JetBlue
-
వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావా
విమానంలో వేడి టీ సర్వ్ చేస్తున్నపుడు కుదుపులకు గురవడంతో ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో సదరు విమాన సంస్థపై ప్యాసింజర్ ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు (రూ.12.5 కోట్లు) దావా వేశారు.ప్రయాణికురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం..తహజానా లూయిస్ అనే మహిళా ప్యాసింజర్ తన కుటుంబంతో మే 15న ఓర్లాండో నుంచి కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌కు ‘జెట్‌బ్లూ ఫ్లైట్ 2237’ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి సీట్‌బెల్ట్ పెట్టుకోవాలనే సిగ్నల్ వచ్చింది. అదేమీ పట్టించుకోకుండా విమాన సిబ్బంది వేడి టీ సర్వ్ చేయడానికి సిద్ధం అయ్యారు. కానీ అప్పటికే సీట్‌బెల్ట్ వార్నింగ్ రావడంతో విమానం కుదుపులకు గురైంది. దాంతో వేడి టీ ప్రయాణికురాలి శరీరంపై పడి ఛాతీ, కాళ్లు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో కనీసం విమాన సిబ్బంది ప్రథమ చికిత్స కూడా చేయలేదు.ప్రయాణికురాలు గాయాల నుంచి కోలుకున్నాక ఇటీవల విమాన ఘటనపై కోర్టును ఆశ్రయించారు. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఈమేరకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంస్థ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర గాయాలపాలయ్యానని తెలియజేస్తూ 1.5 మిలియన్ డాలర్లు(రూ.12.5 కోట్లు) దావా వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం విమానంలో సీట్‌బెల్ట్ సిగ్నల్ వచ్చినపుడు వేడి పానీయాలు, భోజన సేవలను నిలిపేయాలి.ఇదీ చదవండి: జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్.. 8 మంది అరెస్టుఇదిలాఉండగా, మే నెలలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దాంతో ఒక ప్యాసింజర్ గుండెపోటుతో మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
నా వీడియోను ట్రోల్ చేయండి.. వైరల్!
-
నా వీడియోను ట్రోల్ చేయండి.. తప్పతాగిన మహిళ
ఫ్లోరిడా : తప్పతాగిన ఓ మహిళ విమానంలో మిగతా ప్రయాణికులపై ఇష్టానుసారంగా అరుస్తూ, విమాన సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. అమెరికాలో వాలెరీ గోంజాలజ్ అనే 32 ఏళ్ల మహిళ గత గురువారం ఫోర్ట్ లాడర్డేల్లోని హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లాస్ వెగాస్‌కు వెళ్లడానికి జెట్ బ్లూ విమానం ఎక్కింది. అప్పటికే ఆమె తప్పతాగి ఉంది. విమానంలో మూడేళ్ల చిన్నారి పక్కన కూర్చోవాల్సి రావడంతో వాలెరీ కలత చెందింది. 'నేను రోజంతా తాగాలి. మూడేళ్ల చిన్నారి పక్కన నేను కూర్చోను' అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఉమ్మివేస్తూ, మితా ప్రయాణికులపై కూడా నిప్పులు చెరిగింది. దీంతో పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు. ఇది చూసిన ఆ యువతి ఈ వీడియోను వైరల్ చేయండి. నేను నా బ్యాగులు తీసుకుని వెళ్లిపోతున్నా అంటూ విమానంలో నుంచి దిగిపోయి, టెర్మినల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. అనంతరం తిరిగి విమానంలోకి రావడానికి ప్రయత్నించిన అమెను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వాలెరీ సిబ్బందిపై దాడికి దిగింది. ఈ ఘటనతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రయాణికుడు తీసిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. -
అమెరికన్లకు ఆ విమానాలంటే తెగ ఇష్టమట..!
అమెరికన్లకు అలస్కా ఎయిర్ లైన్స్, జెట్ బ్లూ ఎయిర్ వేస్ అంటే తెగ ఇష్టమట. సర్వీసుల్లో అలస్కా, ధరల్లో జెట్ బ్లూ వరుసగా తమ ప్రాధాన్యతను నిలుపుకున్నాయి. ఈ రెండే అమెరికాలో అత్యంత ప్రముఖమైన ఎయిర్ లైన్స్ గా టైటిల్స్ ను దక్కించుకున్నాయట. వినియోగదారులకు సంతృప్తికరమైన ఫుల్ సర్వీసులను అందించే ఎయిర్ లైన్ గా తొమ్మిదో సారి అలస్కా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా తక్కువ ధరలు ఆఫర్ చేసే ఎయిర్ లైన్ కిరీటం వరుసగా 11వ ఏడాదీ జెట్ బ్లూనే వరించిందట. మార్చి 2015 నుంచి మార్చి 2016 వరకూ 10,348 మంది ప్యాసెంజర్ల జేడీ పవర్ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వినియోగదారులను సంతృప్తిలో ఎయిర్ లైన్స్ ఆఫర్ చేసే ఏడు కొలమానాలు పరిగణలోకి తీసుకుని జేడీ పవర్ ఈ సర్వే నిర్వహించింది. ధరలు, ఫీజులు, ఇన్-ఫ్లైట్ సర్వీసులు, బోర్డింగ్, డీ-ప్లానింగ్, బ్యాగేజ్, విమాన సిబ్బంది, ఎయిర్ క్రాప్ట్, చెక్ ఇన్ లు, రిజర్వేషన్లు వంటి కొలమానాల ఆధారంగా ఎయిర్ లైన్లకు ర్యాంకులు కేటాయించారు. 1,000 పాయింట్ ఇండెక్స్ కు లెక్కించిన ఈ కొలమానాల్లో జెట్ బ్లూ 790 ర్యాంకు, అలస్కా 751 ర్యాంకును దక్కించుకున్నాయి. అయితే జెట్ బ్లూ కంటే ఒక్క ర్యాంకు తక్కువగా సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ నిలిచి, 789 ర్యాంకును దక్కించుకుంది. మొత్తం ఎయిర్ లైన్స్ పరిశ్రమ 9 పాయింట్ల పెరిగి 726 కు చేరిందని జేడీ పవర్ తెలిపింది. 2006 నుంచి చేపడుతున్న ప్రస్తుత మెథడాలజీ సర్వేలో మొదటిసారి పరిశ్రమ కస్టమర్ల సంతృప్తిలో అత్యధిక స్థాయికి చేరిందని సర్వే ప్రకటించింది. ధరలు, ఫీజులు అనేవి వినియోగదారుల సంతృప్తి కేటగిరిలో కీలక అంశాలుగా జేడీ పవర్ తీసుకుంది. అదేవిధంగా యూనిటైడ్ ఎయిర్ లైన్స్ ఫుల్ సర్వీసుల కేటగిరిలో తక్కువ ర్యాంకును పొందగా, ఫ్రంటీయర్ ఎయిర్ లైన్స్ తక్కువ ధరల్లో వరస్ట్ గా నిలిచిందని సర్వే పేర్కొంది. 675, 662 ర్యాంకులను ఈ ఎయిర్ లైన్స్ పొందాయి. ఇన్-ఫ్లైట్ సర్వీసులు తక్కువ స్కోరింగ్ కేటగిరీలోఉన్పప్పటికీ..యేటికేటికీ క్యాబిన్ సౌకర్యాలను మెరుగుపరుస్తూ ఎయిర్ లైన్స్ తన వినియోగదారుల సంతృప్తిని పెంచుకుంటున్నాయని జేడీ పవర్ సర్వే తెలిపింది. -
పిల్లలు ఏడిస్తే.. చార్జీ తగ్గిస్తారట!
న్యూయార్క్ : చిన్న పిల్లలతో ఎక్కడికైనా ప్రయాణించాలంటే మహిళలకు కత్తి మీద సామే. మరీ ముఖ్యంగా విమానాల్లో చంటి పిల్లలతో ప్రయాణించడం వారికి చాలా కష్టం. ఈ నేపథ్యంలో జెట్ బ్లూ ఏడ్చే పిల్లల తల్లులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విమానం ఎక్కగానే చిన్నపిల్లలు ఏడుపు లంకించుకుంటారు. పిల్లలు ఏడిస్తే.. ఆ తల్లులకు తర్వాతి ప్రయాణంలో 25 శాతం చార్జీలను తగ్గిస్తామని జెట్‌బ్లూ సంస్థ ప్రకటించింది. ఒకవేళ నాలుగు సార్లు ఏడిస్తే.. తర్వాతి ప్రయాణం పూర్తిగా ఉచితం అన్నమాట!! ఈ 'ఫ్లే బేబీస్' ప్రమోషన్ ను ఏప్రిల్ 15న న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్ పోర్టు నుంచి లాంగ్ బీచ్ మధ్య ప్రయాణించినవారికి అందించినట్లు తెలిపారు. ఆ విమానంలో ఐదుగురు పిల్లలున్నారని, వారు నాలుగుసార్లు ఏడ్చేసరికి, వారి తల్లిదండ్రులకు జెడ్ బ్లూలో ఉచిత రౌండ్ ట్రిప్ టికెట్‌ను బహుమానంగా ఇచ్చినట్టు కంపెనీ చెప్పింది. పిల్లలతో విమానంలో ప్రయాణించేటప్పుడు తల్లులు పడే కష్టాలను గుర్తించి ఈ ఆఫర్‌ను తీసుకొచ్చామని జెట్ బ్లూ బ్రాండ్ మేనేజ్ మెంట్ అండ్ అడ్వర్టైజింగ్ డైరెక్టర్ ఎలిజిబెత్ విండ్రామ్ తెలిపారు. పిల్లలు ఏడుస్తుంటే పక్కనవాళ్లు ఏమనుకుంటారో భావించే తల్లుల బిడియాన్ని పోగొట్టడమే లక్ష్యంగా ఈ ఆఫర్ ప్రకటించామని ఎయిర్ లైన్ తెలిపింది. పిల్లలు ఆరున్నొక్క రాగం అందుకోగానే అందరూ చప్పట్లు కొడుతూ దాన్ని స్వాగతిస్తారు. ఈ ఆఫర్ పిల్లలతో ప్రయాణించే తల్లులకు స్వీట్ రిమైండర్‌గా కూడా గుర్తుంటుందని కంపెనీ చెబుతోంది.