British Airline EasyJet Removes 19 Passengers From Flight Video Viral - Sakshi
Sakshi News home page

British Airline EasyJet: విమాన ప్రయాణీకులకు చేదు అనుభవం.. దిగిపోవాలన్న పైలట్‌

Published Mon, Jul 10 2023 5:03 PM | Last Updated on Mon, Jul 10 2023 5:09 PM

British Airline EasyJet Removes 19 Passengers From Flight Video Viral - Sakshi

విమానాశ్రయంలో విమానం టేకాఫ్‌కు రెడీగా ఉంది. ప్రయాణీకులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో విమానంలో ఉన్న వారికి పైలట్‌ ఓ షాకింగ్‌ వార్త చెప్పాడు. విమానంలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టేకాఫ్‌ చేయలేము.. అందకు కొందరు ప్రయాణీకులు విమానం దిగాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో, ప్రమాణీకులంతా ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ఈజీ జెట్‌ విమానం లాంజరెటో నుంచి లివర్ పూల్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానం షెడ్యూల్‌ ప్రకారం టేకాఫ్‌ అవ్వాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్‌ ఆలస్యమైంది. దీంతో, ప్రయాణీకులకు విమాన పైలట్‌ అసలు విషయం చెప్పుకొచ్చాడు. విమానాశ్రయం రన్‌వే పొడువు తక్కువగా ఉండటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమాన టేకాఫ్‌ ఆలస్యమవుతోందని పైలట్‌ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో టేకాఫ్‌ కష్టమవుతోందని వివరించాడు. 

ఇక, పైలట్‌ వ్యాఖ్యలతో విమానం ఉన్న ప్రయాణీకులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇదే సమయంలో, పైలట్‌ మాట్లాడుతూ.. ఇటువంటి పరిస్థితుల్లో బరువైన ఈ విమానాన్ని టేకాఫ్‌ చేయడం కష్టతరమని తెలిపాడు. విమానం టేకాఫ్‌ కావలంటే కొందరు ప్రయాణీకులు విమానం దిగిపోవాల్సిందేనని చెప్పాడు. కనీసం ఓ 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా విమానం దిగి, తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించాడు. అలా దిగిన వారికి 500 యూరోలు పారితోషికం కూడా ఇస్తామనీ చెప్పాడు. అయినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి 19 మంది ప్రయాణికులకు నచ్చజెప్పి సిబ్బంది తర్వాతి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. దీంతో మిగిలిన ప్రయాణికులతో విమానం రెండు గంటల ఆలస్యంగా టేకాఫ్‌ అయ్యింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement