కారు బ్యానెట్‌పై మనిషిని ఈడ్చికెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఓవ్యక్తిని కారు బ్యానెట్‌పై ఈడ్చుకెళ్లాడు బిహార్‌కు చెందిన ఎంపీ డ్రైవర్. ఆ డ్రైవర్ బాధితుడిని ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్ దర్గా వరకు సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. దీన్ని గమనించి పోలీసులు వెంబడించి మరీ ఆ కారుని ఆపి బాధితుడిని రక్షించారు.
అసలు విషయం ఏమిటని ప్రశ్నించగా.. ఈ ఘటనకు పాల్పడిన కారు ప్రజాప్రతినిధికి చెందిన కారుగా గుర్తించారు పోలీసులు. అలాగే ఈ ఘటనలోని బాధితుడు చేతన్ తాను డ్రైవర్‌గా పనిచేస్తున్నాని చెప్పాడు. తాను ఒక ప్రయాణికుడిని దించి వస్తుండగా తన కారుని ఢీ కొట్టనట్లు తెలిపాడు. దీంతో అతని కారు వద్ద నిలబడి ఎందుకలా చేశావని అడగగా..అతను కారు వేగంగా పోనివ్వడంతో తాను కారు బ్యానెట్‌పై పడిపోవడంతో ఈడ్చుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు. తాను ఆపమని చెప్పనా ఆపలేదని.. ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్ వరకు లాక్కెళ్లినట్లు చెప్పుకొచ్చాడు.
మరోవైపు నిందితుడు సదరు ఎంపీ కారు డ్రైవర్ రామచంద్ కుమార్ మాత్రం తాను చేతన్ కారుని ఢీ కొట్టలేదని, అతనే కారు బ్యానెట్‌పైకి దూకినట్లు చెప్పాడు. సదరు ఎంపీ డ్రైవర్ తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిపై ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ కారు బీహార్ ఎంపీ వీనా దేవిదని చెప్పారు. ఐతే ఆ సమయంలో కారులో ఎంపీ లేరని అన్నారు పోలీసులు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment