మనం ప్రయాణించే విమానంలో ఎంపీనో లేదా సెలబ్రెటీలో తారసపడితేనా సంబరపడిపోతాం. అలాంటిది విమానంలో ఒక బీజేపీ ఎంపీ, పార్మెంటేరియన్ విమానంలో అనౌన్సర్‌గా ప్రయాణికులకు స్వాగతం పలికితే ఎలా ఉంటుంది. ఒక్కసారిగి ఇది నిజమా అని నోరెళ్లబెడతాం. ఔనా అచ్చం అలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఇండోగో విమానంలో బిహార్‌కు చెందిన బీజేపీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు రాజీవ్ ప్రతాప్ రూడీ విమానంలో అనౌన్సర్ దర్శనమిచ్చారు. ఈ మేరకు ఆయన..మేరా నామ్ రాజీవ్ ప్రతాప్ రూఢీ అని చెప్పగానే ప్రయాణికులంతా అటెన్షన్ అయిపోయారు.
తను ఎవరో ఏంటి అనేది మొత్తం చెప్పేసరికి అంతా విస్తుపోయి చూస్తుండిపోయారు. వాస్తవానికి ప్రతాప్ రూఢీ కమర్షియల్ ఫైలట్‌గా లైసెన్స్ ఉన్న ఏకైక వ్యక్తి. ఆయన తన లైసెన్సును క్రమబద్దీకరించుకోవడానికి ఇలా ఇండిగో పైలెట్‌లో ప్రయాణించినట్లు సమాచారం. అంతకముందు ఫిబ్రవరిలో రూఢీ తన విమానాయన జీవితంలో రెండోసారి రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించి అరుదైన ఘనత నమోదు చేశాడు. ఆయన 2017లో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ఈవెంట్‌లో రూఢీ తొలిసారిగా ప్రయాణించారు.
When you have to trust a politician with your life. pic.twitter.com/xWnafDyK22
— Meera Mohanty (@meeramohanty) March 30, 2023
Comments
Please login to add a commentAdd a comment