prosthetic leg
-
సీఎం జగన్ ఆదేశం.. దివ్యాంగుడికి ఆధునిక కృత్రిమ కాలు
అనంతపురం అర్బన్: సీఎం వైఎస్ జగన్ చొరవతో ఓ దివ్యాంగుడికి అతి ఖరీదైన కృత్రిమ కాలు అందింది. అనంతపురానికి చెందిన సయ్యద్ ఖాజా రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. గత నెల 8న సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటనకు రాగా, హెలిప్యాడ్ వద్ద సీఎంను కలిసి తన కష్టాన్ని చెప్పుకొన్నాడు. స్పందించిన సీఎం బాధితుడికి సాయం చేయాలని అనంతపురం కలెక్టర్ గౌతమిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గౌతమి ఖాజాకు కృత్రిమ కాలు అందించాలనుకున్నారు. అయితే మామూలు కాలిపర్స్ కాకుండా నాణ్యమైన, సౌకర్యవంతంగా ఉండేలా కృత్రిమ కాలును సిద్ధం చేయించి సోమవారం బాధితుడికి అందించారు. చదవండి: సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం -
తోడుంటే నడుస్తారు
ఆగినప్పుడు అడుగు ముందుకు పడటానికి తోడు కావాలి. నడిపించే సాయం కావాలి. లోకం మనల్ని కూడా నడిపిస్తుందన్న నమ్మకం కలిగించాలి. అహ్మదాబాద్‌కు చెందిన శ్రద్ధా సోపార్కర్ నడవలేని వారికి తోడు నిలుస్తుంది. వారికి ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చి జీవితాల్లో మళ్లీ కదలిక తెస్తోంది. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న సొంత కూతురిని చూశాక సాటి వారి బాధ ఆమెకు అర్థమైంది. ఆమె స్పందన ఇవాళ ఎందరికో వెలుగు. శ్రద్ధా సోపార్కర్ లా చదివింది. కాని ఎప్పుడూ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆమెకు హైజీన్ ప్రాడక్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. భర్త కూడా వ్యాపారస్తుడు. మొదట కొడుకు పుట్టాడు. అంతా హ్యాపీగా ఉండగా 2016లో కుమార్తె పుట్టినప్పుడు కుదుపు వచ్చింది. ‘నా కుమార్తెకు సెరిబ్రల్ పాల్సీ అని డాక్టర్లు చెప్పారు. నా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఆ డిజార్డర్ ఉన్న పిల్లలకు వెంటనే నయం కాదు. జీవితంలో వారు పూర్తిగా నార్మల్ కాలేరు. వారికి కావలసిన థెరపీలు, సర్జరీలు చేయించాలంటే చాలా ఖర్చు కూడా. డబ్బుకు నాకు ఇబ్బంది లేదు కాబట్టి నా కుమార్తెకు కావలసిన థెరపీలు మొదలుపెట్టాను. కాని నా కుమార్తె వల్లే నాకు చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది’ అంటుంది శ్రద్ధ. ► మలుపు తిప్పిన ఘటన ‘2018లో అహ్మదాబాద్‌లోని ఒక థెరపీ సెంటర్‌కు పాపను తీసుకుని వెళ్లాను. సెరిబ్రల్ పాల్సీతో బాధ పడుతున్న నాలాంటి పిల్లల తల్లులు కూడా చాలామంది వచ్చారు. అందరం భోజనానికి కూచున్నప్పుడు ఒకామె ఉత్త మజ్జిగ తాగుతూ కనిపించింది. ఎందుకు బాక్స్ తెచ్చుకోలేదు అని అడిగాను. ‘‘నేను ఇళ్లల్లో పని చేస్తాను. మా ఆయన ఆటో నడుపుతాడు. మా సంపాదన కొడుకు థెరపీలకు చాలడం లేదు. అందుకే అన్నం కూడా వండుకోలేకపోతున్నాం’’ అంది. నాకు మనసు చేదుగా అయిపోయింది. ఆమెకు కావాల్సిన సాయం చేయడం మొదలుపెట్టాను. అలాంటి తల్లులు మరికొంత మంది వచ్చారు. వారికీ చేయడం మొదలుపెట్టాను. సాయం పొందుతున్న వారు 10 మంది అయ్యేసరికి నా భర్త ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవ చేయి అన్నాడు. అలా మధురం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నా సేవను మొదలు పెట్టాను’ అంది శ్రద్ధ. ► చిన్నారులకు సేవ మెదడు సంబంధమైన రుగ్మతల వల్ల కదలికలు పరిమితమైన చిన్నారులకు, టీకాలు సరిగా వాడకపోవడం వల్ల అనారోగ్యం పాలైన చిన్నారులకు కావలసిన థెరపీలు, మందులు, వైద్య సహాయం ఇవన్నీ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది శ్రద్ధ. ఆమె తన సొంత డబ్బుల నుంచి ఇవన్నీ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమెకు మెల్లగా సాయం అందసాగింది. ‘పేదవర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలకు సెరిబ్రల్ పాల్సీ వస్తే నిస్సహాయంగా వదిలేస్తారు. అది పిల్లల స్థితిని మరింత దిగజారుస్తుంది. వారికి ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా సాయం అందడం లేదు. మనలాంటి వాళ్లం స్పందించకపోతే ఎలా?’ అంటుంది శ్రద్ధ. ► ప్రోస్థెటిక్ కాళ్లు ఈ థెరపీలతో పాటు ప్రమాదవశాత్తు లేదా జన్మతః కాళ్లు కోల్పోయిన పిల్లలకు, పెద్దలకు ప్రోస్థెటిక్ కాళ్లు అమర్చాలని నిశ్చయించుకుంది శ్రద్ధ. అయితే ఇవి నాసిరకంవి కాదు. ఓట్టోబాక్ అనే జర్మన్ కంపెనీ సాయంతో నాణ్యంగా తయారైన కృత్రిమ కాళ్లు. ‘‘ఇప్పటికి 100 మందికి కృత్రిమ కాళ్లు ఇచ్చాం. నడవడం మానేసిన ఆ దురదృష్టవంతులు మేము అమర్చిన ప్రోస్థెటిక్ కాళ్లతో నడిచినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ కాళ్లు అమర్చాక వాహనాలు నడపొచ్చు. సైకిల్ కూడా తొక్కొచ్చు. స్నానం చేయడంలో కూడా ఇబ్బంది లేదు’’ అంది శ్రద్ధ. ఈమె ద్వారా కాళ్లు అమర్చుకున్న చిన్నారులు ఆటలు ఆడుతూ గెంతుతూ సంతోషంగా ఉండటం కూడా చూడొచ్చు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది. కాని స్పందించే గుణమే కావాలి. సేవకు అడుగు ముందుకేస్తే నాలుగు చేతులు తోడవుతాయి. నాలుగు కాళ్లు నడుస్తాయి. తాము నడుస్తూ నలుగురినీ నడిపించేవారే గొప్పవారు. -
సుధా చంద్రన్ ఆవేదన.. క్షమాపణలు తెలిపిన సీఐఎస్ఎఫ్
సుధా చంద్రన్.. ఈ పేరు అందరికి సుపరిచితమే. ప్రముఖ నాట్యకారణి అయిన సుధా చంద్రన్ ఓ ప్రమాదంలో తన కాలును కోల్పోగా కృత్రియ కాలును అమర్చుకున్నారు. కృత్రిమ కాలుతో కూడా తన నాట్యాన్ని కొనసాగిస్తూ ఎందరికో స్పూర్తిగా నిలిచారు. అయితే ఇటీవల సుధ చంద్రన్‌కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్ అధికారులు ప్రతిసారి తన కృత్రిమ కాలును తొలగించమని అడుగుతునట్లు సుధా చంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’ తాజాగా సుధాచంద్రన్ పట్ల ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రవర్తించి తీరుకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) స్పందించింది. ఈ మేరకు ట్విటర్లో సుధాచంద్రన్‌కు క్షమాపణలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రోటోకాల్ ప్రకారం విమనాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించే సమయంలో కొన్ని అసాధారణ పరిస్థితులలో మాత్రమే కృత్రిమ అవయవాలు కూడా తొలగించి పరిశీలించడం తమ సిబ్బంది విధి అని స్పష్టం చేసింది. అయితే సుధాచంద్రన్ పట్ల తమ మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరును పరిశీలిస్తామని, విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా తమ సిబ్బందికి సూచనలు జారీ చేస్తామని వెల్లడించింది. చదవండి: వైరల్: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి.. CISF apologises to actor Sudhaa Chandran after she shared a video on being stopped at airport for prosthetic limb. "We'll examine why the lady personnel concerned requested Sudhaa Chandran to remove prosthetics & assure that no inconvenience is caused to travelling passengers." pic.twitter.com/oaVThYB0Lv — ANI (@ANI) October 22, 2021 ఇదిలా ఉండగా.. సుధా చంద్రన్ ఎయిర్‌పోర్టులో తనకు జరిగిన అనుభవాన్ని వివరిస్తూ ప్రధాని మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేసింది. నేను ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిన ప్రతిసారి సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిమిత్తం కృత్రిమ కాలు తొలగించమంటన్నారు. దీని వల్ల చాలా బాధపడుతున్నానను. నన్ను సెక్యూరిటీ సిబ్బంది ఈటీడీ(పేలుడు ట్రేస్ డిటెక్టర్) తనిఖీ నిమిత్తం ప్రతిసారి నా కృత్రిమ అవయం తొలగించమంటున్నారు ఇది మానవీయంగా సాధ్యమేనా మోదీ జీ. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా. ఈ సందేశం రాష్ట్ర, కేంద్ర ప్రభత్వాధికారులకు చేరుతుందని ఆశించడమే కాదు సత్వరమే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ ఆవేదనగా అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. -
కృత్రిమ కాలుతో కనకం వైపు...
‘ఫాంటమ్ లింబ్ పెయిన్’... కృత్రిమ కాలు అమర్చుకున్న వారిలో దాదాపు అందరికీ వచ్చే సమస్య. తీవ్రమైన నొప్పితో అల్లాడిపోయే పరిస్థితి... కొన్నిసార్లు వేడి వల్ల లోపలి భాగం (లైనర్) నుంచి రక్తం కూడా కారుతుంటే ఆ బాధ తట్టుకోవడం కష్టం! సాధన సమయంలో సుమిత్ అంటిల్ కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొన్నాడు. కానీ తాను పారాలింపిక్స్‌లో పాల్గొనాలనే, పతకం సాధించాలనే లక్ష్యం నుంచి మాత్రం అతను తప్పుకోలేదు. ‘ప్రొస్థెటిక్ లెగ్’తోనే జావెలిన్‌లో ప్రపంచాన్ని గెలిచేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం అతను తన కలను నిజం చేసుకున్నాడు. టోక్యోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. 2015 జనవరి 5 వరకు సుమిత్ జీవితం చాలా మందిలాగే సరదాగా సాగింది. హరియాణాలో గల్లీ గల్లీలో కనిపించే చాలా మందిలాగే రెజ్లింగ్ వైపు వెళ్లాడు. నాలుగైదేళ్లు పెద్దగా ఫలితాలు లేకపోయినా కుటుంబ సభ్యులు, సన్నిహితులు అతను ‘పహిల్వాన్’ కావాలనే కోరుకోవడంతో ఆటను కొనసాగిస్తూ వచ్చాడు. అయితే 17 ఏళ్ల వయసులో ట్యూషన్ నుంచి తిరిగొస్తూ జరిగిన ఒక ప్రమాదం సుమిత్ జీవితాన్ని మార్చేసింది. మోటార్ బైక్‌పై వెళుతుండగా జరిగిన యాక్సిడెంట్‌తో అతను తన ఎడమ కాలును కోల్పోయాడు. మోకాలి కింది భాగం మొత్తం తొలగించాల్సి రాగా... 53 రోజుల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. కృత్రిమ కాలు బిగించడంతో ఇక లోకమంతా విషాదంగా, ఏదో కోల్పోయినట్లుగా కనిపించింది. దాంతో ఇంటికే పరిమితమైన అతను పాత జ్ఞాపకాలతో రెండేళ్ల తర్వాత మళ్లీ స్టేడియం వైపు మరలాడు. అదే సుమిత్ జీవితాన్ని మార్చింది. సోనెపట్ సమీపం లోని తన సొంత ఊరు ఖేవ్డాకు చెందిన ఒక పారాథ్లెట్ అతనికి పరిచయమయ్యాడు. అంతే... పారా క్రీడల గురించి మొత్తం తెలుసుకున్న అతను మళ్లీ ఆటల్లో కొత్త జీవితం వెతుక్కునేందుకు సిద్ధమయ్యాడు. అథ్లెటిక్స్‌లో, అందులోనూ జావెలిన్ త్రోలో సత్తా చాటగలనని నమ్మకంతో సాధన మొదలుపెట్టిన సుమిత్ ఒక్కసారిగా దూసుకుపోయాడు. 2019లో వరల్డ్ పారా అథ్లెటిక్స్, వరల్డ్ గ్రాండ్‌ప్రి, పారిస్ ఓపెన్లలో అతను మూడు రజతాలు సాధించి సత్తా చాటాడు. వరల్డ్ నంబర్‌వన్‌గా, వరల్డ్ రికార్డు సృష్టించిన ఘనతతో టోక్యో బరిలోకి దిగిన సుమిత్ రాణించి విశ్వ క్రీడల్లో భారత జాతీయ గీతాన్ని సగర్వంగా వినిపించగలిగాడు. -
కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో; ఒంటి కాలితో..
అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే కొన్ని పనులు చేయలేకపోతుంటారు. అనేక విషయాల్లో చాలా బద్దకంగా వ్యవహరిస్తుంటారు. కానీ అంగ వైకల్యం కలిగిన ఓ చిన్నారి ఔరా అనిపించింది. ఆమె సంకల్పించిన బలం ముందు తన వైకల్యం చిన్నబోయింది. పట్టుదల, కృషితో దేన్నైనా సాధించగలనని నిరూపించింది. ప్రొస్తెటిక్ కాలు కలిగిన (కృత్రిమ కాలు) అంటోనెల్లా అనే ఐదేళ్ల చిన్నారి చిన్న లోయలా ఉండే ఓ గుంతలో పడిపోయింది. అక్కడి నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మళ్లీ జారీ కిందకే పడిపోతుంది. అసలు తను మీదకు వెళ్లగలుగుతుందో తెలియదు కానీ.. తన తల్లి ప్రొత్సాహపరుస్తుంటే కచ్చితంగా ఎక్కగలను అనే నమ్మకాన్ని కూడగట్టుకుంది. నువ్వు చేయగలవు.. కింద పడవు. నీవు బలవంతురాలివి అంటూ తల్లి ఎంజరేజ్ చేస్తుండటంతో ఒంటి కాలితో మెల్లమెల్లగా పైకి ఎక్కింది. పైకి వెళ్లిన తరువాత వెనక్కి తిరిగి తల్లిని చూస్తూ చిరునవ్వు విసిరింది. దీనికి సంబంధించిన వీడియోను గుడ్ న్యూస్ కరస్పాండెంట్ ట్విటర్లో పోస్ట్ చేశారు. చిన్నారి లోయనుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. అనేకమంది లైకులు, రీట్వీట్లతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ‘అంటోనెల్లా తన తల్లిని ఎప్పటికి గుర్తుంటుచుంటుంది. తను పెద్దయ్యాక ఒక పోరాట యోధురాలిగా ఎదుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు’. అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: వెరైటీగా వంతెన మీద వివాహం.. కారణం ఇదేనా ‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు Antonella wasn’t sure she could do it, but with her encouraging mom cheering her on— she did it! 🙌🏼🥰🇧🇷 (📽antonella.funghetto)👏🏼👏🏼👏🏼 Você é uma campeã 💓 pic.twitter.com/wT04GvfOUh — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 26, 2021 -
‘నీ కష్టాన్ని, సంతోషాన్ని దేనితో పోల్చలేం’
కాబూల్ : రోజువారి జీవితంలో మనలో చాలా మంది.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతుంటారు. ఆత్మహత్య లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంటారు. నిజమైన కష్టాలను చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొంటున్న వారిని చూసినప్పుడు.. మనకు అర్థం అవుతుంది. అసలు కష్టం అంటే ఎలా ఉంటుందో. వారి ధైర్యం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ కోవకు చెందినవాడే అఫ్గనిస్తాన్‌కు చెందిన అహ్మద్ సయ్యద్ రహ్మాన్ అనే ఈ చిన్నారి. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవ్వడమే కాక ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఎందుకో మీరు తెలుసుకొండి. అఫ్గనిస్తాన్.. తాలిబన్లకు, సాయుధబలగాలకు మధ్య నలిగిపోతున్న దేశం. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతుందో తెలీక ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుంటారు. నిత్యం ఏదో చోట మారణహోమం జరుగుతూనే ఉంటుంది. ఎందరినో బలి తీసుకుంటుంది. ఎనిమిది నెలల పసివాడుగా ఉన్నప్పుడు అహ్మద్‌పై ఈ పైశాచిక దాడి పంజా విసిరింది. అహ్మద్ గ్రామంలో తాలిబన్లకు, సాయుధ బలగాలకు మధ్య జరిగిన దాడిలో ఆ చిన్నారి కాలుకు బుల్లెట్ గాయం చేసింది. దాంతో అతడి కుడి కాలును పూర్తిగా తొలగించారు వైద్యులు. అప్పటి నుంచి అహ్మద్ కృత్రిమ కాలు మీదనే ఆధారపడుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అహ్మద్‌కు మరోసారి కృత్రిమ కాలు అమర్చారు. దాని తర్వాత ఆ చిన్నారి సంతోషం చూడాలి. తనకు కృత్రిమ కాలు అమర్చగానే.. ఆనందంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు అహ్మద్. రోయా ముసావి అనే ట్విటర్ యూజర్ అహ్మద్ డ్యాన్స్ చేస్తోన్న వీడియోని షేర్ చేశారు. ‘కృత్రిమ కాలు అమర్చగానే తన సంతోషాన్ని ఇలా డ్యాన్స్ ద్వారా తెలియజేశాడు. చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదం ఇతని జీవితాన్ని మార్చడమే కాక ఎల్లప్పుడు నవ్వుతూ ఉండటం ఎలానో నేర్పించిందం’టూ ట్వీట్ చేశారు. Ahmad received artificial limb in @ICRC_af Orthopedic center, he shows his emotion with dance after getting limbs. He come from Logar and lost his leg in a landmine. This is how his life changed and made him smile. pic.twitter.com/Sg7jJbUD2V — Roya Musawi (@roya_musawi) May 6, 2019 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడమే కాక నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంది. ‘అతని కళ్లలో నిజమైన సంతోషం కనిపిస్తుంది’.. ‘దైనందిన జీవితంలో పడి నిజమైన సమస్యలతో బాధపడే మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం. ఇతని సంతోషాన్ని, బాధను దేనితో కూడా పోల్చలేం. నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కోడికి త్రీడీ కాలు
వాషింగ్టన్: పుట్టుకతోనే ఓ కాలు దెబ్బతిన్న కోడిపిల్లకు దాని యజ మానురాలు కొత్తకాలు పెట్టిస్తోంది. అది కూడా అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత సహాయంతో రూపొం దించిన కాలు. ఇందుకోసం ఏకంగా 2500 డాలర్ల(సుమారు రూ.1,60,000)ఖర్చుతో శస్త్రచికిత్స చేయిస్తోంది. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఆండ్రీ మార్టిన్ కోడిపిల్లల పునరావాస కేంద్రాన్ని నడుపుతోంది. అందులో సిసెలీ అనే మూడు నెలల కోడిపిల్ల పుట్టుకతోనే కుడికాలు కోల్పోయింది. దీంతో ఆండ్రీ సిసెలీకి శస్త్రచికిత్స చేయించాలని నిశ్చయించుకుంది. అన్ని కోడిపిల్లల్లాగే సిసెలీ కూడా ఉండాలంటే దానికి త్రీడీ కాలును అమర్చాలని వైద్యులు సూచించారు. ఇందుకు 2500 డాలర్లు ఖర్చవుతుందన్నారు. ఆండ్రీ మాత్రం ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఆ కోడిపిల్లకు శస్త్రచికిత్స చేయిస్తోంది. బుధవారం టుఫ్స్ యూనివర్సిటీ కమింగ్స్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్‌లో సిసెలీకి శస్త్రచికిత్స చేసి కొత్త త్రీడీ కాలు అమర్చనున్నారు. ఆండీ.. ఇలా కోడిపిల్లకు శస్త్రచికిత్స చేయించటం కొత్తేం కాదు. గతంలోనూ తన వద్ద ఉన్న ఓ కోడికి 3వేల డాలర్లు ఖర్చుపెట్టి హిస్టరెక్టామీ ఆపరేషన్ చేయించింది.