crying baby
-
విమానం బాత్రూంలో చిన్నారి..
విమానంలో నాన్‌స్టాప్‌గా ఏడుస్తూ డిస్టర్బ్ చేస్తోందని ఇద్దరు ప్రబుద్ధులు ఓ చిన్నారిని ఏకంగా తమతో పాటుగా బాత్రూంలోకి తీసుకెళ్లి తాళం పెట్టేశారు. ఏడుపు మానాక గానీ బయటికి తీసుకురాలేదు. చైనాలో గుయాంగ్ నుంచి షాంఘై వెళ్తున్న విమానంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తాతయ్య, నానమ్మలతో పాటు ప్రయాణిస్తున్న ఏడాది వయసున్న పాప విమానం బయల్దేరినప్పటి నుంచీ ఆపకుండా ఏడుపందుకుంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన తోటి ప్రయాణికులైన ఇద్దరు మహిళలు తాము ఏడుపు ఆపుతామంటూ పాపను తీసుకుని ఏకంగా బాత్రూంలో దూరి గొళ్లెం పెట్టుకున్నారు. ఒకరు టాయ్‌లెట్ సీటుపై కూచుని ఏడుపు ఆపుతావా లేదా అంటూ గద్దిస్తుంటే ఇంకొకరు తీరిగ్గా వీడియో తీశారు. ఏడుపాపితే గానీ తాత, నానమ్మ దగ్గరికి తీసుకెళ్లేది లేదంటూ పాపను బెదిరించారు. చివరికి తను ఊరుకున్నాక కూడా, ఏడిస్తే మళ్లీ బాత్రూంలోకి తెచ్చి పడేస్తామంటూ బెదిరించారు. పైగా తమ ఘనకార్యాన్నంతటినీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహిళల బెదిరింపులు, పాప భయపడిపోయి తలుపు కేసి చేయి చాచడం వంటివి చూసి వాళ్ల తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడటంతో వీడియోను డిలీట్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 24న జరిగినట్టు సంబంధిత ఎయిర్‌లైన్స్ వివరించింది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారికి ‘పాఠం చెప్పడానికి’ వృద్ధుల అనుమతితో వాళ్లిద్దరూ ఇలా చేసినట్టు ఒక ప్రకటనలో చెప్పుకొచి్చంది. దీనిపై విమర్శలు చెలరేగడంతో క్షమాపణలు చెప్పింది. సదరు ప్రయాణికులను తమ సిబ్బంది కూడా మందలించారని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలను ఎలా చూసుకోవాలన్న దానిపై ఆన్లైన్లో పెద్ద చర్చకు ఈ ఉదంతం దారితీసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
దారుణం: చిన్నారి ఏడుస్తున్నా.. తండ్రిపై కర్రలతో.. వీడియో వైరల్..
చంఢీగర్: పంజాబ్‌లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వక్తిపై కొందరు యువకులు కర్రలతో దాడి చేశారు. బాధితుని చేతిలో చిన్న కుమారుడు ఉన్నాడనే విచక్షణ కూడా లేకుండా కర్రలతో చితకబాదారు. పక్కనే ఉన్న కుర్రాడు ఏడుస్తున్నా కనికరం లేకుండా బాధితునిపై దాడి చేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని మాన్సాలో జరిగింది. ఉదయం సమయంలో బాధితుడు తన పిల్లాడ్ని స్కూల్ వద్ద దింపడానికి బైక్‌పై వచ్చాడు. పాఠశాల వద్ద అలా ఆపాడో లేదో.. అప్పటికే వెంబడించిన కొంతమంది యువకులు అతనిపై దాడి చేశారు. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. బాధితుడు తిరుగుబాటు చేయకుండా ఓ వ్యక్తి.. అతన్ని బిగ్గరగా పట్టుకున్నాడు. మిగిలిన వ్యక్తులు దాడి చేశారు. పక్కనే ఉన్న బాధితుని కుమారుడు ఏడుస్తున్నా.. నిందితులు పాశవికంగా కొట్టారు. Visuals from Mansa where due to personal rivalry, six people broke both legs of a person who had come to drop his son off at school. They had a previous dispute as well, and earlier also an FIR under section 307 has been registered against them. pic.twitter.com/JEohspw5P8 — Gagandeep Singh (@Gagan4344) August 10, 2023 నిందితులు దాడి చేస్తున్నా పక్కనే ఉన్న అందరూ చూస్తున్నారు తప్పా.. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. నిందితులు వెళ్లిపోయాక ఓ మహిళ.. బాధితున్ని లేపి ఆస్పత్రికి తరలించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పంజాబ్‌లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం -
ఓ తల్లి కిరాతక చర్య.. ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..
ఓ మహిళ ప్రసవించిన కొద్దిసేపిటికే బిడ్డను కిటికిలోంచి పడేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ బిడ్డ ఏడుపు విని కలవరపడి ఆమె బాత్రూం కిటికీలోంచి విసిరేసింది. ఈ అనూహ్య ఘటన పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ బెంగాల్‌లోఇన కోల్‌కతాలో ఓ మహిళ తన ఇంటి బాత్రూంలోనే పండంటి మగబిడ్డకు ప్రసవించింది. ఐతే ఆమె నవజాత బిడ్డ ఏడుపు విని కలవరపడి కిటికిలోంచి విసిరేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారించగా..సమీపంలోని ఓ మహిళ ప్రసవించినట్లు గుర్తించి ఆరా తీశారు. ఐతే తాను ప్రెగ్నెంట్ అని తనకు తెలియదని, రెగ్యూలర్‌గా పిరియడ్స్ వస్తున్నట్లు తెలిపింది. అందువల్లే విసిరేశానని చెప్పింది ఆ తల్లి. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఏవడవడంతో భయం వేసిందని అందుకే అలా చేశానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ విషయమై ఆమె కుటుంబసభ్యులను ప్రశ్నించగా..వారు కూడా ఆమె ప్రెగ్నెంట్ అని తెలియదని చెప్పడంతో విస్తుపోవడం పోలీసులు వంతైంది. ఐతే విచారణలో..ఆమె భర్త మద్యానికి బానిసని, ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి) -
ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప ఏడవడంతో..
తిరువనంతపురం: కేరళలోని అన్నైకట్టి ప్రాంతంలో అడవిజంతువులకు తాగునీరు కరువవడంతో జనావాసాల్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలను కట్టడిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో వన్యమృగాల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అన్నైకట్టిలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగుచూసింది. అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన భారీ ఏనుగు మంగళవారం ఉదయం 4 గంటలకు ఓ ఇంటి సమీపంలో ఘీంకరించింది. ఆ చప్పుడు విన్న బాలామణి అనే మహిళ ఏం జరిగిందో తెలుసుకుందామని తన తమ్ముడి కూతురిని కూడా వెంటేసుకుని పరుగున బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఏనుగు వారివైపు తిరిగి.. ఆమెను కింద పడేసింది. బాలామణికి కొద్దిదూరంలోనే ఆ పసిపాప కూడా ఉంది. అది గనుక దాడిచేస్తే క్షణాల్లో ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవే! అయితే, అదృష్టవశాత్తూ బాలామణి ప్రమాదం నుంచి బయటపడింది. భయానక ఘటనతో వణికిపోయిన ఆ పసిపాప బిగ్గరగా ఏడ్చింది. అది చూసిన ఆ ఏనుగు బాలామణికి హాని తలపెట్టకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అన్నైకట్టి కొండ ప్రాంతం. అయితే, అక్కడి వన్యప్రాణులకు తాగేందుకు సరిపడా నీరులేకపోవంతో అవి జనావాసాల్లోకి చొరబడి దాడులు చేయడం మామూలైపోయింది. ప్రభుత్వాలు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. షాక్ తిన్నా! తర్వాత ఏమైందో తెలియదు ‘భారీ శబ్దం వినిపిస్తే ఏమైందో చూద్దామని బయటికి వెళ్లాను. నాతోపాటు నా తమ్ముడి కూతురు కూడా ఉంది. ఏనుగును చూసి అక్కడ నుంచి పరుగెత్తుకెళ్దామనే లోపే అది తన తొండంతో నన్ను కిందకు తోసేసింది. ఒక్కసారిగా షాక్ తిన్నా! తర్వాత ఏమైందో స్పృహ లేదు. కాసేపటికి మా చిన్నదాని ఏడుపు విని మెలకువ వచ్చింది. ఆ దేవుడే మమ్మల్ని రక్షించాడు’ అని బాలామణి చెప్పుకొచ్చింది. -
కు.ని. విషాద ఘటన.. అయ్యో దేవుడా! ఈ పిల్లల బతుకులెట్లా?
మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతలను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాతపడటం యావత్ రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలిన అవుతపురం లావణ్య (22) అంత్యక్రియలు సీతారాంపేటలో ప్రశాంతంగా ముగిశాయి. లావణ్యకు ఇద్దరు కుమార్తెలు అక్షర (6), భావన (4) కుమారుడు యశ్వంత్ (ఏడు నెలలు) ఉన్నారు. చివరి చూపుల సందర్భంగా అత్తమామలు,, బంధువుల రోదనలతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఏమి జరిగిందో తెలియని పసిమొగ్గలను చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. బరువెక్కిన హృదయంతో ఓదార్చారు. అసలు ఏం జరిగిందో తెలియక పసిమొగ్గలు దీనంగా చూస్తుండటాన్ని అందరినీ కదిలించింది. తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయిందని, ఇక తాము చూడ లేమని తెలియని ఆ చిన్నారులను చూసి చలించి పోయారు. భర్త లింగస్వామి ఓ రైతు వద్ద జీతం చేస్తూ అతని వ్యవసాయ పనులు చేస్తుంటాడు. సొంత ఇల్లు కూడలేని దీనస్థితి ఆ కుటుంబానిది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తలకొరివి పెట్టిన మామ కట్టుకున్న భర్త, కన్న కుమారుడు ఉన్నప్పటికీ అర్ధంతరంగా తనువు చాలించడంతో లావణ్య మామ యాదయ్య అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించారు. ఏడు నెలల బాబు చేతిని ముట్టించి దహన సంస్కారాల కార్యక్రమంలో మామ యాదయ్య ముందు నడిచాడు. ఏ జన్మలో రుణపడి ఉన్నానో నంటూ కో డలి మృతదేహం చుట్టూ తిరిగి దహన సంస్కా రాలు చేయడం అక్కడున్న వారిని కదిలించింది. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ను ఓదార్చుతున్న జెడ్పీటీసీ సభ్యురాలు నిత్యారెడ్డి లింగంపల్లిలో సుష్మ అంత్యక్రియలు మంచాల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన మైలారం సుష్మ స్వగ్రామం లింగంపల్లిలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలకు వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ అమ్మ కావాలని ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్యారెడ్డి.. సుష్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సుష్మ భర్త ఈశ్వర్, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొంత ఆర్ధిక సాయం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే కారణమని జెడ్పీటీసీ ఆరోపించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట సర్పంచ్ వినోద మూర్తి, ఎంపీటీసీ జయనందం తదితరులు పాల్గొన్నారు. మౌనిక పిల్లలు పిల్లల ఆమయాక చూపులు అదే విధంగా మాడ్గుల మండలం కొలుకుల పల్లి పంజాయతీ పరిధిలోని రాజీవ్ తండాకు చెందిన మౌనికకు నాలుగేళ్ల కిందట శ్రీనివాస్ నాయక్‌తో పెళ్లి జరిగింది. వీరికి మాను శ్రీ(3), గౌతమ్(15 నెలలు) ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ నాయక్ వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు. మౌనిక భర్తతో కలిసి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే మౌనిక తల్లి తిరిగిరాదని లోకాలకు వెళ్లిందని తెలియక పిల్లలు అమాయక చూపులు చూస్తున్నారు. భర్త శ్రీనివాస్ నాయక్ సైతం కన్నీటి పర్యంతమవుతున్నాడు. మమత, ఇద్దరు పిల్లలు భర్తకు చేదోడువాదోడు ఇక ఇదే మండలం నర్సాయపల్లికి చెందిన మమత, మల్లేష్ గౌడ్లకు అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్. వర్షిత్(4), విహాన్(2). పేద కుటుంబానికి చెందిన మల్లేష్ గౌడ్ వ్యవసాయం చేసుకుంటూ డీసీఎం వ్యాన్ నడుపుకుంటున్నాడు. వ్యవసాయంలో భర్తకు చేదుడో వాదోడుగా ఉండే మమత ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పిల్లలు, భర్త భోరున విలపిస్తున్నారు. -
కూతురు ఏడ్చిందని తలాక్
ఇండోర్: ఏడాది వయసున్న కూతురు ఏడుపు భరించలేక తన భార్యకు ఓ వ్యక్తి తలాక్ చెప్పి విడాకులిచ్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అనంతరం అతడి భార్య ఉజ్మా అన్సారీ ఆమె సొంత జిల్లా బార్వానిలోని సెంథ్వాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కొత్త చట్టం తేవడం తెల్సిందే. ఆగస్టు 4న రాత్రి సమయంలో అనారోగ్యంతో ఉన్న తన కూతురు గుక్కపెట్టి ఏడవడంతో, నిద్ర పాడుచేసిందంటూ భర్త అక్బర్ తనతో గొడవ పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపారు. మరిది, మామలు తనను కొట్టారని చెప్పారు. వారి సమక్షంలోనే తన భర్త మూడు సార్లు తలాక్ చెప్పాడని పేర్కొన్నారు. -
ఘోరం : గుక్కపట్టి ఏడుస్తుంటే విసిగిపోయి...
సాక్షి, న్యూఢిల్లీ : గుక్కపట్టి ఏడుస్తున్న పసికందుతో కన్న ప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించిందో తల్లి. విసుగుపుట్టి తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయగా.. ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఢిల్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు ఢిల్లీలోని వినోద్ నగర్‌కు చెందిన నేహా 25 రోజుల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి పాలు పట్టిస్తున్నప్పటికీ గుక్కపట్టి ఏడుస్తోంది(అనారోగ్య సమస్య ఉందని చిన్నారి తండ్రి చెబుతున్నాడు). దీంతో అసహనానికి లోనైన నేహ దారుణానికి పాల్పడింది. శుక్రవారం గుట్టుచప్పుడు కాకుండా ఆ బిడ్డను తీసుకెళ్లి పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసింది. పాప కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులంతా కంగారుపడగా.. తాను కూడా వారితోపాటు వెతికినట్లు నటించింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సాక్ష్యులను విచారణ చేపట్టగా స్థానికుడొకరు నేహ చెత్తకుండీలో ఏదో మూట పడేయటం చూశానని చెప్పాడు. దీంతో పోలీసులకు ఆ తల్లిపై అనుమానం మొదలైంది. ఈ క్రమంలో వారు ఆమెను గట్టిగా ప్రశ్నించగా.. ఆమె నేరం ఒప్పుకుంది. చిన్నారి ఏడుస్తుంటే తట్టుకోలేకనే తాను ఆ పని చేసినట్లు వివరించింది. దీంతో పోలీసులు హుటాహుటినా చెత్త కుప్ప వద్దకు వెళ్లారు. కొన ఊపిరితో ఉన్న పసికందును ఆస్పత్రికి తరలించి బతికించే ప్రయత్నం చేశారు. అయితే తలకు బలమైన దెబ్బ తలగటంతో ఆ పసికందు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో పోలీసులు నేహను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఏడుపులు విన్న ట్రంప్ ఏం చేశాడంటే!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఇటీవల చిన్నదే అయినా ఓ కఠిన పరీక్ష ఎదురైంది. వర్జీనియాలోని ఓ ఆడిటోరియంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో.. అతనికి సమీపంలో శిశువు ఏడుపులు వినిపించాయి. దీనిపై ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిన ట్రంప్.. చివరికి ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లమని తల్లిని కోరాడు. అంతర్జాతీయ అంశాలపై సీరియస్‌గా ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో తల్లి ఒడిలో ఉన్న ఓ శిశువు బిగ్గరగా ఏడవసాగింది. దీంతో మొదట .. ఆ ఏడుపులు తనకు వినిపిస్తున్నాయని, తనకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమని, చాలా అందమైన శిశువు అని ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. అనంతరం.. చైనా తన కరెన్సీ విలువను తగ్గించడం గురించి ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో.. మరోసారి ఆ శివువు బిగ్గరగా ఏడుపు ప్రారంభించింది. దీంతో ఇక లాభం లేదనుకున్న ట్రంప్.. తాను ఇంతకు ముందు జోక్ చేశానని, ఆ శిశువును అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లమని తల్లికి సూచించాడు. ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన వారు ఎక్కువగా పాల్గొన్న ఈ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ప్రవర్తనకు నవ్వుకున్నారు. -
పిల్లలు ఏడిస్తే.. చార్జీ తగ్గిస్తారట!
న్యూయార్క్ : చిన్న పిల్లలతో ఎక్కడికైనా ప్రయాణించాలంటే మహిళలకు కత్తి మీద సామే. మరీ ముఖ్యంగా విమానాల్లో చంటి పిల్లలతో ప్రయాణించడం వారికి చాలా కష్టం. ఈ నేపథ్యంలో జెట్ బ్లూ ఏడ్చే పిల్లల తల్లులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విమానం ఎక్కగానే చిన్నపిల్లలు ఏడుపు లంకించుకుంటారు. పిల్లలు ఏడిస్తే.. ఆ తల్లులకు తర్వాతి ప్రయాణంలో 25 శాతం చార్జీలను తగ్గిస్తామని జెట్‌బ్లూ సంస్థ ప్రకటించింది. ఒకవేళ నాలుగు సార్లు ఏడిస్తే.. తర్వాతి ప్రయాణం పూర్తిగా ఉచితం అన్నమాట!! ఈ 'ఫ్లే బేబీస్' ప్రమోషన్ ను ఏప్రిల్ 15న న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్ పోర్టు నుంచి లాంగ్ బీచ్ మధ్య ప్రయాణించినవారికి అందించినట్లు తెలిపారు. ఆ విమానంలో ఐదుగురు పిల్లలున్నారని, వారు నాలుగుసార్లు ఏడ్చేసరికి, వారి తల్లిదండ్రులకు జెడ్ బ్లూలో ఉచిత రౌండ్ ట్రిప్ టికెట్‌ను బహుమానంగా ఇచ్చినట్టు కంపెనీ చెప్పింది. పిల్లలతో విమానంలో ప్రయాణించేటప్పుడు తల్లులు పడే కష్టాలను గుర్తించి ఈ ఆఫర్‌ను తీసుకొచ్చామని జెట్ బ్లూ బ్రాండ్ మేనేజ్ మెంట్ అండ్ అడ్వర్టైజింగ్ డైరెక్టర్ ఎలిజిబెత్ విండ్రామ్ తెలిపారు. పిల్లలు ఏడుస్తుంటే పక్కనవాళ్లు ఏమనుకుంటారో భావించే తల్లుల బిడియాన్ని పోగొట్టడమే లక్ష్యంగా ఈ ఆఫర్ ప్రకటించామని ఎయిర్ లైన్ తెలిపింది. పిల్లలు ఆరున్నొక్క రాగం అందుకోగానే అందరూ చప్పట్లు కొడుతూ దాన్ని స్వాగతిస్తారు. ఈ ఆఫర్ పిల్లలతో ప్రయాణించే తల్లులకు స్వీట్ రిమైండర్‌గా కూడా గుర్తుంటుందని కంపెనీ చెబుతోంది.