triple talak
-
మహిళా రక్షణ మాతోనే సాధ్యం
సహరన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఏ ముస్లిం మహిళా అణచివేతకు గురికాకూడదనే ఆదిత్యనాథ్ ప్రభుత్వం కోరుకుంటోందని, కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం చేయడంలో యూపీ సీఎం యోగీ పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. యూపీలో మహిళలకు రక్షణ కావాలన్నా, నేరస్థులు జైళ్లలో ఉండాలన్నా... బీజేపీ అధికారంలో ఉండాలని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొట్టమొదటి సారి యూపీలో ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహరన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ర్యాలీనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లు ఒక కళంకం అయితే, 2014లో జరిగిన సహరన్పూర్ మత కల్లోహాలు మరింత భయంగొల్పాయని, వాటికి కారణమైన వాళ్లకు 2017లోనే ఇక్కడి ప్రజలు గుణపాఠం చెప్పారని కితాబిచ్చారు. పేద ప్రజలు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందాలన్నా, చిన్న రైతులకు కిసాన్యోజన నిధులు రావాలన్నా, ఉచిత రేషన్ అందాలన్నా, టీకా ఉచితంగా అందాలన్నా, పక్కా ఇళ్లు ఇవ్వాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, అది యూపీ ప్రజలు గుర్తించారని తెలిపారు. ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బీజేపీ ప్రభుత్వం చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చిందన్నారు. బిపిన్‌రావత్ కటౌట్ వాడుకుంటున్నారు... ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని పాల్గొని ప్రసంగించారు. దివంగత జనరల్ బిపిన్ రావత్ బతికుండగా నిందించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకోసం ఆయన కటౌట్‌ను ఉపయోగించుకుంటోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు, ఢిల్లీలో ఉండి రుజువులు కావాలని అడిగిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సాయుధ దళాలపై విద్వేషం వెల్లగక్కిన నేతలు ఇప్పుడు వారి చిత్రాలను ఉపయోగించుకోవడం హాస్యాస్పదమన్నారు. బిపిన్‌రావత్ జ్ఞాపకాలను కొనియాడిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. నెహ్రూ వల్లే గోవా విముక్తి ఆలస్యం పండిట్ జనవహర్‌లాల్ నెహ్రూ పట్టుబడితే... 1947లో కొన్ని గంటల్లోనే గోవా, పోర్చుగీసు నుంచి విముక్తమయ్యేదని, కానీ ఆయన నిర్లక్ష్యం వల్లే 15ఏళ్ల కాలం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మపుసలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీ గోవాను శత్రువులా చూస్తోందని, భవిష్యత్‌లోనూ అదే తీరు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. గోవా యువత ఏం కోరుకుంటోంది? ఇక్కడి రాజకీయ సంస్కృతి ఏమిటన్నది కాంగ్రెస్‌కు ఎప్పటికీ అర్థం కాదన్నారు. -
‘ట్రిపుల్ తలాక్’ చట్టాన్ని పరిశీలిస్తాం!
న్యూఢిల్లీ: ముస్లింలలో తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించి, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్రం తెచ్చిన చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ల మేరకు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం–2019’ని ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించటం తెలిసిందే. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను పరిశీలించాలంటూ వచ్చిన నాలుగు పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదిస్తూ, ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా మార్చడం, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడం పట్ల తాము ఆందోళనతో ఉన్నామన్నారు. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పినందున ఇప్పుడు శిక్షార్హమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. బాధిత మహిళ వాదన విన్నాకనే బెయిలు మంజూరు చేయాలన్న షరతు కూడా సరికాదని ఖుర్షీద్ తెలిపారు. ‘ట్రిపుల్ తలాక్ చెల్లదని కోర్టు గతంలోనే చెప్పినందున ఇప్పుడు ఆ పద్ధతే లేదు. మరి వారు దేనిని నేరంగా పరిగణిస్తారు’ అని ఆయన ప్రశ్నించారు. దీనికి కోర్టు స్పందిస్తూ మరి ఎవరైనా ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ పద్ధతిలో విడాకులిస్తే ఏం చేయాలనీ, దీనికి పరిష్కారం ఏంటని ప్రశ్నించింది. ఖుర్షీద్ సమాధానమిస్తూ ట్రిపుల్ తలాక్‌ను కోర్టు ఎప్పుడో రద్దు చేసిందని మళ్లీ చెబుతూ, చట్టంలోని వివిధ ఇతర అంశాలను పరిశీలించాలని కోరారు. -
కూతురు ఏడ్చిందని తలాక్
ఇండోర్: ఏడాది వయసున్న కూతురు ఏడుపు భరించలేక తన భార్యకు ఓ వ్యక్తి తలాక్ చెప్పి విడాకులిచ్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అనంతరం అతడి భార్య ఉజ్మా అన్సారీ ఆమె సొంత జిల్లా బార్వానిలోని సెంథ్వాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కొత్త చట్టం తేవడం తెల్సిందే. ఆగస్టు 4న రాత్రి సమయంలో అనారోగ్యంతో ఉన్న తన కూతురు గుక్కపెట్టి ఏడవడంతో, నిద్ర పాడుచేసిందంటూ భర్త అక్బర్ తనతో గొడవ పెట్టుకున్నాడని పోలీసులకు తెలిపారు. మరిది, మామలు తనను కొట్టారని చెప్పారు. వారి సమక్షంలోనే తన భర్త మూడు సార్లు తలాక్ చెప్పాడని పేర్కొన్నారు. -
‘తలాక్’ సరే, మన ‘ఇంటి’ గుట్టో?!
తలాక్ విషయంలో ముస్లిం దేశాలే మారుతున్నప్పుడు మనం మాత్రం మారకూడదా? అని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. కానీ, ముస్లిం సమాజంలో ‘సంస్కరణ’కు ఉద్దేశించినట్టు చెబుతున్న ‘తలాక్’ రద్దు బిల్లును సివిల్ చట్ట పరిధుల్లో పరిష్కరించకుండా క్రిమినల్ చట్టపరిధుల్లోకి ఎందుకు తీసుకొచ్చినట్లు? హైందవ సమాజాన్ని అన్ని కోణాలనుంచి సంస్కరించడం కోసం డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లును నేటికీ సంస్కరించరేం? విడాకుల సమస్యను మన ధర్మశాస్త్రాలు సివిల్ తగాదాలుగా పరిగణించాయి. కాని వాటిలోని మంచిని పక్కనబెట్టిన బీజేపీ పాలకులు మన ఇంటి గుట్టును పట్టించుకోకుండా మతప్రాతిపదికపైన సమస్యలను జటిలం చేయబోవడం సమర్థనీయం కాదు. హిందూ సమాజం ఇంతగా పరివర్తనకు వ్యతిరేకంగా ఎందుకు స్తబ్దతను చేజేతులా కొని తెచ్చుకుని వందల ఏళ్లుగా కుంటుకుంటూ రావలసి వస్తోంది? ‘‘ముస్లిం పురుషులు తక్షణం మూడుసార్లు తలాక్ చెప్పేసి తమ భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని పౌర చట్టం కింద నేరంగా మాత్రమే కాకుండా క్రిమినల్ లా కింద నేరంగా పరిగణిస్తూ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును లోక్‌సభతో పాటు రాజ్యసభ కూడా ఆమోదించడంతో రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారనుంది’’ – పత్రికా వార్త (30–07–2019) ‘‘మనదేశంలో లౌకిక రాజ్య వ్యవస్థ (సెక్యులరిజం) మౌలిక సూత్రా లను ఉల్లంఘించడమంటే, ప్రజాస్వామ్య జీవనం మూలాలనే ఉల్లంఘిం చడమని మరవరాదు’’ – ప్రముఖ రాజకీయ శాస్త్రాచార్యులు నీరా ఛందోక్ ‘తలాక్’ పద్ధతిని రద్దు చేస్తూ ప్రతిపాదించిన బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాదా మన ఇంటిగుట్టును విప్పకుండా దాచిపెడుతూ ఒక ప్రకటన చేశారు. ‘తలాక్ విషయంలో ముస్లిం దేశాలే మారుతున్నప్పుడు మనం మాత్రం మారకూడదా? అందులోనూ ఇప్పటికే 20 ముస్లిం దేశాలు తలాక్‌ను నియంత్రించా య’ని మంత్రి చెప్పారు. అంటే మార్పు, లేదా పరివర్తన అనేది మన సొంతమే కాదు, అన్ని ప్రపంచ దేశాలలోనూ తరతమ వ్యత్యాసాలతో వివాహ వ్యవస్థల్లోనూ, సామాజికంగానూ కాలానుగుణంగా అనివార్య పరిణామమే. అయితే బీజేపీ పాలకులు చట్టంగా రూపొందిస్తున్న ‘తలాక్’ రద్దు బిల్లుకు నైతికమైన బలం కొరవడుతోంది. ఎందుకంటే ఆ బిల్లుకు లేదా రేపటి చట్టానికి వివిధ కోణాలనుంచి బలం చేకూరాలంటే, సుమారు డెబ్బై ఏళ్లుగా వెలుగు చూడకుండా రాజకీయ పాలకులు కట్టిన ముళ్ల కంచెల నుంచి ఈ రోజుకీ వెలుగు చూడని ‘హిందూ కోడ్ బిల్లు’ను కూడా, హైందవ సమాజాన్ని అన్ని కోణాలనుంచి సంస్కరించడం కోసం బయటకు లాగవలసిన అవసరం ఉంది. బీజేపీ పాలకులు ముస్లిం సమాజంలో ‘సంస్కరణ’ పేరిట ఉద్దే శించినట్టు చెబుతున్న ‘తలాక్’ రద్దు బిల్లును సివిల్ చట్ట పరిధుల్లో పరి ష్కరించకుండా క్రిమినల్ చట్టపరిధుల్లోకి ఎందుకు తీసుకురావల్సి వచ్చిందో సమాధానం చెప్పగలగాలి! నేనొక ముస్లిం పెద్దకు ఒక ప్రశ్న వేశాను. మూడుసార్లు ‘తలాక్’ చెప్పి, ఆకస్మికంగా ముస్లిం పురుషుడు భార్యకు విడాకులివ్వడం న్యాయమా అని. దానికి ఆ ముస్లిం పెద్ద చెప్పిన సమాధానం హిందూ సంప్రదాయంలో భార్యాభర్తల మధ్య పొర పొచ్చాలు, తగాదాలు, ఘర్షణల ఫలితంగా విసుగెత్తి భార్యను భర్త, లేదా భర్తను భార్య వదిలించుకోవాలన్నప్పుడు వారి తల్లిదండ్రులు లేదా సంబంధిత బంధువులు ముందు ఏ పద్ధతి అనుసరిస్తారో అదే సంప్ర దాయం ముస్లిం కుటుంబాలలో కూడా ఉంటుందని, ఆయన చెప్పాడు. అంటే మూడుసార్లు ‘తలాక్’ చెప్పడమంటే తెగతెంపులకు ముందు తమ కాపురాన్ని చక్కదిద్దుకోడానికి మరోసారి ప్రయత్నించమని, ఆ ప్రయత్నం మూడుసార్లు కొనసాగాలన్నదే అసలు ఉద్దేశమని, ఇదే ‘షరియత్’ నిబంధనల సారాంశమని ఆ ముస్లిం పెద్ద వివరించారు. మనకూ తెలుగులో భార్యాభర్తల తగాదాలు, కుమ్ములాటలు, తెగే దాకా ఎవరో ఒకరు సమస్యల్ని సాగలాగడం గురించి నీతిపాఠాలన దగిన సామెతలున్నాయి: ‘ఆలు మగల మధ్య తగాదాలు’ నిలిచేది ‘పీటమీద ఆవగింజంత సేపే’ (అంటే జారిపోవడం)నని, మొగుడి మీద భార్యకు, భార్యమీద భర్తకు ‘కోపతాపాలు పొద్దుగుంకేవరకే’ననీ లౌక్యంగా మందలించడం. కనుకనే విడాకుల సమస్యను ధర్మశాస్త్రాలు సివిల్ తగాదాలుగా పరిగణించాయి. హైందవ సంస్కృతిలో ఈ మాత్రం మంచి సంప్రదాయాన్ని మరిచిపోయి పక్కనబెట్టిన బీజేపీ పాలకులు మతప్రాతిపదికపైన సమస్యలను జటిలం చేయబోవడం సమర్థనీయం కాదు. తలాక్ రద్దు బిల్లు ద్వారా భార్యాభర్తల మధ్య విడాకుల సమస్యలను సివిల్ తగాదా పరిధి నుంచి తప్పించి క్రిమినల్ దావాగా మార్చడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య తగాదాల పరిష్కారాన్ని క్రిమినల్ దావాగా మార్చి నిందితుడైన భర్తను మూడేళ్లదాకా జైల్లో నిర్బంధించి, అతనికి బెయిల్ ఇచ్చే సమస్యను మేజిస్ట్రేట్ విచక్షణకు వదలడంవల్ల ఆ దంపతులు సమాధానపడటానికి లేదా రాజీ పడటా నికి గల అవకాశాల్ని కూడా తోసిపుచ్చడమవుతుంది ఒక సామాజిక దురాచారాన్ని పరిష్క రించడానికి ఇదే మార్గమా? అలాగే, ఇప్పుడు ‘తలాక్ రద్దు’ బిల్లు ఇటు పార్లమెంట్ ఆమో దం పొందిన 24 గంటల్లోనే, ఆ మరునాడే ఈ బిల్లు పేరిట మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హరియాణలలో కేసులు, అరెస్టులు ప్రారంభమయ్యాయి. అందాకా ఎందుకు, అసలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1950 దాకా రాజ్యాంగ నిర్మాత హోదాలోనేగాక కాంగ్రెస్ నాయకత్వంలోని జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఆయన క్యాబినెట్లో ఉండి, దేశానికి వర్తించే ఉమ్మడి హిందూ కోడ్ బిల్లును స్వయంగా ఎందుకు ప్రవేశ పెట్టించ వలసి వచ్చింది? హిందూ సమాజంలో తరతరాలుగా కుల, మత, వర్గ, వర్ణ చట్రంలో మగ్గుతూన్న దళిత బహుజన, అణగారిన నిరుపేదల, మైనారిటీల మౌలిక ప్రయోజనాలను సహితం కాపాడగల సమగ్రమైన ‘హిందూ కోడ్ (సివిల్ కోడ్)’ బిల్లును పండిట్ నెహ్రూచే ప్రధానమంత్రి హోదాలో రూపకల్పన చేసి, ప్రవేశపెట్టించారు. అయితే సమాజంలో దగాపడిన, పడుతున్న దళిత బహుజనుల్ని, మహిళా లోకాన్ని సమగ్ర మైన హిందూ కోడ్ బిల్లు ద్వారా బయటపడవేయాలన్నది అంబేడ్కర్ తపన. అయితే ఈ మార్పు హిందూ సమాజంలోని సంపన్న వర్గాలకు నచ్చదు కాబట్టి, ఎంతగా సోషలిస్టు సెక్యులర్ భావాలతో తొలి దశలో ప్రేరేపితుడైనప్పటికీ పండిట్ నెహ్రూ ‘హిందూ కోడ్ బిల్లు’ లోని ‘వివా హాలు, విడాకులు’ అన్న విభాగానికే కుదించాలని, మిగతా విషయాలు ప్రస్తావించరాదనీ పట్టుబట్టడంతోనే అంబేడ్కర్ నెహ్రూ మంత్రి వర్గం నుంచి తప్పుకోవలసి వచ్చిందని మరవరాదు. ‘దురదృష్టవశాత్తు మన దేశంలో శాస్త్రాల్ని, వాటి పాఠ్యాన్ని కూడా తొక్కిపట్టేలా దుష్ట సంప్రదాయాన్ని పెంచి, పోషిస్తూ వచ్చారు. నిజానికి ఈ శాస్త్రాలన్నీ సవ్యమైన వివాహ సంబంధాలకే అనుకూలం’ అని కూడా అంబేడ్కర్ అన్నారు. శాస్త్రాలు నిర్ణయించిన ‘స్త్రీ ధనాన్ని’ కూడా కాజేయడానికి విడాకుల రాయుళ్లు ఎత్తులు వేస్తూ అరాచకాన్ని నేటి సమాజంలో సృష్టించడం మనం చూస్తున్నాం. పైగా గతంలో ఎన్నడూ లేనంత అరాచక ప్రవ ర్తనను చదువుకున్న మగధీరుల్లో కూడా గమనిస్తున్నాం. వీరి ప్రవర్తన చివరికి బజారు మూకలకు, ‘ఆవారా’గాళ్లకూ ఆదర్శం కావడమూ చూస్తున్నాం. ఏ రోజునా స్త్రీల హత్యలు, వివాహిత స్త్రీల పైన, బాల బాలి కలపైన మనం ఎన్నడూ ఎరుగని అత్యాచారాలను రోజూ వింటున్నాం, వీడియోల పుణ్యమా అని ఇంతకుముందెన్నడూ ఎరుగని వింతలూ, దుర్భర ఘటనలూ వింటున్నాం. దేశానికి ఆదర్శప్రాయమైన పౌరస్మృతి (సివిల్ కోడ్) రావడానికి సామాజిక, ఆర్థిక రంగాలలో సమగ్ర సంస్క రణలు తొలిమెట్టు అని అంబేడ్కర్ భావన. ఈ మౌలిక ప్రతిపాదనలను చేసినందుకే, తనకు కాంగ్రెస్ ప్రతిబంధకాలు సృష్టించింది. చివరికి నెహ్రూయే బిల్లును అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడానికి నిర్ణ యించి, మళ్లీ మనసు మార్చుకోవలసి వచ్చింది. ఇంతకూ హిందూ సమాజం ఇంతగా పరివర్తనకు వ్యతిరేకంగా ఎందుకు స్తబ్దతను చేజే తులా కొని తెచ్చుకుని వందల సంవత్సరాలుగా కుంటుకుంటూ రావ లసి వస్తోంది? ‘దాయభాగ– మితాక్షర’ న్యాయమార్గాల కుమ్ములాటల మధ్య వందల ఏళ్లుగా ఆడపిల్లల జీవితాలు నలిగిపోవలసి వచ్చిందని గుర్తించాలి. అందుకే దోపిడీ సమాజ వ్యవస్థలో మహిళలు కూడా ‘దళిత జీవులే’నని అంబేడ్కర్ ప్రకటించాల్సి వచ్చింది. ఋగ్వేదం పురుష సూక్తంలో (10వ మండలం– 19వ సూక్తం) ‘పురుషుడు పరమ స్వార్థపరుడు’ అని వర్ణించింది. ఎందుకని? ఆ పురు షుడు ఎలా ఉంటాడు? ముఖం చూస్తే బ్రాహ్మణుడు, చేతులు క్షత్రియు లని, తొడలు వైశ్యులని, శూద్రులు తదితరులు మాత్రం కాళ్లనుంచి పుట్టుకొచ్చారట. బహుభార్యత్వానికి కూడా ఋగ్వేద కాలంలోనే శాంక్షన్ పొందారు. పెళ్లి, తదితర విందు గుడుపుల కోసం గుర్రాలు, గోవులు, గొర్రెల మాంసం విస్తారంగా వాడారు. (10వ మండలం– 91 శ్లోకం) ఆ మాటకొస్తే ‘మాంసం లేకుండా విందు భోజనం ఉండరాద’ని ఫర్మానా ఆనాడే విడుదల చేశారు (‘నా మంసో మధు పర్కం భవతి’) మరొక్క మాటలో చెప్పాలంటే, ఋగ్వేదంలోని తొలి 9 మండలాల్లో లేని నాలుగు కులాలు (చాతుర్వర్ణాలు) నాలుగు వర్ణాలుగా అవతరించినా చాలక దళితులన్న పేరిట అయిదో కులావతరణకు ప్రారంభోత్సవం చేశారు. ‘ఎద్దు లేదా ఆబోతు మాంసోదనం నేతిలో వండుకుని తినాల’న్న బృహ దారణ్యకానికి టీక రాసినవారు శ్రీమాన్ శంకరాచార్యులు. బహుశా అందుకే ‘రామచరితమానస్’ రాసిన తులసీదాసు (15వ శతాబ్ది) ఋగ్వేద పురుషులకు, వారి ప్రాచీనులకు నిష్కామ కర్మలతో పనిలేదు, కోర్కెలను సాధించుకోవడమే వారి పని– అందుకే వారు కాముకులే గానీ నిష్కాములు కారు అన్నాడు. కనుకనే వేదం ‘కోరికే మనస్సులో పుట్టిన ప్రథమ రేతస్సు’ అన్నాడు. అది చచ్చే కోరిక కాదు, మీకైనా, నాకైనా, మోదీ, అమిత్‌షాల కైనా. ఈ అనంత ‘కోరిక’ల మధ్య ఎవరిని దృష్టిలో పెట్టుకొని మహాకవి మనల్ని మసలమంటున్నాడో చూడండి: ‘అతణ్ణి జాగ్రత్తగా చూడండి/స్వతంత్ర భారత పౌరుడు/అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి/ అతని యోగ క్షేమాలకు అంతా పూచీ పడండి/అతికించండి మళ్లీ అతని ముఖానికి నవ్వు’!! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ట్రిపుల్ తలాక్ రద్దుతో బెజవాడలో సంబరాలు
సాక్షి, విజయవాడ: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ అయిన సందర్భంగా విజయవాడ బీజేపీ నగర కార్యాలయం వద్ద బీజేపీ మహిళా, మైనారిటీ మోర్చా నాయకులు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా షేక్ బాజీ జాతీయ మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి పీసీ మాట్లాడుతూ.. దేశంలోని మైనార్టీ మహిళలకు మోదీ పెద్దన్నగా నిలిచి, తలాక్ బిల్ పాస్ కావటంతో 16 వందల సంవత్సరాల బానిస సంకెళ్లను తెంచారన్నారు. పరదా చాటున ఉన్న మహిళల ఆత్మ గౌరవాన్ని మోదీ కాపాడారని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం ముస్లిం మైనారిటీ మహిళలు సంబరాలు జరుపుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు బిల్లును అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించారు. -
‘ట్రిపుల్ తలాక్’కు లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ముస్లిం మతస్తులు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని శిక్షార్హం చేస్తూ రూపొందించిన బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రం ముస్లిం మహిళల(వివాహ హక్కుల రక్షణ) బిల్లు–2019ను తీసుకొచ్చింది. కాగా, ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లును పరిశీలించేందుకు వీలుగా స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, కేంద్రం అంగీకరించలేదు. ఈ సందర్భంగా ఇటు బీజేపీ, అటు విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టరాదన్న ప్రతిపక్షాల డివిజన్‌ను 302–82 తేడాతో లోక్‌సభ తిరస్కరించింది. అలాగే ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లిం పురుషులకు మూడేళ్లవరకూ జైలుశిక్ష విధించే సవరణకు లోక్‌సభ 302–78 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీచేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పందించేందుకు మహిళా ఎంపీలైన పూనమ్ మహాజన్, అపరజితా సేన్, మీనాక్షి లేఖీలను మోహరించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. 16వ లోక్‌సభ ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందకపోవడం, ఆర్డినెన్స్ గడువు ముగిసిపోవడంతో కేంద్రం మరోసారి బిల్లును ప్రవేశపెట్టింది. మొహమ్మద్ ప్రవక్తే వ్యతిరేకించారు.. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2017, జనవరి నుంచి ఇప్పటివరకూ 574 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదుకాగా, ఆర్డినెన్స్ జారీచేశాక 101 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల నిరోధక చట్టం లేదా గృహహింస చట్టం కింద హిందువులు, ముస్లింలు జైలుకు వెళితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ట్రిపుల్ తలాక్ విషయంలోనే అభ్యంతరాలు ఎందుకు? ట్రిపుల్ తలాక్‌ను నియంత్రించేందుకే ఇందులో మూడేళ్ల జైలుశిక్షను చేర్చాం. ఈ ఆచారాన్ని మొహమ్మద్ ప్రవక్త కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ఆపేయాలన్న దురుద్దేశంతోనే స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. ట్రిపుల్ తలాక్‌పై 20 ఇస్లామిక్ దేశాల్లో నియంత్రణ ఉంది. భారత్‌లాంటి లౌకికవాద దేశంలో ఎందుకుండకూడదు?’ అని ప్రశ్నించారు. ఈ బిల్లును మహిళల ఆత్మగౌరవం, లింగ సమానత్వం కోసమే తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ముస్లిం పురుషులే లక్ష్యం: కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్‌కు జైలుశిక్ష పడేలా చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు చెప్పలేదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తెలిపారు. ముస్లిం మహిళలతో పాటు భర్తలు వదిలేసిన హిందూ, పార్సీ మహిళలకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింలతో పోల్చుకుంటే హిందువుల్లో విడాకుల కేసులు ఎక్కువని మరో కాంగ్రెస్ నేత మొహమ్మద్ జాఫ్రి చెప్పారు. ముస్లిం పురుషులను జైలుకు పంపించడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అన్నది అనాగరికమేననీ, అయితే కేంద్రం తెచ్చిన బిల్లుపై తాము సుముఖంగా లేమని సీపీఎం నేత ఏ.ఎం.షరీఫ్ అన్నారు. డిప్యూటీ స్పీకర్‌పై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు వివాదాలకు కేరాఫ్‌గా మారిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత ఆజంఖాన్ గురువారం నోరు జారారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఆజంఖాన్ మాట్లాడుతుండగా, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. సహనం కోల్పోయిన ఆజంఖాన్ నఖ్వీవైపు చూస్తూ..‘మీరు అటూఇటూ కాని మాటలు మాట్లాడవద్దు’ అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రమాదేవి స్పందిస్తూ..‘మీరు కూడా అటూఇటూ చూడకుండా స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి మాట్లాడండి’ అని కోరారు. వెంటనే ఆజంఖాన్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేయగా, ఆజంఖాన్ తిరస్కరించారు. రమాదేవి తనకు సోదరిలాంటివారనీ, తప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు. ఆయన వ్యాఖ్యలను డెప్యూటీ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. మరోవైపు ఆజంఖాన్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మద్దతుగా నిలిచారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. వివాహవ్యవస్థ నాశనమవుతుంది: ఒవైసీ కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఇస్లామ్‌లో 9 రకాల తలాక్ పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ ఈ చట్టం ప్రకారం ముస్లిం భర్త జైలుకు వెళితే ఆయన భార్య పోషణను ఎవరు చూసుకోవాలి? మీరు(కేంద్ర ప్రభుత్వం) వివాహ వ్యవస్థనే నాశనం చేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళలను రోడ్డుపై పడేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళల హక్కులపై అంత ప్రేమున్న బీజేపీ ప్రభుత్వం 2013 ముజఫర్‌పూర్ అల్లర్లలో అత్యాచారాలకు గురైన ముస్లిం మహిళలకు ఎందుకు న్యాయం చేయట్లేదు. ఈ అకృత్యాలకు సంబంధించి ఇప్పటివరకూ దోషులకు శిక్షపడలేదు. జల్లికట్టును నిషేధిస్తూ చట్టాన్ని తెచ్చిన మీరు ముస్లింల మూకహత్యలను నిరోధిస్తూ చట్టం తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారు. మహిళల హక్కులపై నిజంగా బీజేపీకి అంత ప్రేముంటే ప్రత్యేక విమానంలో తమ మహిళా ఎంపీలను శబరిమలకు తీసుకెళ్లాలి’ అని ఒవైసీ చురకలు అంటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్థానం ► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్ తలాక్, నిఖా హలా ల, బహుభార్యత్వాల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లలో కక్షిదారులకు సహకరించాల్సిందిగా సుప్రీం కోర్టు అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిని కోరింది. ► మార్చి 28: మహిళలకు సంబంధించి పెళ్లి, విడాకులు తదితర అంశాలపై అతున్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ► అక్టోబర్ 7: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. లైంగిక సమానత్వం, లౌకికవాదం ఆధారం గా ఈ ట్రిపుల్ తలాక్‌పై పరిశీలన జరపాలని కోరింది. ► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాల పిటిషన్లపై విచారణ జరపడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ► మార్చి 27: ట్రిపుల్ తలాక్ విషయం న్యాయస్థానం పరిధిలోకి రాదని, ఆ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది. ► మే 18: ట్రిపుల్ తలాక్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు దీన్ని చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై చట్టం చేయాలని ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ► డిసెంబర్: ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన ‘ముస్లిం మహిళల బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ► 2018, ఆగస్టు 9: కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేసింది. నిందితులకు బెయిలు పొందే అవకాశం కల్పిస్తూ ఈ సవరణలు చేశారు. ► ఆగస్టు 10: ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.అయితే, బిల్లు సభ ఆమోదం పొందలేదు. ► సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్‌పై రూపొందిం చిన ఆర్డినెన్సును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఈ ఆర్డినెన్సును రూపొందించారు. ► డిసెంబర్ 31: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును మళ్లీ ప్రతిపక్షం అడ్డుకుంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండు చేసింది. -
లోక్‌సభలో ‘ట్రిపుల్ తలాక్’ రగడ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2019ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమనీ, దీనిపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌చేశాయి. ఈ సందర్భంగా బిల్లుకు అనుకూలంగా 186 మంది సభ్యులు మద్దతు తెలపగా, 74 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అనంతరం రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘ఇది మతానికి సంబంధించిన విషయం కాదు. మహిళలకు న్యాయం చేకూర్చడానికి సంబంధించినది. ఈ బిల్లును సమానత్వం, న్యాయం కోసం తీసుకొస్తున్నాం. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి 543 కేసులు నమోదయ్యాయి. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా 200 కేసులు నమోదయ్యాయి. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఇందుకోసం మేం కట్టుబడి ఉన్నాం’ అని స్పష్టం చేశారు. అందరికీ ఒకే శిక్ష ఉండాలి: కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు కేవలం ఓ మతాన్ని.. ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చారు. భార్యలను కేవలం ముస్లిం పురుషులే వదిలివేస్తున్నారా? ఈ బిల్లు సివిల్, క్రిమినల్ చట్టాలకు విరుద్ధంగా ఉంది. మేం ట్రిపుల్ తలాక్‌ను సమర్థించడం లేదు. కానీ ఈ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నాం. దేశంలో ఎవరు భార్యను వదిలేసినా ఒకే శిక్ష పడేలా చట్టం ఉండాలి’ అని సూచించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే: ఒవైసీ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ..‘ముస్లిం మహిళలపై ఇంత ప్రేమ చూపుతున్న బీజేపీ శబరిమల ఆలయంలోకి హిందూ మహిళలు వెళ్లడాన్ని వ్యతిరేకించింది. ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు రాజ్యాంగ హక్కులను స్పష్టంగా ఉల్లంఘిస్తోంది. ఎందుకంటే ఓ ముస్లిం పురుషుడు చేసిన నేరానికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని బిల్లులో పొందుపర్చారు. ఇదే తప్పును ముస్లిం కానివారు చేస్తే ఏడాది జైలుశిక్ష మాత్రమే పడుతుంది’ అని విమర్శించారు. ఆర్ఎస్పీకి చెందిన ఎంపీ ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్‌తో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును 2018, సెప్టెంబర్‌లో ఓసారి, 2019, ఫిబ్రవరిలో మరోసారి కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చింది. -
‘అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ రద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేస్తామని ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ సుస్మితా దేవ్ చెప్పారు. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ మైనారిటీ విభాగం సదస్సులో మాట్లాడుతూ ముస్లిం పురుషులపై ముస్లిం మహిళలను ఈ బిల్లు ద్వారా రెచ్చగొట్టే వాతావరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించారని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు అమలైతే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెబుతున్నా ముస్లిం పురుషులను జైళ్లలో మగ్గేలా, వారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల ఉద్యమం సాగించిన వేలాది ముస్లిం మహిళలను ఆమె అభినందించారు. ఈ బిల్లుకు పార్లమెంట్లో వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని, 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని తొలగిస్తుందని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు. -
చర్చకు నోచుకోని ‘ట్రిపుల్ తలాక్’
న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే విపక్షాలు పట్టు విడవకపోవడంతో ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభం కాలేదు. బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న తమ డిమాండ్‌ను ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. సోమవారం న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరినా, విపక్షాలు సహకరించకపోవడంతో కార్యకలాపాలు జరగకుండానే సభ వాయిదా పడింది. అంతకుముందు కావేరి నదీ జలాల పంపిణీ వివాదంపై ఏఐఏడీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో సభ వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టాక మరో 15 నిమిషాలు అంతరాయం ఏర్పడింది. తర్వాతా పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ రూపొందించిన తాజా బిల్లు గురువారం లోక్‌సభలో ఆమోదం పొందింది. సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తున్న కేంద్రం రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ..బిల్లు తాజా రూపం చాలా క్రూరంగా ఉందని, దాన్ని మరింత అధ్యయనం చేసేందుకు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని సగం కన్నా ఎక్కువ మంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఏదైనా బిల్లును చట్టం చేసే ముందు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న సంప్రదాయాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ స్పందిస్తూ.. బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని, అది ఆమోదం పొందడంలో కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వమే ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజకీయాలు చేస్తోందని మరో కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ తిప్పికొట్టారు. ఆర్డినెన్స్ తెచ్చినా కూడా ఈరోజు వరకు ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, లింగ సమానత్వంతో ముడిపడిన ఈ బిల్లుపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయ మంత్రి రవిశంకర్ అన్నారు. రఫేల్‌పై చర్చకు సిద్ధం: ఖర్గే రఫేల్ ఒప్పందంపై లోక్‌సభలో చర్చకు రావాలన్న కేంద్ర ప్రభుత్వ సవాలును కాంగ్రెస్ స్వీకరించింది. జనవరి 2న చర్చలో పాల్గొంటామని, సమయాన్ని నిర్ణయించాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్ కమిటీతో విచారణ జరిపించాలని పునరుద్ఘాటించారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ..ఈ అంశంపై ఖర్గే చర్చను ప్రారంభించాలని, బదులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కానీ ఖర్గే చర్చ నుంచి పారిపోతున్నారని అన్నారు. కొత్త ఏడాది నుంచి వెల్‌లోకి రాకండి కొత్త ఏడాది నుంచైనా సభ్యులు నిబంధనల మేరకు నడుచుకోవాలని, వెల్‌లోకి దూసుకురావద్దని లోక్‌సభ స్పీకర్ సుమిత్ర విజ్ఞప్తి చేశారు. రఫేల్‌పై కాంగ్రెస్, కావేరిపై ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగిన సమయంలో ఆమె స్పందిస్తూ..వారంతా తన కోసమైనా మీమీ స్థానాల్లోకి వెళ్లాలన్నారు. ఆమె మాటను గౌరవిస్తూ రెండు పార్టీల సభ్యులు వెనక్కువెళ్లారు. ‘ ఈ ఏడాదిలో ఇదే ఆఖరి రోజు. మీరు వెల్‌లోకి వచ్చిన ఆఖరి రోజు కూడా ఇదే కావాలని కోరుకుంటున్నా’ అని సుమిత్రా అన్న మాటల్ని సభ్యులంతా ఓపికగా వినడం గమనార్హం. -
తలాక్ చట్టం తెచ్చి తీరుతాం
గాంధీనగర్: సంప్రదాయవాదులు, ప్రతిపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తమ ప్రభుత్వం తెచ్చి తీరుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉద్ఘాటించారు. దేశంలో గత ప్రభుత్వాలు స్త్రీల సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోలేదనీ, తమ ప్రభుత్వం వచ్చాకనే మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ మహిళా విభాగం ఐదవ జాతీయ సదస్సులో మోదీ ప్రసంగించారు. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే బిల్లును గతంలోనే లోక్‌సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ మోకాలడ్డడంతో కేంద్ర బిల్లుకు పలు సవరణలు చేసింది. ఈ కొత్త బిల్లుపై లోక్‌సభలో ఈ నెల 27న చర్చ జరిగే అవకాశం ఉంది. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులిచ్చే భర్తలు బెయిలు పొందే అవకాశం కూడా తాజాగా ప్రభుత్వం కల్పించింది. అలాగే స్త్రీలు హజ్ యాత్రకు వెళ్లాలంటే పురుషులు తోడు ఉండాల్సిందేనన్న నిబంధనను కూడా తమ ప్రభుత్వం తొలగించిందని మోదీ చెప్పారు. 60–70 ఏళ్లుగా గత ప్రభుత్వాల చేతుల్లో మోసపోయిన మహిళలు ఇప్పుడు బీజేపీపై నమ్మకం పెట్టుకున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల (గ్యాస్ సిలిండర్ల పంపిణీ), ‘బాలికలను రక్షించండి, చదివించండి’ తదితర పథకాలను మోదీ ప్రస్తావించారు. వైమానిక, నౌకా దళాల్లోకి కూడా తమ ప్రభుత్వం మహిళలను అనుమతించిందన్నారు. విభజన శక్తులతో జాగ్రత్త సమాజంలో విభజన శక్తులు స్వల్పకాలిక ప్రయోజనాల కోసం కులం పేరిట దోపిడీలకు దిగుతున్నాయనీ, వారితో జాగ్రత్తగా ఉండాలని మోదీ పోలీసులకు సూచించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన డీజీపీ, ఐజీపీల వార్షిక సమావేశంలో మోదీ ప్రసంగించారు. కులం పేరిట జనాలను విడగొట్టే విభజన శక్తులను క్షేత్రస్థాయిలో ఏకాకులను చేయాలని ఆయన పోలీసులను కోరారు. దేశ సమగ్రత, ఐక్యతల కోసం పోలీసులు పనిచేయడాన్ని కొనసాగించాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నందుకు పోలీసులను మోదీ ప్రశంసించారు. ప్రత్యేకించి ఈ విషయంలో జమ్మూ కశ్మీర్ పోలీసులను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారన్నారు. కింది స్థాయిలో ప్రజల కోసం కష్టించే పోలీసులకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకోవచ్చని సలహా ఇచ్చారు. పలువురు నిఘా విభాగం (ఐబీ) అధికారులకు రాష్ట్రపతి పతకాలను మోదీ బహూకరించారు. జాతీయ పోలీస్ స్మారకంతో కూడిన పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు. సైబర్ సమన్వయ కేంద్రాన్ని ప్రారంభించారు. -
11 నుంచి పార్లమెంటు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్ చెప్పారు. డిసెంబర్ 11 నుంచి 2019, జనవరి 8 వరకు పార్లమెంటు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేరళ, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా సమావేశాల మధ్యలో వారం రోజుల విరామం ఇస్తామన్నారు. మొత్తంమీద 20 రోజుల పాటు పార్లమెంటు జరుగుతుందన్నారు. ఈ సమావేశాలు ఫలప్రదమయ్యేందుకు వీలుగా సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలను కోరుతున్నామన్నారు. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. అలాగే భారత వైద్య మండలి సవరణ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లు ఆర్డినెన్సులను ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో మోదీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్ 11నే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం గమనార్హం. -
ధీరవనితలు
న్యూఢిల్లీ: ‘ట్రిపుల్ తలాక్’ రూపంలో తాము ఎదుర్కొంటున్న కష్టాలు, వివక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వారంతా ముస్లిం మహిళలే. ఈ అంశానికే సంబంధించిన మొత్తం ఏడు పిటిషన్లను ఒకచోట చేర్చి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. షయారా బానో (36)తోపాటు నలుగురు మహిళలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లు, ఆరెస్సెస్ అనుబంధ రాష్ట్రీయవాదీ ముస్లిం మహిళా సంఘం, భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ వేసిన పిటిషన్లను కలిసి సుప్రీంకోర్టు విచారించింది. ► షయారా బానో 2015 అక్టోబర్‌లో ఒక లేఖ ద్వారా షయారా బానో భర్త రిజ్వాన్ అహ్మాద్ ట్రిపుల్ తలాక్ చెప్పడంతో పాటు పిల్లలను తన వెంట తీసుకెళ్లిపోయాడు. దీనిపై బానో బహిరంగంగానే మండిపడింది. 3 నెలల విరామాన్ని (ఇద్దత్) పాటించకుండా విడాకులు ఇవ్వడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. అత్తమామలు తనకు బలవంతంగా మాత్రలు ఇవ్వడం వల్ల ఆరుసార్లు గర్భస్రావమై, తన ఆరోగ్యంపై దు ష్ప్రభావం చూపిందని బానో సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆమె వేసిన పిటీషన్‌పై కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. ► ఇష్రత్ జహాన్ పశ్చిమ బెంగాల్ హౌరాకు చెందిన ఇష్రత్ జహాన్‌కు 2015 ఏప్రిల్‌లో భర్త ముర్తజా దుబాయ్ నుంచి ఫోన్లో మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చారు. దీనిని ఆమె తమ పిటిషన్లో ప్రశ్నించారు. మరో యువతిని పెళ్లాడిన ముర్తజా.. తన నలుగురు పిల్లలనూ తీసుకెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ద్వారా తలాక్ తనకు సమ్మతం కాదని, పిల్లలను తనకు అప్పగించాలని, వారిని పెంచి పెద్ద చేసేందుకు అవసరమైన భరణాన్ని ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. ► ఆఫ్రీన్ రెహ్మాన్ 2014లో వివాహ సంబంధాల పోర్టల్ (మెట్రిమోనియల్ సైట్) ద్వారా జైపూర్‌కు చెందిన సయ్యద్ అషార్ అలీ వార్సీతో ఆఫ్రీన్ రెహ్మాన్ వివాహమైంది. పెళ్లి అయిన రెండు, మూడునెలలకే కట్నం కోసం అత్తమామల వేధింపులు అధికమయ్యాయి. అదనపు కట్నం కూడా వారు తనను శారీరకంగా కూడా హింసించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2015 సెప్టెంబర్‌లో తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారన్నారు. 2016 జనవరి 27న పుట్టింట్లో ఉన్న ఆమెకు స్పీడ్‌పోస్ట్ ద్వారా విడాకులు అందాయి. ఈ పద్ధతిలో విడాకులు పంపించడం తనకు ఆమోదయోగ్యం కాదంటూ ఆమె పిటిషన్ వేశారు. ► ఫరా ఫైజ్ ట్రిపుల్ తలాక్ కేసు పిటిషనర్లలో సుప్రీంకోర్టు న్యాయవాది ఫరా ఫైజ్ ఒకరు. ముమ్మారు తలాక్ పద్ధతి ఖురాన్లో విడాకులను గుర్తించేందుకు ఉద్దేశించినది కాదనేది ఆమె వాదన. ఆరెస్సెస్ అనుబంధ రాష్ట్రీయవాదీ ముస్లిం మహిళా సంఘానికి జాతీయ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. షరియా చట్టం కింద ముస్లిం మహిళలకు భద్రత ఉన్నా ఖురాన్లో ప్రస్తావన లేని ట్రిపుల్ తలాక్, నిఖా హలాలాలకు పర్సనల్‌లా బోర్డు ప్రాధాన్యతనిస్తోందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ► అతియా సాబ్రీ 2012లో వివాహమైన అతియా సాబ్రీకి ఒక కాగితంపై ‘తలాక్’ అంటూ మూడుసార్లు రాసి ఆమె భర్త విడాకులిచ్చారు. ఇలాంటి విడాకులు న్యాయబద్ధం కాదంటూ ఆమె పిటిషన్ వేశారు. తనకు చిన్నవయసున్న ఇద్దరు ఆడ పిల్లలున్నారని, వారిని పెంచి పెద్దచేయాల్సిన బాధ్యత తనపై ఉన్నందున న్యాయం చేయాలని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. ► గుల్షన్ పర్వీన్ 2015లో తల్లిదండ్రులను కలిసేందుకు పుట్టింటికి వచ్చిన తనకు పది రూపాయల స్టాంప్ పేపర్‌పై విడాకుల పత్రం (తలాక్ నామా) పంపించి భర్త విడాకులు ఇవ్వడాన్ని యూపీలోని రాంపూర్‌కు చెందిన గుల్షన్ పర్వీన్ కోర్టులో సవాల్ చేశారు. ఈ విడాకులకు అంగీకరించకపోవడంతోపాటు భర్త నోటీసునూ ఆమె తిరస్కరించారు. -
ముస్లిం పురుషుల పార్టీ కాంగ్రెస్!
ఆజంగఢ్: కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం పురుషుల పక్షానే నిలుస్తుందని ప్రధాని మోదీ∙విమర్శలు చేశారు. ట్రిపుల్ తలాక్‌పై వీరు అనుసరిస్తున్న ధోరణే ఇందుకు నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో–ఘాజీపూర్‌లను అనుసంధానించే 340 కిలోమీటర్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకు (రూ.23వేల కోట్లు విలువైన) ఆజంగఢ్‌లో మోదీ శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్ సహా విపక్షాలపై నిప్పులు చెరిగారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మోదీ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ముస్లిం మహిళల కష్టాలపై విపక్ష పార్టీల అసలు రంగు బయటపడింది. మహిళల జీవితాల్లో వెలుగు తేవాలని మేం చూస్తుంటే విపక్ష పార్టీలు ముస్లిం మహిళల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటానని భరోసా ఇస్తున్నా’ అని అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను అడ్డుకుంటూ.. ‘కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పినట్లు వార్తాపత్రికల్లో చదివాను. దీనిపై చర్చ జరుగుతోంది. సహజవనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉంటుందని ప్రధానిగా మన్మోహన్ ఆనాడు అన్నారు. కాంగ్రెస్ ముస్లిం పురుషుల కోసమేనా? ముస్లిం మహిళల హక్కులను గౌరవించే అవకాశం మీ పార్టీలో ఉందా? ట్రిపుల్ తలాక్‌ను అడ్డుకునేందుకు రాజ్యసభ జరగకుండా చేస్తున్నారు’ అని మండిపడ్డారు. లోక్‌సభలో ఆమోదం పొందిన తలాక్ బిల్లును రాజ్యసభలో విపక్షాలు అడ్డుకోవడం తెల్సిందే. కాంగ్రెస్, విపక్షాలు బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ మాత్రం ఆ పార్టీలు బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నాయంది. ‘ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా బాధితులను కలవండి. వారి బాధలేంటో అర్థం చేసుకోండి’ అని విపక్షాలను ప్రధాని కోరారు. నాలుగేళ్ల కృషికి ఫలితమిది వారణాసి దుస్థితికి గత ప్రభుత్వాల విధానాలే కారణమని మోదీ విమర్శించారు. వారణాసిలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘వారణాసిలో మార్పు ఇప్పుడిప్పుడే కనబడుతోంది. మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతోనే ఈ మార్పు సాధ్యమైంది. గత ప్రభుత్వాలు వారణాసిని పూర్తిగా విస్మరించాయి’ అని అన్నారు. ‘గతంలో బద్ధశత్రువులైన పార్టీలు (పరోక్షంగా బీఎస్పీ, ఎస్పీలను పేర్కొంటూ) ఇప్పుడు ఒక్కటయ్యాయి. దళితులు, వెనుకబడిన వర్గాలకు మాయమాటలు చెప్పి ఓట్లు అడిగిన వీరు గెలిచాక తమ జేబులు నింపుకుంటున్నారు’ అని విమర్శించారు. వారణాసితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు లబ్ధి చేకూర్చే దాదాపు రూ.వెయ్యికోట్ల పనులను మోదీ ప్రారంభించారు. అది మా ఆలోచనే: అఖిలేశ్ తమ ప్రభుత్వం చేసిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే అని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ అన్నారు. తమ ప్రాజెక్టులనే బీజేపీ అమల్లోకి తెస్తోందన్నారు. ‘ఈ ప్రాజెక్టుకు మేం సమాజ్‌వాదీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ అని పేరుపెట్టాం. కానీ సమాజ్‌వాదీని పక్కనపెట్టిన బీజేపీ ఇది తన ఘనతగా చెప్పుకుంటోంది’ అని లక్నోలో విమర్శించారు. ఈ విమర్శలను సీఎం యోగి తిప్పికొట్టారు. ఎస్పీ ప్రభుత్వం భూసేకరణ, పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే టెండర్లకు పిలిచి చేతులు దులుపుకుందని ఆయన వెల్లడించారు. -
‘తెలంగాణలో ట్రిపుల్ తలాక్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ట్రిపుల్ తలాక్ ఆచారం కొనసాగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా నగరంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లో ఉన్నా తెలంగాణలో మాత్రం ఆ ఆచారం కొనసాగుతోందని అన్నారు. ముస్లిం దేశమైన పాకిస్తాన్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలు తలాక్‌ని నిషేదించాయని, మనం ఎందుకు నిషేదించకుడదని ప్రశ్నించారు. ముస్లిం మహిళల అత్మగౌరవాన్ని కాపాడేందుకు రూపొందించిన తలాక్ బిల్లుకి పార్లమెంట్లో సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ అడ్డుపడ్డారని విమర్శించారు. మహిళలను వేధించిన వారికి ముడేళ్ల శిక్ష అన్ని మతాల వారికి వర్తింస్తుందని కేవలం మతం ఆధారంగా చుడరాదని కోరారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 15 లింగ సమానత్వం అందరికి వర్తిస్తుందని కేవలం మతం ఆధారంగా కఠిన చట్టాలు ఉండడానికి వీళ్లేదన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నిర్వహించిన సమావేశాల్లో రవిశంకర్ పాల్గొన్నారు. నాలుగేళ్ల కాలంలో మోదీ సర్కార్ సాధించిన విజయాలపై డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. కొద్ది కాలంలోనే మోదీ ప్రపంచ నేతగా ఎదిగారని పేర్కొన్నారు. -
ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై రాజ్యసభలో వాడివేడి చర్చ
-
‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం భర్త అకస్మాత్తుగా ట్రిపుల్ తలాక్ చెప్పేసి, భార్యకు విడాకులు ఇవ్వటం చెల్లదు. అలా చేసిన పక్షంలో సదరు భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలుంటుంది. ముందస్తు సమాచారం లేకుండా ట్రిపుల్ తలాక్ చెప్పే ‘తలాక్– ఇ–బిద్దత్’కు ఇది వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లోనే బాధితు రాలు కోర్టును ఆశ్రయించి తనతోపాటు, మైనర్లయిన పిల్లలకు అవసరమైన సాయం కోరే హక్కు కల్పిస్తుంది. హోంమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ ముసాయిదాను తయారు చేసింది. ఈ ఉప సంఘంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి జైట్లీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్, సహాయ మంత్రి పీపీ చౌదరి ఉన్నారు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం రూపొందించిన బిల్లు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటేనే మద్దతిస్తామని, లేకుంటే తిరస్కరిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు రూపొందించటానికి ముందే కేంద్రం ప్రభుత్వం ముస్లిం సంఘాలు, నిపుణులతో చర్చించాల్సి ఉందని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) తెలిపింది. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దటం తగదని పేర్కొంది. ఆలిండియా ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డ్, ముస్లిం ఉమెన్ లీగ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఎండీఆర్ చార్జీల భారం లేదు... ► రూ.రెండు వేలలోపు డెబిట్ కార్డులు, భీమ్, ఆధార్ అనుసంధాన లావాదేవీల చార్జీలను ప్రభుత్వం భరించనుంది. మర్చంట్ డిస్కౌంట్‌రేట్(ఎండీఆర్) మొత్తాన్ని లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ►మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఆమోదం. ►తోళ్లు, పాదరక్షల విభాగానికి రూ.2,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ. దీంతో మూడేళ్లలో దాదాపు 3లక్షల ఉద్యోగాల కల్పన అవకాశం. ►జాతీయ ఆయుష్ మిషన్(ఎన్ఏఎం) అమలును 2020 వరకు పొడిగిస్తూ రూ.2,400 కోట్లు కేటాయించింది. ►చెక్ బౌన్స్ కేసులు ట్రయల్ కోర్టులో విచారణలో ఉండగానే కొంత మొత్తాన్ని బాధితుడికి చెల్లించేలా ‘నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్’ చట్టంలో సవరణకు ఓకే. ►జీఎస్టీ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టేందుకు నిర్ణయం. జీఎస్టీ చట్టం–2017 ప్రకారం.. వస్తు సేవా పన్ను అమలుతో రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయానికి తగు పరిహారాన్ని కేంద్రం అందజేస్తుంది. -
‘ట్రిపుల్ తలాక్’కు మూడేళ్ల జైలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఈ దిశగా కఠినమైన చర్యలకోసం రంగం సిద్ధం చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా.. ముస్లిం మహిళల (రక్షణ, విడాకులపై హక్కులు) చట్టం 1986కు పలు మార్పులు చేస్తోంది. న్యాయశాఖ, హోంశాఖ వర్గాలు సంయుక్తంగా రూపొందించిన ముసాయిదాలో ట్రిపుల్ తలాక్ చెప్పటాన్ని తీవ్రంగా పరిగణించటంతోపాటు ఆ నేరానికి పాల్పడినవారికి మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండింటినీ అమలుచేసేలా నిబంధనలున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందంతో చర్చించి, రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది ముసాయిదాను సిద్ధం చేస్తారని సమాచారం. ముస్లిం మహిళల హక్కుల చట్టాన్నే.. ‘షా బానో చట్టం–1986’గా కూడా పిలుస్తారు. ముస్లిం మతపెద్దలనుంచి తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం షా బానో కేసు నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టం పీఠికలో విడాకులు పొందిన తర్వాతే మహిళలకు వర్తించేలా నిబంధనలున్నాయని.. వీటిని మార్చి విడాకులకు ముందే న్యాయం జరిగేలా మార్పులు చేయాలని భావిస్తోంది. దీంతోపాటుగా నేరశిక్షాస్మృతిలోని సెక్షన్ 125 (భార్య, పిల్లలు, తల్లిదండ్రుల పోషణకు నిరాకరించినప్పుడు తీసుకునే చర్యలు)కూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నా దీనిపై ముందుకే వెళ్లాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు ముసాయిదాలను పంపించిన న్యాయశాఖ.. దీనిపై వారి అభిప్రాయాలను కోరనుంది. ట్రిపుల్ తలాక్ మార్పులపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందంలో రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరీలున్నారు. విడాకుల తర్వాత మైనర్ చిన్నారుల కస్టడీ (లీగల్ ప్రొటెక్షన్) విషయంలోనూ న్యాయమూర్తులు తుది నిర్ణయం తీసుకునేలా ముసాయిదాలో పేర్కొన్నారు. మాటల ద్వారానైనా, ఎస్ఎంఎస్, ఈ–మెయిల్, వాట్సప్ సందేశాల ద్వారానైనా ట్రిపుల్ తలాక్ చెప్పటం చెల్లదని స్పష్టం చేశారు. ముసాయిదాకు ఆమోదం లభిస్తే.. జమ్మూకశ్మీర్ మినహా దేశమంతా కొత్త చట్టం అమల్లోకి రానుంది. -
త్రిపుల్ తలాక్‌పై మానుషి చిల్లర్..
వైద్యవిద్యను అభ్యసిస్తూ.. ప్రపంచం మెచ్చిన అందగత్తె అయిన మానుషి చిల్లర్, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన త్రిపుల్ తలాక్‌పై స్పందించారు. త్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్దమైన పద్ధతి అని చాలా క్లారిటీగా ఉందన్నారు. వివాహంపై ఒక్క వ్యక్తికే ఎక్కువ యాజమాన్యం ఉండకూడదని పేర్కొన్నారు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య చిగురించే ఎంతో ప్రత్యేకమైన స్నేహ భావమని, ఆ బంధంలో ఏ ఒక్కరికే ఎక్కువ యాజమాన్యం ఇవ్వలేమని తెలిపారు. త్రిపుల్ తలాక్ నుంచి లైంగిక వేధింపుల వరకు పలు సామాజిక అంశాలపై మానుషి మాట్లాడారు. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కూడా మానుషి చిల్లర్ స్పందించారు. పిల్లలను రక్షించే బాధ్యత అందరికీ ఉందని, వారికి సాధారణమైన జీవితం ఇవ్వాలన్నారు. ''మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకుంటే, పిల్లలను రక్షించే బాధ్యత ఎంతో ముఖ్యమైనదని నేను భావిస్తున్నా. మనం పిల్లలకు శక్తినిస్తే, అదే దేశానికి శక్తినిచ్చినట్టవుతుందిపిల్లలకు భద్రత కల్పిస్తే, వారి జీవితాల్లో అద్భుతాలు చేసి చూపిస్తారు. ప్రతి చిన్నారికి పెరిగే హక్కు ఉంటుంది'' అని అన్నారు. మూలాల నుంచి మార్పు రావాల్సి ఉందని, మహిళలకు గౌరవించే లక్షణం ఇంటి వద్ద నుంచే వచ్చేలా పిల్లలకు పాఠాలకు చెప్పాలని పేర్కొన్నారు. విద్య ఎంతో ముఖ్యమైనదని, కేవలం పాఠశాలల్లోనే కాక, ఇంటి వద్ద కూడా దీన్ని నేర్పించాలని వివరించారు. ఇంటి వద్దే మహిళలను గౌరవించడం నేర్పిస్తే, సమాజంలో కూడా మహిళలను గౌరవించే లక్షణం నేర్చుకుంటారని చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయ్యే యోచన లేదని, అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశాలున్నాయా అనే దానిపై పూర్తిగా కొట్టిపారేయలేదు. కాగ, 17 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని భారత్ నుంచి మానుషి చిల్లర్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
‘తలాక్’కు సంఘ బహిష్కరణ
ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం ► భార్యాభర్తల వివాద పరిష్కారానికి నియమావళి జారీ ► ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ఖాజీలకు సలహా ఇస్తామని వెల్లడి న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లింలకు సంఘ బహిష్కరణ విధించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఐఏఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ట్రిపుల్ తలాక్ పాటించొద్దంటూ పెళ్లికొడులకు చెప్పాలని ఖాజీలకు సలహావళి జారీ చేస్తామని సోమవారం సుప్రీం కోర్టుకు అఫిడవిట్లో తెలిపింది. షరియత్ ప్రకారం ట్రిపుల్ తలాక్ అవాంఛనీయమని, భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి భార్యాభర్తల కోసం షరియత్‌కు అనుగుణంగా ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. దంపతుల మధ్య రాజీ కుదరని పరిస్థితిలో తప్పనిసరైతే ఒకసారి తలాక్ చెప్పొచ్చని, ఒకేసారి మూడు తలాక్‌లు చెప్పకూడదని స్పష్టం చేసింది. ‘‘గత నెల 15–16న జరిగిన మా వర్కింగ్ కమిటీ భేటీలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశాం. నిష్కారణంగా ట్రిపుల్ తలాక్‌తో విడాకులివ్వడాన్ని షరియత్ తీవ్రంగా ఖండిస్తుంది.. ఈ సందేశాన్ని ముస్లింలలోని అన్ని వర్గాలకు.. ముఖ్యంగా పేదలకు చేరవేసేందుకు అన్ని విధాలా యత్నించాలి. మసీదుల్లోని ఇమాంల, బోధకుల సహాయం తీసుకోవాలి. ఈ అంశంపై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం’’ అని బోర్డు తెలిపింది. ట్రిపుల్ తలాక్ వద్దని పెళ్లికొడుకులకు చెప్పండి.. భార్యతో విభేదాలేవైనా వస్తే ట్రిపుల్ తలాక్ పాటించొద్దని నిఖానామా సమయంలో పెళ్లికొడుకులకు చెప్పాలని ఖాజీలను కోరాతామని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. తమ వెబ్సైట్, ప్రచురణలు, సోషల్ మీడియా వేదికల ద్వారా సలహావళిని జారీ చేయాలని నిర్ణయించామంది. భర్త ట్రిపుల్ తలాక్‌కు చెప్పకూడదనే షరతును నిఖానామాలో పొందుపరచాలని వధూవరులకు నిఖా జరిపించే వ్యక్తి సూచిస్తారని అఫిడవిట్లో తెలిపింది. ఈ అఫిడవిట్‌ను చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించనుంది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ఈ ధర్మాసనం తన తీర్పును గత వారం రిజర్వులో ఉంచడం తెలిసిందే. అఫిడవిట్‌పై విమర్శలు ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీం కోర్టుకు అందజేసిన అఫిడవిట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బోర్డు గందరగోళాన్ని సృష్టించిందని ట్రిపుల్ తలాక్‌ను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఫరా ఫైజ్ ఆరోపించారు.బోర్డు ప్రైవేటు సంస్థ అని, అది ఖాజీలకు ఇచ్చే ఆదేశాలు అందరికీ వర్తించవని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ పేర్కొంది. భార్యాభర్తలకు బోర్డు నియమావళి ⇒ వివాదాన్ని భార్యాభర్తలు తొలుత పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి. ఒకరి తప్పులను ఒకరు మరచిపోయేందుకు యత్నించాలి. అప్పటికీ ఫలితం లేకపోతే తాత్కాలికంగా విడిగా ఉండాలి. ⇒ అలా పరిష్కారం కాకపోతే ఇద్దరి తరఫు కుటుంబాల్లోని పెద్దలు రాజీకి ప్రయత్నించాలి. ఫలితం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు. అప్పుడు కూడా తలాక్ అని ఒకసారి మాత్రమే చెప్పాలి. ఇద్దత్(వేచి ఉండే కాలం) వరకు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఇద్దత్‌లో సమస్య పరిష్కారమైతే తిరిగి భార్యాభర్తలుగా జీవించవచ్చు. పరిష్కారం కాకపోతే ఇద్దత్ ముగిశాక వివాహం రద్దు అవుతుంది. ఇద్దత్ కాలంలో భార్య గర్భిణి అయితే ఇద్దత్‌ను ప్రసవం వరకు పొడిగించాలి. ఇద్దత్ తర్వాత రాజీ కుదిరితే విడిపోయిన జంట మళ్లీ పెళ్లాడి వివాహాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ⇒ విడాకులకు మరో పద్ధతినీ అనుసరించవచ్చు. తొలి తలాక్ చెప్పిన తర్వాత, రెండో నెలలో మరో తలాక్, మూడో నెలలో మరో తలాక్ చెప్పి తద్వారా విడాకులు పొం దొచ్చు. మూడో తలాక్ ముందు రాజీ కుదిరితే తిరిగి భార్యాభర్తలుగా ఉండొచ్చు. భర్తతో కలసి ఉండటం ఇష్టం లేకపోతే భార్య ‘ఖులా’ ద్వారా విడాకులు పొందొచ్చు. -
‘తలాక్’ మతపరమైనదా? కాదా?
ఇస్లాం ప్రాథమికాంశాల్లో దీని ప్రస్తావనపై చర్చిస్తాం : సుప్రీంకోర్టు ► బహుభార్యత్వాన్ని స్పృశించం ► నిఖా హలాలాపైనా విచారణ ► ట్రిపుల్ తలాక్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ► ఇస్లాం దేశాల్లో ట్రిపుల్ తలాక్ లేదు: పిటిషనర్లు ► భార్యాభర్తల రాజీతోనే తలాక్ అన్న సల్మాన్ ఖుర్షీద్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా పద్ధతుల రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. ఈ సంప్రదాయం ఇస్లాం ప్రాథమికాంశమా? కాదా? అనే అంశంపైనే మొదటగా చర్చ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ట్రిపుల్ తలాక్ సంస్కారబద్ధమైనదేనా? ముస్లింల ప్రాథమిక హక్కుగా దీన్ని అమలుచేయవచ్చా? అనే అంశాలపైనే ప్రాథమికంగా చర్చ జరగనుంది. ఒకవేళ ట్రిపుల్ తలాక్ ఇస్లాంలోని మూలసూత్రమే అని నిర్థారణ అయితే అప్పుడు దీని రాజ్యాంగ బద్ధతను కోర్టు ప్రశ్నించదు. కానీ రాజ్యాంగం ప్రకారం ముస్లింల ప్రాథమిక హక్కుగా ట్రిపుల్ తలాక్‌ను భావించొచ్చా అనే అంశంపైనా చర్చ జరుగుతుంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ముస్లింలలోని బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్‌తో సంబంధం లేనందున ఈ అంశాన్ని చర్చించదలచుకోలేదని వెల్లడించింది. సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ (సిక్కు) తోపాటుగా జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రిస్టియన్), జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ (పార్శీ), జస్టిస్ యుయు లలిత్ (హిందు), జస్టిస్ అబ్దుల్ నజీర్ (ముస్లిం) (ఒక్కో మతం నుంచి ఒక్కరు చొప్పున) ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకం పిటిషనర్లలో ఒకరైన సైరా బానో తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ సింగ్ చద్దా ట్రిపుల్ తలాక్‌పై వాదనలు ప్రారంభించారు. ఈ సంప్రదాయం ఇస్లాం ప్రాథమికాంశం కాదని.. దీన్ని తొలగించవచ్చని తెలిపారు. మన పొరుగు ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అనుసరిస్తున్న విధానాలను ఆయన గుర్తుచేస్తూ.. ట్రిపుల్ తలాక్ ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. ఈ అంశంలో కోర్టుకు సహాయకారిగా ఉన్న సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అసలు ట్రిపుల్ తలాక్ వివాదమే కాదని.. భార్య, భర్తల మధ్య రాజీతోనే విడాకులకు మంజూరవుతాయన్నారు. అయితే రాజీ తర్వాత జరిగే ట్రిపుల్ తలాక్లన్నీ వ్యవస్థ ప్రకారమే జరుగుతున్నాయా అన్న ధర్మాసనం ప్రశ్నకు ఖుర్షీద్ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తరపున వాదిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కూడా ఖుర్షీద్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ‘సమానత్వం కోసం ముస్లిం మహిళలకు పోరాటం’ అంశంపైనా చర్చించనున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. తలాక్ సందర్భంగా ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని కూడా కోర్టు ప్రశ్నించింది. నిఖా హలాలా (భార్యాభర్తల మధ్య తలాక్ అయిన తర్వాత మళ్లీ ఆమెనే భర్త పెళ్లి చేసుకోవాలనుకుంటే.. అంతకుముందు భార్యకు వేరే వ్యక్తితో వివాహం జరిపి తలాక్ తీసుకోవాలి. ఇది షియా సంప్రదాయంలో మాత్రమే అమలవుతోంది) పైనా విచారణ జరపనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. రెండుగా చీలిన ఇస్లాం సమాజం సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్‌పై చర్చతో ఇస్లాంలోని సంప్రదాయవాదులు, సంస్కరణలను కోరుకునేవారి మధ్య స్పష్టమైన అంతరం కనిపించింది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాన్ని మత సమావేశాల్లోనే చర్చించుకోవాలని ఓ వర్గం.. ముస్లిం మహిళలను న్యాయవ్యవస్థ ద్వారానే న్యాయం జరుగుతుందని మరోవర్గం తమ అభిప్రాయాలను తెలిపాయి. ‘ఇస్లాం ప్రవక్తలు గొప్పవారా? కొందరు ముల్లాల చేతుల్లోని ఇస్లాం గొప్పదా? అనే అంశం తేలిపోయే సమయం ఆసన్నమైంది. చాలా ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్‌ను ఎప్పుడో పక్కనపెట్టేశాయి. షియా సంప్రదాయంలో ట్రిపుల్ తలాక్‌కు చోటు లేదు’ అని ఆలిండియా షియా పర్సనల్ లాబోర్డు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ముస్లిం మహిళలకు మంచిరోజులు ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు ఆలిండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షురాలు షియాస్తా అంబర్ తెలిపారు. అయితే కొందరు మతపెద్దలు మాత్రం ఈ అంశాన్ని తెరపైకి తేవటంలో రాజకీయ కుట్రకోణం దాగుందని విమర్శించారు. ముస్లిం సమాజం ఇలాంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు మరింత సమయం ఇవ్వాలని ఆలిండియా ముస్లిం మజ్లిసే ముషావరాత్ అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్ ‘ముస్లిం పర్సనల్ లా’లో భాగమని అయితే దీన్ని దుర్వినియోగం చేయటం పాపమని ఏఐఎంపీఎల్బీ తెలిపింది. కేవలం 0.1 శాతం మంది మాత్రమే దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించింది. అయితే ట్రిపుల్ తలాక్‌ను మత విశ్వాసం కన్నా సామాజిక రుగ్మతగా చూడాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. -
హిందూ వ్యక్తిని పెళ్లాడటం బెటర్: ముస్లిం యువతి
ఉధమ్ సింగ్ నగర్: ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఉత్తరాఖండ్ ముస్లిం యువతి ధైర్యంగా ప్రశ్నించింది. ట్రిపుల్ తలాక్ మూలంగా తన సోదరికి జరిగిన అన్యాయంపై రగిలిపోయిన యువతి.. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కచ్చా పోలీసుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాక్ చెప్పి ఏ క్షణంలో అయినా భార్యను వదిలేయడానికి అవకాశం ఉన్న వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండటంలో ఉపయోగం ఏంటని అడిగింది. ఒకవేళ వయసైపోయిన ఓ మహిళ విషయంలో ఈ అన్యాయం జరిగితే.. ఆమె పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. 'ఓ యుక్త వయసులో ఉన్న మహిళగా ట్రిపుల్ తలాక్ గురించి భయపడుతూ జీవితాంతం నేనెందుకు బతకాలి. దీనికన్నా హిందూ మతాన్ని స్వీకరించి.. మూడు పదాలను ఉచ్ఛరించడం ద్వారా నా జీవితాన్ని నాశనం చేయడానికి అవకాశం లేని హిందూ వ్యక్తిని పెళ్లాడటం బెటర్' అని అంది. దేశంలో మహిళలు, ముఖ్యంగా ముస్లిం మహిళల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న చర్యలు బాగున్నాయని హిజాబ్ ధరించిన సదరు ముస్లిం యువతి స్పష్టం చేసింది. వాట్సప్, ఫేస్‌బుక్‌లలో సైతం ట్రిపుల్ తలాక్ చెబుతున్న సంఘటనల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ పద్దతికి స్వస్తి చెప్పాలని కోరుతున్న విషయం తెలిసిందే. -
రాజ్యాంగ ధర్మాసనానికి ‘తలాక్’
న్యూఢిల్లీ: ముస్లింలు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు అప్పగించింది. మే 11వ తేదీ నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం వెల్లడించింది. ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం వంటి అంశాలు ఎంతో కీలకమైనవని, సెంటిమెంట్లతో ముడిపడినవని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. వీటిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తున్నట్టు పేర్కొంది. దీనిపై సవివరమైన విచారణ జరపడం అవసరమంది. ‘ఇప్పుడు కనుక దీనిపై నిర్ణయం చేయనట్లయితే.. సంవత్సరాలు, దశాబ్దాలకు కూడా ఇది జరగదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
‘తలాక్’ రాజ్యాంగ ధర్మాసనానికి..
-
‘తలాక్’ రాజ్యాంగ ధర్మాసనానికి..
అప్పగించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముస్లిం సంప్రదాయాలైన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. దీని కోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయనుంది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలు చాలా ముఖ్యమైనవని, ఇంకా సాగదీయకూడదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నీ రాజ్యాంగానికి సంబంధించినవని, అందువల్ల విస్తృత ధర్మాసనం అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసులను మార్చి 30న రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. కాగా, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో తీర్పు కోరుతూ నాలుగు అంశాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఉంచింది. వాటిలో ఈ అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (1), ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లకు అనుగుణంగా ఉన్నాయా? అని ప్రశ్నించింది. వీటిపై స్పందించిన కోర్టు రాజ్యాంగ అంశాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది. -
తలాక్’లో న్యాయ అంశాలనే పరిశీలిస్తాం
తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ముస్లింల ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో న్యాయ సంబంధమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ముస్లిం చట్టాల ప్రకారం విడాకులు పొందితే దానిపై కోర్టులు పర్యవేక్షణ ఉండాలనే దానిని తాము పరిశీలించబోమని, అది శాసన సంబంధమైనదని మంగళవారం తెలిపింది. పిటిషనర్లకు సంబంధించిన న్యాయవాదులు భేటీ అయి తాము పరిశీలించాల్సిన అంశాలను ఖరారు చేయాలని, ఆ అంశాలను నిర్ణయించడానికి గురువారం విచారణ జాబితాలో చేర్చుతున్నామని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అయితే ట్రిపుల్ తలాక్ బాధి తులకు సంబంధించిన సంక్షిప్త ఉదాహ రణలు సమర్పించడానికి కోర్టు అనుమతిం చింది. ముస్లిం సంప్రదాయాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. రాజ్యాం గంలోని లింగసమానత్వం హక్కుపై తొలుత చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వాలను వ్యతిరేకిస్తూ కేంద్రం వాటిని పరిశీలించాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే. -
ట్రిపుల్ తలాక్ నిషేధంపై ఎన్నికల తర్వాత కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి ఘజియాబాద్/లక్నో: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇది మత సంబంధ విషయం కాదని, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినదని శనివారం ఘజియాబాద్‌లో విలేకర్లతో అన్నారు. ‘ట్రిపుల్ తలాక్ నిషేధం కోసం ప్రభుత్వం యూపీ ఎన్నికల తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం ప్రతి మతాన్నీ గౌరవిస్తుంది. అయితే మతారాధన, సంఘ దురాచారం కలసి మనుగడ సాగించలేవు. ట్రిపుల్ తలాక్ మహిళలకు గౌరవాన్ని నిరాకరిస్తోంది. ఈ దురాచారానికి ముగింపు పలకడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని చెప్పారు. మహిళకు గౌరవం, న్యాయం, సమానత్వమనే మూడు అంశాలపై ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఈ అంశాన్ని లేవనెత్తుతుందని వివరించారు. మహిళలను బీజేపీ ఒక్కటే గౌరవిస్తోందని పేర్కొన్నారు. ఈ వివాదాస్పద అంశంపై సమాజ్‌వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు తమ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆదివారం ఆయన లక్నోలో డిమాండ్ చేశారు. -
అది ముస్లిం లా బోర్డు కాదు.. మగవారి లా బోర్డు: అక్బర్
కోల్‌కతా: ట్రిపుల్ తలాక్ విషయంలో ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) ముస్లిం లా బోర్డులా కాక మగవారి లా బోర్డులా వ్యవహరిస్తోందని విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ విమర్శించారు. శనివారం ఇక్కడ జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఇస్లాం మతం మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతోందని, దీనికి విరుద్ధంగా తలాక్ విధానం ఉందని ఆరోపించారు. భార్య అనుమతితో సంబంధం లేకుండా విడాకులు మంజూరు చేయడం అమానుషమన్నారు. -
ట్రిపుల్ తలాక్ క్రూరమైనది
ముస్లిం పర్సనల్ లా సవరణలకు అవకాశం ఉందా? ► ముస్లిం మహిళల బాధలు తగ్గించేందుకు సవరణలు అవసరం ► తీర్పును స్వాగతించిన కేంద్రం, మహిళా పర్సనల్ లా బోర్డు ► దీని వల్ల న్యాయ వ్యవస్థ అంతరాత్మ క్షోభిస్తోంది ► అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు అలహాబాద్: ముస్లిం మహిళల హక్కులను కాలరాసే ట్రిపుల్ తలాక్ క్రూరమైనదని అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ట్రిపుల్ తలాక్ వల్ల న్యాయ వ్యవస్థ అంత రాత్మ తీవ్రంగా క్షోభిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లిం మహిళల బాధలు తగ్గించేలా ముస్లిం పర్సనల్ లాలో సవరణ లకు అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. తక్షణ విడాకులైన ‘ట్రిపుల్ తలాక్’కు ప్రస్తు తం చాలా డిమాండ్ ఉందని, ఇది ఒక దేశంగా భారత్ ఉండకుండా అడ్డుకుంటోందని ఆందో ళన వ్యక్తం చేసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన పర్సనల్ లా అరుునా రాజ్యాంగం కల్పించిన హక్కులకు అతీతం కాదని వ్యాఖ్యా నించింది. ‘‘కోర్టులను ఈ అంశం ఆందోళన కు గురిచేస్తోంది. ముస్లిం మహిళలు ఈ క్రూరమైన, నిరంకుశమైన విధానంతో ఇంకెం త కాలం బాధలు పడాలి? ఇలాంటి భార్యల పట్ల వారి పర్సనల్ లా ఇంకా క్రూరంగానే ఉందా? వారి బాధలను తీర్చే విధంగా పర్సనల్ లాకు సవరణలు చేసేందుకు ఏమైనా అవకాశం ఉందా? ఈ అరాచకత్వం న్యాయ వ్యవస్థ అంతరాత్మను క్షోభకు గురిచేస్తోంది’’ అని న్యాయమూర్తి సునీత్ కుమార్ నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం గత నెలలో తీర్పు వెలువరించింది. భారత్ లోని ముస్లిం చట్టాలు.. మత ప్రవక్త, పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్పిన అంశాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, ఇదే పద్ధతి భార్యలకు విడాకులు ఇచ్చే విషయంలోనూ కొనసాగు తోందని పేర్కొంది. ఆధునిక, లౌకికవాద దేశంలో చట్టం ఉద్దేశం.. సామాజిక మార్పును తీసుకురావడమేనని తెలిపింది. భారత్‌లో ముస్లిం జనాభా పెద్ద సంఖ్యలో ఉందని, ఇం దులోని ఎక్కువ మంది ముఖ్యంగా మహిళలను పురాతన ఆచారాలు, సామాజిక కట్టుబాట్ల పేరిట పర్సనల్ లాలోని ఆంక్షలతో నియంత్రించడం తగదని చెప్పింది. ‘ఇస్లాం లో తీవ్రమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడి నప్పుడు మాత్రమే విడాకులకు అనుమతి ఉంది. సయోధ్య కుదిర్చే మార్గాలన్నీ విఫలమైనప్పుడు మాత్రమే పెళ్లిని రద్దు చేయడానికి తలాక్ లేదా ఖోలా ద్వారా విడాకులకు ముందుకు వెళ్లొచ్చు’ అని పేర్కొంది. అరుుతే ప్రస్తుతం ముస్లిం భర్తలు ఇస్లామిక్ ఆదేశాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఈ తక్షణ విడాకులకు ప్రయ త్నిస్తున్నారని చెప్పింది. తన భార్య నిజాయతీగా, విధేయురాలై ఉన్నంత వరకూ ఒక వ్యక్తి ఆమెకు విడాకులు ఇచ్చేందుకు అవకాశం లేదని ఖురాన్ చెపుతోందని నవంబర్ 5న జారీ చేసిన ఆదేశాల్లో ధర్మాసనం పేర్కొంది. ఇస్లామిక్ చట్టం పెళ్లిని రద్దు చేసేందుకు మగవారికి ప్రాథమికంగా అవకాశమిస్తోం దని, ఆమె ప్రవర్తన సరిగా లేకపోరుునా, విధేయత చూపించకపోరుునా, పెళ్లి తర్వాత జీవితం సంతృప్తికరంగా లేకపోరుునా విడాకు లు ఇవ్చొచ్చని, అరుుతే ప్రస్తుతం ఎటువంటి తీవ్ర కారణాలు లేకుండానే మగవారు విడాకులు ఇస్తున్నారని, మతపరంగానూ.. అలాగే చట్టపరంగానూ వీరు తమ విడాకులను సమర్థించుకోలేక పోతున్నారంది. యూపీకి చెందిన హినా(23), ఆమె భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం ట్రిపుల్ తలాక్‌కు మద్దతుగా నిలిచింది. హైకోర్టు తీర్పుపై అప్పీలు చేస్తామని ప్రకటించింది. స్వాగతించిన కేంద్రం, మహిళా లా బోర్డు ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం, ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు స్వాగతించింది. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. మహిళలకు న్యాయం జరగాలని, అందరూ అంగీకరి స్తారని చెప్పారు. -
ఆ తలాక్ రద్దుకు మహిళా కమిషన్ మద్దతు
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వాలను రద్దు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణ పత్రంలో కోరింది. ‘ఇవి రాజ్యాంగ విరుద్ధం. ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయి. వీటిని తొలగించాలి’ అని పేర్కొంది. గత నెలలో ఈ అంశంపై సుప్రీం కోర్టులో కేంద్రం తీసుకున్న వైఖరికి కమిషన్ మద్దతు ప్రకటించింది.