సాక్షి,హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని ,గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో మహిళా కాంగ్రెస్ నేతలు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత తదితరులున్నారు. ఫిర్యాదు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డితో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆరే ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే.
అంతకుముందు కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పట్ల మహిళా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆందోళన చేశారు.
ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment