
అది ముస్లిం లా బోర్డు కాదు.. మగవారి లా బోర్డు: అక్బర్
కోల్‌కతా: ట్రిపుల్ తలాక్ విషయంలో ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) ముస్లిం లా బోర్డులా కాక మగవారి లా బోర్డులా వ్యవహరిస్తోందని విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజే అక్బర్ విమర్శించారు. శనివారం ఇక్కడ జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ఇస్లాం మతం మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతోందని, దీనికి విరుద్ధంగా తలాక్ విధానం ఉందని ఆరోపించారు. భార్య అనుమతితో సంబంధం లేకుండా విడాకులు మంజూరు చేయడం అమానుషమన్నారు.