అమెరికన్లకు అలస్కా ఎయిర్ లైన్స్, జెట్ బ్లూ ఎయిర్ వేస్ అంటే తెగ ఇష్టమట. సర్వీసుల్లో అలస్కా, ధరల్లో జెట్ బ్లూ వరుసగా తమ ప్రాధాన్యతను నిలుపుకున్నాయి. ఈ రెండే అమెరికాలో అత్యంత ప్రముఖమైన ఎయిర్ లైన్స్ గా టైటిల్స్ ను దక్కించుకున్నాయట. వినియోగదారులకు సంతృప్తికరమైన ఫుల్ సర్వీసులను అందించే ఎయిర్ లైన్ గా తొమ్మిదో సారి అలస్కా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా తక్కువ ధరలు ఆఫర్ చేసే ఎయిర్ లైన్ కిరీటం వరుసగా 11వ ఏడాదీ జెట్ బ్లూనే వరించిందట. మార్చి 2015 నుంచి మార్చి 2016 వరకూ 10,348 మంది ప్యాసెంజర్ల జేడీ పవర్ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
వినియోగదారులను సంతృప్తిలో ఎయిర్ లైన్స్ ఆఫర్ చేసే ఏడు కొలమానాలు పరిగణలోకి తీసుకుని జేడీ పవర్ ఈ సర్వే నిర్వహించింది. ధరలు, ఫీజులు, ఇన్-ఫ్లైట్ సర్వీసులు, బోర్డింగ్, డీ-ప్లానింగ్, బ్యాగేజ్, విమాన సిబ్బంది, ఎయిర్ క్రాప్ట్, చెక్ ఇన్ లు, రిజర్వేషన్లు వంటి కొలమానాల ఆధారంగా ఎయిర్ లైన్లకు ర్యాంకులు కేటాయించారు. 1,000 పాయింట్ ఇండెక్స్ కు లెక్కించిన ఈ కొలమానాల్లో జెట్ బ్లూ 790 ర్యాంకు, అలస్కా 751 ర్యాంకును దక్కించుకున్నాయి. అయితే జెట్ బ్లూ కంటే ఒక్క ర్యాంకు తక్కువగా సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ నిలిచి, 789 ర్యాంకును దక్కించుకుంది. మొత్తం ఎయిర్ లైన్స్ పరిశ్రమ 9 పాయింట్ల పెరిగి 726 కు చేరిందని జేడీ పవర్ తెలిపింది.
2006 నుంచి చేపడుతున్న ప్రస్తుత మెథడాలజీ సర్వేలో మొదటిసారి పరిశ్రమ కస్టమర్ల సంతృప్తిలో అత్యధిక స్థాయికి చేరిందని సర్వే ప్రకటించింది. ధరలు, ఫీజులు అనేవి వినియోగదారుల సంతృప్తి కేటగిరిలో కీలక అంశాలుగా జేడీ పవర్ తీసుకుంది. అదేవిధంగా యూనిటైడ్ ఎయిర్ లైన్స్ ఫుల్ సర్వీసుల కేటగిరిలో తక్కువ ర్యాంకును పొందగా, ఫ్రంటీయర్ ఎయిర్ లైన్స్ తక్కువ ధరల్లో వరస్ట్ గా నిలిచిందని సర్వే పేర్కొంది. 675, 662 ర్యాంకులను ఈ ఎయిర్ లైన్స్ పొందాయి. ఇన్-ఫ్లైట్ సర్వీసులు తక్కువ స్కోరింగ్ కేటగిరీలోఉన్పప్పటికీ..యేటికేటికీ క్యాబిన్ సౌకర్యాలను మెరుగుపరుస్తూ ఎయిర్ లైన్స్ తన వినియోగదారుల సంతృప్తిని పెంచుకుంటున్నాయని జేడీ పవర్ సర్వే తెలిపింది.
అమెరికన్లకు ఆ విమానాలంటే తెగ ఇష్టమట..!
Published Wed, May 18 2016 12:29 PM | Last Updated on Thu, Apr 4 2019 3:49 PM
Advertisement