గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు | Heavy Police Deployed Infront Of Gandhi Bhavan In Telangana | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు

Published Wed, Aug 7 2024 11:49 AM | Last Updated on Wed, Aug 7 2024 1:22 PM

Heavy Police Deployed Infront Of Gandhi Bhavan In Telangana

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ నేతలు బుధవారం(ఆగస్టు7) ఎరుపు రంగు దుస్తులు వేసుకొని రాష్ట్ర బీజేపీ ఆఫీసు ముందు నిరసనకు బయలుదేరారు. మహిళా నేతలను గాంధీభవన్‌ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్‌ నేతలకు మధ్య తోపులాట జరిగింది.  

దేశంలో మహిళకు రక్షణ లేదని, నిత్యావసర వస్తువుల పెరుగుదల వల్ల మహిళలపై పడుతున్న భారంపై దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఆఫీసులు ముట్టడించాలని జాతీయ మహిళా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement