4 Men Arrested For Assaulting A Man After Stopping His Car In Middle Road, Details Inside - Sakshi
Sakshi News home page

New Delhi: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్‌

Published Wed, May 10 2023 3:05 PM | Last Updated on Wed, May 10 2023 4:32 PM

4 Men Arrested Assaulting A Man After Stopping His Car In Middle Road - Sakshi

దేశ రాజధాని ఢిల్లీ ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఓ కారుని ఫాలో అవ్వుతూ..నడి రోడ్డుపై ఆ కారుని బలవంతంగా ఆపించి గుండాయిజానికి దిగారు. ఆ తర్వాత సదరు కారు డ్రైవర్‌ని కారులోంచి దిగమని చెప్పి కొట్టడం, తిట్టడం వంటివి చేశారు. ఎందుకు అలా చేస్తున్నారో చెప్పమని కోరినా.. వినిపించుకోకుండా తమ పైశాచికత్వాన్ని అంతా అతనిపై చూపించారు.

చివరికి అతను క్షమించమని ప్రాధేయపడటంతో వదిలేశారు. ఈ ఘటన మొత్తం ఢిల్లీలోని నాంగ్లోయ్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ వద్ద జరిగింది. సదరు బాధిడతుడు ఆ సంఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ సదరు వ్యక్తులపై సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ హరేంద్ర కే సింగ్‌ నిందితులను అరెస్టు చేసినట్లు ట్వీట్‌ చేశారు. 

(చదవండి: ట్రైయిన్‌లో మరో అసభ్యకర ఘటన.. మద్యం మత్తులో టికెట్‌ ఎగ్జామినర్‌..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement