిర్ చైనా దీనిపై వివరణ ఇచ్చుకుని అయ్యగారిపై సస్పెన్షన్ వేటు వేసింది.