భారతీయులపై ఎయిర్ చైనా హెచ్చరిక | Air China warns its passangers abotu London areas with Indians | Sakshi
Sakshi News home page

భారతీయులపై ఎయిర్ చైనా హెచ్చరిక

Published Thu, Sep 8 2016 9:07 AM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

భారతీయులపై ఎయిర్ చైనా హెచ్చరిక - Sakshi

భారతీయులపై ఎయిర్ చైనా హెచ్చరిక

న్యూఢిల్లీ: చైనా విమానాయాన సంస్థ 'ఎయిర్ చైనా' జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా లండన్ సురక్షిత నగరమని, కానీ, అక్కడ భారతీయులు, పాకిస్తానీలు, నల్లజాతీయులు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని తన ప్రయాణికులను హెచ్చరించింది. భారతీయులను కించపరిచేలా తన మ్యాగజీన్ లో ఎయిర్ చైనా చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలను ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు వెలుగులోకి తెచ్చారు.    

'ఎయిర్ చైనా' మ్యాగజీన్ లో జారీచేసిన హెచ్చరికను చైనీస్ జర్నలిస్టు అయిన హేజ్ ఫ్యాన్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ మ్యాగజీన్ స్క్రీన్ షాట్ ను పోస్టుచేసిన ఆమె.. ఈ ట్వీట్ కు లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ను ట్యాగ్ చేశారు.

'పాకిస్థాన్ దంపతులకు జన్మించిన మేయర్ సాధిక్ ఖాన్ లండన్ నగరం అందరినీ ఆహ్వానిస్తుందని ప్రచారం చేస్తున్నారు. భారతీయులు-పాకిస్థానీలు అధికంగా నివసించే దక్షిణ లండన్ లోని సందర్శనీయ ప్రాంతాల గురించి ఆయన తన బ్లాగ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆయన ప్రచారాన్ని నీరుగార్చేలా ఎయిర్ చైనా సలహా జారీ చేసింది' అని ఆమె సీఎన్ఎన్ మీడియాతో పేర్కొన్నారు. గతంలోనూ చైనాలో జాతివివక్షను చూపేలా డిటర్జంట్ ప్రకటనను ప్రసారం చేసిన సంగతిని ఆమె గుర్తు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement