‘అధికారంలోకి వస్తే ట్రిపుల్‌ తలాక్‌ రద్దు’ | Congress Says Will Scrap Triple Talaq Law | Sakshi
Sakshi News home page

‘అధికారంలోకి వస్తే ట్రిపుల్‌ తలాక్‌ రద్దు’

Published Thu, Feb 7 2019 7:20 PM | Last Updated on Thu, Feb 7 2019 7:20 PM

Congress Says Will Scrap Triple Talaq Law - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రద్దు చేస్తామని ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్‌ సుస్మితా దేవ్‌ చెప్పారు. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్‌ మైనారిటీ విభాగం సదస్సులో మాట్లాడుతూ ముస్లిం పురుషులపై ముస్లిం మహిళలను ఈ బిల్లు ద్వారా రెచ్చగొట్టే వాతావరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించారని ఆరోపించారు.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు అమలైతే మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెబుతున్నా ముస్లిం పురుషులను జైళ్లలో మగ్గేలా, వారిని పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల ఉద్యమం సాగించిన వేలాది ముస్లిం మహిళలను ఆమె అభినందించారు. ఈ బిల్లుకు పార్లమెంట్‌లో వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తుందని, 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని తొలగిస్తుందని సుస్మితా దేవ్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement