మహిళలకు రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పాలి  | Women Congress President Sunitha Rao About Ramdev Baba | Sakshi
Sakshi News home page

మహిళలకు రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పాలి 

Nov 27 2022 12:51 AM | Updated on Nov 27 2022 10:25 AM

Women Congress President Sunitha Rao About Ramdev Baba - Sakshi

రాందేవ్‌ బాబా దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మహిళాకాంగ్రెస్‌ నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని మహిళలందరికీ రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సునీతారావు డిమాండ్‌ చేశారు. రాందేవ్‌బాబా వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం గాంధీభవన్‌ ఎదుట మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఈ ఆందోళనలో మహిళానేతలు రాందేవ్‌బాబా దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అనంతరం రాందేవ్‌బాబాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement