
ప్రత
సాక్షి, విజయవాడ: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ అయిన సందర్భంగా విజయవాడ బీజేపీ నగర కార్యాలయం వద్ద బీజేపీ మహిళా, మైనారిటీ మోర్చా నాయకులు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా షేక్ బాజీ జాతీయ మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి పీసీ మాట్లాడుతూ.. దేశంలోని మైనార్టీ మహిళలకు మోదీ పెద్దన్నగా నిలిచి, తలాక్ బిల్ పాస్ కావటంతో 16 వందల సంవత్సరాల బానిస సంకెళ్లను తెంచారన్నారు. పరదా చాటున ఉన్న మహిళల ఆత్మ గౌరవాన్ని మోదీ కాపాడారని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం ముస్లిం మైనారిటీ మహిళలు సంబరాలు జరుపుకుంటున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు బిల్లును అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment