బస్సులోనుంచి తల బయటకు పెట్టి.. | Man dies after dangling head out of bus window | Sakshi
Sakshi News home page

బస్సులోనుంచి తల బయటకు పెట్టి..

Published Mon, Jun 20 2016 5:32 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man dies after dangling head out of bus window

చెన్నై: బస్సులో నుంచి తల బయటకు పెట్టిన ఓ వ్యక్తి లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన దారుణ సంఘటన కాంచీపురం జిల్లాలోని మమందూర్ కు దగ్గరలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతుడు కడలూరుకు చెందిన సొక్రటీస్ గా గుర్తించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చుట్టానికి అనారోగ్యంగా ఉండటంతో సొక్రటిస్, అతని అన్నయ్య, ఓ స్నేహితుడు కలిసి చూడటానికి బయలుదేరారు. సొక్రటిస్ బస్సులో చివరి నుంచి రెండో వరుసలో ఎడమ వైపు కిటికీ సీటులో కూర్చున్నాడు. మొత్తం 40మందికి పైగా ప్రయాణిస్తున్నబస్సులో తెల్లవారుజామున నిద్రపట్టకపోవడంతో సొక్రటిస్ బయటకు తలపెట్టి చూస్తున్నాడు. ఇంతలో బస్సు వెనుకే వచ్చిన లారీ బస్సును క్రాస్ చేయడానికి ప్రయత్నించి సొక్రటిస్ తలను బలంగా ఢీ కొట్టింది. దీంతో అతను ఒక్కసారిగా పెద్ద అరుస్తూ బాధతో విలవిల్లాడిపోయాడు.

దీంతో గాఢ నిద్రలో ఉన్న బస్సులోని ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతని పక్కనే ఉన్న ప్రయాణీకులు లేచి వెళ్లి డ్రైవర్ కు విషయం చెప్పడంతో అతను బస్సును ఆపినట్లు తెలిపారు.  యాక్సిడెంట్ కు కారణమైన బస్సు డ్రైవర్ పై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Man, die, dangle, head, bus, window, బస్సు, కిటికి, వ్యక్తి, మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement