Kolkata: Woman delivers baby in toilet, throws newborn out of window - Sakshi
Sakshi News home page

ఓ తల్లి కిరాతక చర్య.. ప్రెగ్నెంట్‌ అని తెలియక పసికందుని..

Published Tue, Apr 25 2023 1:36 PM | Last Updated on Tue, Apr 25 2023 4:23 PM

Kolkata Woman Threw New Born Baby Out Of Window After Giving Birth - Sakshi

ఓ మహిళ ప్రసవించిన కొద్దిసేపిటికే బిడ్డను కిటికిలోంచి పడేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ బిడ్డ ఏడుపు విని కలవరపడి ఆమె బాత్రూం కిటికీలోంచి విసిరేసింది. ఈ అనూహ్య ఘటన పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ బెంగాల్‌లోఇన కోల్‌కతాలో ఓ మహిళ తన ఇంటి బాత్రూంలోనే పండంటి మగబిడ్డకు ప్రసవించింది. ఐతే ఆమె నవజాత బిడ్డ ఏడుపు విని కలవరపడి కిటికిలోంచి విసిరేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారించగా..సమీపంలోని ఓ మహిళ ప్రసవించినట్లు గుర్తించి ఆరా తీశారు. ఐతే తాను ప్రెగ్నెంట్‌ అని తనకు తెలియదని, రెగ్యూలర్‌గా పిరియడ్స్‌ వస్తున్నట్లు తెలిపింది. అందువల్లే విసిరేశానని చెప్పింది ఆ తల్లి. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఏవడవడంతో భయం వేసిందని అందుకే అలా చేశానని చెప్పుకొచ్చింది.

ఈ మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ విషయమై ఆమె కుటుంబసభ్యులను ప్రశ్నించగా..వారు కూడా ఆమె ప్రెగ్నెంట్‌ అని తెలియదని చెప్పడంతో విస్తుపోవడం పోలీసులు వంతైంది. ఐతే విచారణలో..ఆమె భర్త మద్యానికి బానిసని, ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 

(చదవండి: మొబైల్‌ ఫోన్‌ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement