పిల్లలు ఏడిస్తే.. చార్జీ తగ్గిస్తారట! | 4 crying babies brought a free flight for JetBlue passengers | Sakshi
Sakshi News home page

పిల్లలు ఏడిస్తే.. చార్జీ తగ్గిస్తారట!

Published Wed, May 4 2016 5:01 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

పిల్లలు ఏడిస్తే.. చార్జీ తగ్గిస్తారట! - Sakshi

పిల్లలు ఏడిస్తే.. చార్జీ తగ్గిస్తారట!

న్యూయార్క్ : చిన్న పిల్లలతో ఎక్కడికైనా ప్రయాణించాలంటే మహిళలకు కత్తి మీద సామే. మరీ ముఖ్యంగా విమానాల్లో చంటి పిల్లలతో ప్రయాణించడం వారికి చాలా కష్టం. ఈ నేపథ్యంలో జెట్ బ్లూ ఏడ్చే పిల్లల తల్లులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విమానం ఎక్కగానే చిన్నపిల్లలు ఏడుపు లంకించుకుంటారు. పిల్లలు ఏడిస్తే.. ఆ తల్లులకు తర్వాతి ప్రయాణంలో 25 శాతం చార్జీలను తగ్గిస్తామని జెట్‌బ్లూ సంస్థ ప్రకటించింది. ఒకవేళ నాలుగు సార్లు ఏడిస్తే.. తర్వాతి ప్రయాణం పూర్తిగా ఉచితం అన్నమాట!! ఈ 'ఫ్లే బేబీస్' ప్రమోషన్ ను ఏప్రిల్ 15న న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్ పోర్టు నుంచి లాంగ్ బీచ్ మధ్య ప్రయాణించినవారికి అందించినట్లు తెలిపారు.

ఆ విమానంలో ఐదుగురు పిల్లలున్నారని, వారు నాలుగుసార్లు ఏడ్చేసరికి,  వారి తల్లిదండ్రులకు జెడ్ బ్లూలో ఉచిత రౌండ్ ట్రిప్ టికెట్‌ను బహుమానంగా ఇచ్చినట్టు కంపెనీ చెప్పింది. పిల్లలతో విమానంలో ప్రయాణించేటప్పుడు తల్లులు పడే కష్టాలను గుర్తించి ఈ ఆఫర్‌ను తీసుకొచ్చామని జెట్ బ్లూ బ్రాండ్ మేనేజ్ మెంట్ అండ్ అడ్వర్టైజింగ్ డైరెక్టర్ ఎలిజిబెత్ విండ్రామ్ తెలిపారు. పిల్లలు ఏడుస్తుంటే పక్కనవాళ్లు ఏమనుకుంటారో భావించే తల్లుల బిడియాన్ని పోగొట్టడమే లక్ష్యంగా ఈ ఆఫర్ ప్రకటించామని ఎయిర్ లైన్ తెలిపింది. పిల్లలు ఆరున్నొక్క రాగం అందుకోగానే అందరూ చప్పట్లు కొడుతూ దాన్ని స్వాగతిస్తారు. ఈ ఆఫర్ పిల్లలతో ప్రయాణించే తల్లులకు స్వీట్ రిమైండర్‌గా కూడా గుర్తుంటుందని కంపెనీ చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement