
ఇండోర్: ఏడాది వయసున్న కూతురు ఏడుపు భరించలేక తన భార్యకు ఓ వ్యక్తి తలాక్ చెప్పి విడాకులిచ్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అనంతరం అతడి భార్య ఉజ్మా అన్సారీ ఆమె సొంత జిల్లా బార్వానిలోని సెంథ్వాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కొత్త చట్టం తేవడం తెల్సిందే. ఆగస్టు 4న రాత్రి సమయంలో అనారోగ్యంతో ఉన్న తన కూతురు గుక్కపెట్టి ఏడవడంతో, నిద్ర పాడుచేసిందంటూ భర్త అక్బర్ తనతో గొడవ పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపారు. మరిది, మామలు తనను కొట్టారని చెప్పారు. వారి సమక్షంలోనే తన భర్త మూడు సార్లు తలాక్ చెప్పాడని పేర్కొన్నారు.