అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే కొన్ని పనులు చేయలేకపోతుంటారు. అనేక విషయాల్లో చాలా బద్దకంగా వ్యవహరిస్తుంటారు. కానీ అంగ వైకల్యం కలిగిన ఓ చిన్నారి ఔరా అనిపించింది. ఆమె సంకల్పించిన బలం ముందు తన వైకల్యం చిన్నబోయింది. పట్టుదల, కృషితో దేన్నైనా సాధించగలనని నిరూపించింది. ప్రొస్తెటిక్ కాలు కలిగిన (కృత్రిమ కాలు) అంటోనెల్లా అనే ఐదేళ్ల చిన్నారి చిన్న లోయలా ఉండే ఓ గుంతలో పడిపోయింది. అక్కడి నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మళ్లీ జారీ కిందకే పడిపోతుంది. అసలు తను మీదకు వెళ్లగలుగుతుందో తెలియదు కానీ.. తన తల్లి ప్రొత్సాహపరుస్తుంటే కచ్చితంగా ఎక్కగలను అనే నమ్మకాన్ని కూడగట్టుకుంది.
నువ్వు చేయగలవు.. కింద పడవు. నీవు బలవంతురాలివి అంటూ తల్లి ఎంజరేజ్ చేస్తుండటంతో ఒంటి కాలితో మెల్లమెల్లగా పైకి ఎక్కింది. పైకి వెళ్లిన తరువాత వెనక్కి తిరిగి తల్లిని చూస్తూ చిరునవ్వు విసిరింది. దీనికి సంబంధించిన వీడియోను గుడ్ న్యూస్ కరస్పాండెంట్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. చిన్నారి లోయనుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. అనేకమంది లైకులు, రీట్వీట్‌లతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ‘అంటోనెల్లా తన తల్లిని ఎప్పటికి గుర్తుంటుచుంటుంది. తను పెద్దయ్యాక ఒక పోరాట యోధురాలిగా ఎదుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు’. అని కామెంట్ చేస్తున్నారు.
చదవండి:
వెరైటీగా వంతెన మీద వివాహం.. కారణం ఇదేనా
‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు
Antonella wasn’t sure she could do it, but with her encouraging mom cheering her on— she did it! 🙌🏼🥰🇧🇷
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 26, 2021
(📽antonella.funghetto)👏🏼👏🏼👏🏼 Você é uma campeã 💓 pic.twitter.com/wT04GvfOUh
Comments
Please login to add a commentAdd a comment