
బస్సులో కానీ, రైలులో కానీ ప్రయాణించేటప్పుడు అందరూ కొరుకునేది ఒకటే. సీటు దొరకాలి. అదీ కూడా కిటికి పక్కన ఉన్న సీటు దొరికితే బాగుండు అని అనుకుంటారు. దాని కోసం కర్చీప్ వేసిమరీ వెళ్తారు. అయితే అందరికీ అదే సీటు దొరకడం అంటే కష్టం. ఇక సీటు దొరికిన వ్యక్తి అయితే తనకు ఇష్టం ఉన్నప్పుడు తెరుస్తాడు, క్లోజ్ చేస్తాడు. చిన్నపిల్లలు అయితే కిటికి పక్కన కూర్చొని ప్రతిసారి తెరుస్తూ, మూస్తూ ఆటలాడుతారు. అది ఇతరులకు చిరాకు తెప్పించినా.. తెలిసి తెలియని వయసు కాబట్టి వదిలేస్తారు. కానీ ఇద్దరు పెద్ద వాళ్లు కిటికి కోసం గొడవ పడితే? అది కూడా ఏ రైలో , బస్సు కాకుండా విమానంలో గొడవ పడితే? వినడానికి కాసింత కామెడీగా ఉంది కదా..!
విమానంలో కిటికి తెరవడం, మూయడం కోసం ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఒకరు తెరిస్తూ, మరొకరు క్లోజ్ చేస్తూ చిన్నపిల్లల్లా తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన రెండు నిమిషాల వీడియో క్లిప్లింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. విమానంలో ముందు, వెనుక సీటులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రతిసారి కిటికి తెరుస్తూ, మూస్తు గొడవకు దిగారు. ముందు కూర్చు వ్యక్తి కిటికి తెరవగా.. ప్లీజ్ క్లోజ్ చేయడంటూ వెనుక కూర్చున్న కిటికి మూశాడు. దీనికి కోపగించిన వ్యక్తి మళ్లీ కిటికి తెరిచాడు. రెండో వ్యక్తి మూశాడు. ఇలా దాదాపు రెండు నిమిషాల పాటు వారి మధ్య కిటికి వార్ జరిగింది. చివరకు విమాన సిబ్బంది వచ్చి చెప్పిన వినలేదు. ముందు కూర్చున్న వ్యక్తి కిటికి ఓపెన్ చేసి చేతులు అడ్డంపెట్టాడు. అయితే గొడవ ఎక్కడదాకా వెళ్లిందో, విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అనే వివరాలు మాత్రం తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment