ప్రతీకాత్మక చిత్రం
ఇటీవలకాలంలో భార్యలే భర్తలను వదిలి వెళ్లిపోతున్నారు. వాళ్లు వ్యక్తి గత కారణాల రీత్యానో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ భర్తలను వదిలి వెళ్లిపోతున్నారు. కానీ భర్తలు మాత్రం తమ భార్యల తిరిగి వస్తే చాలు పాతవాటిని గురించి పట్టించుకోం మాతో ఉంటే చాలు అంటూ ఆవేదనగా వాపోతున్న సంఘటనలు ఎక్కువగా చూశాం. అచ్చం అలాంటి సంఘటన బెంగాల్‌లోని పింగ్లా గ్రామంలో చోటుచేసుకుంది.
(చదవండి: ప్రేమానుబంధాలు మీకేనా? మాకూ ఉంటాయి)
అసలు విషయంలోకెళ్లితే....బెంగాల్‌లోని పింగ్లా గ్రామం నివాసి అయిన ఒక వ్యక్తి వృత్తిరీత్యా వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను డిసెంబర్ 9న పని మీద హైదరాబాద్ వెళ్లాడు. ఆ సమయంలో తన భార్య, బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయిందని అతనికి ఇంట్లో సభ్యులు తెలిపారు. దీంతో అతను మరుసటి రోజే ఇంటికి వచ్చి తన భార్య ఆచూకి కోసం గాలించడం మొదలు పెట్టాడు. అయితే అతని ప్రయత్నం ఫలించ లేదు. చివరి ప్రయత్నంగా సోషలో మీడియాలో తన బాధనంతా పోస్ట్ చేశాడు.
ఈ మేరకు అతను సోషల్ మీడియాలో" నేను పని నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న సమయంలో నా భార్య చిన్నారితో సహా కిటికి గుండా పారిపోయింది. ఆమెను ఎవరైన వెతికి తీసుకు వస్తే రూ 5000 పారితోషకం ఇస్తాను" అని ప్రకటించాడు. అంతేకాదు తన ఇంట్లో మొబైల్ ఫోన్ లేదని అందువల్లే తన భార్య మొబైల్ ఫోన్ తీసుకువచ్చే వ్యక్తితో వెళ్లిపోయిందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని అతను చెప్పగా, తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు.
పైగా తన భార్య ఒక్కత్తే కిటికి పగలకొట్టి పారిపోలేదని అతని సహాకారంతోనే ఈ ఘటనకు పాల్పడిందని వాపోయాడు. ఇంట్లోంచి వెళ్లే ముందు డబ్బు, నగలు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రాలు కూడా తీసుకుపోయిందని అన్నాడు. పైగా ఆ రోజు రాత్రి తమ ఇంటి ముందు నెంబర్ ప్లేట్ లేని నానో కారు ఆగిందని కూడా చెబుతున్నాడు. ఈ మేరకు సదరు వ్యక్తి తన భార్య బంగారు వస్తువులకు ప్రలోభ పడి అతనితో వెళ్లిపోయిందంటూ ఆరోపించాడు. పైగా పెద్దగా చదువుకోలేదు కాబట్టి సులభంగా ఆ వ్యక్తి మాయమాటలకు పడిపోయి వెళ్లిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమె పారిపోయిన దాని గురించి తానేం ఆలోచించటం లేదని పైగా తాను తన కుటుంబసభ్యులు ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment