నా వీడియోను ట్రోల్‌ చేయండి.. వైరల్! | Fort Lauderdale airport, Drunken women arrested | Sakshi
Sakshi News home page

నా వీడియోను ట్రోల్‌ చేయండి.. వైరల్!

Published Tue, Feb 19 2019 10:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

తప్పతాగిన ఓ మహిళ విమానంలో మిగతా ప్రయాణికులపై ఇష్టానుసారంగా అరుస్తూ, విమాన సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. అమెరికాలో వాలెరీ గోంజాలజ్‌ అనే 32 ఏళ్ల మహిళ గత గురువారం ఫోర్ట్‌ లాడర్‌డేల్‌లోని హాలీవుడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లాస్‌ వెగాస్‌కు వెళ్లడానికి జెట్‌ బ్లూ విమానం ఎక్కింది. అప్పటికే ఆమె తప్పతాగి ఉంది. విమానంలో మూడేళ్ల చిన్నారి పక్కన కూర్చోవాల్సి రావడంతో వాలెరీ కలత చెందింది. 'నేను రోజంతా తాగాలి. మూడేళ్ల చిన్నారి పక్కన నేను కూర్చోను' అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. ఉమ్మివేస్తూ, మితా ప్రయాణికులపై కూడా నిప్పులు చెరిగింది. దీంతో పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు. ఇది చూసిన ఆ యువతి ఈ వీడియోను వైరల్‌ చేయండి. నేను నా బ్యాగులు తీసుకుని వెళ్లిపోతున్నా అంటూ విమానంలో నుంచి దిగిపోయి, టెర్మినల్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. అనంతరం తిరిగి విమానంలోకి రావడానికి ప్రయత్నించిన అమెను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వాలెరీ సిబ్బందిపై దాడికి దిగింది. ఈ ఘటనతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ప్రయాణికుడు తీసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో వైరల్‌ అవుతోంది.   

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement