
సయ్యద్ ఖాజాకు కృత్రిమ కాలు అందిస్తున్న కలెక్టర్
అనంతపురం అర్బన్: సీఎం వైఎస్ జగన్ చొరవతో ఓ దివ్యాంగుడికి అతి ఖరీదైన కృత్రిమ కాలు అందింది. అనంతపురానికి చెందిన సయ్యద్ ఖాజా రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. గత నెల 8న సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటనకు రాగా, హెలిప్యాడ్ వద్ద సీఎంను కలిసి తన కష్టాన్ని చెప్పుకొన్నాడు.
స్పందించిన సీఎం బాధితుడికి సాయం చేయాలని అనంతపురం కలెక్టర్ గౌతమిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గౌతమి ఖాజాకు కృత్రిమ కాలు అందించాలనుకున్నారు. అయితే మామూలు కాలిపర్స్ కాకుండా నాణ్యమైన, సౌకర్యవంతంగా ఉండేలా కృత్రిమ కాలును సిద్ధం చేయించి సోమవారం బాధితుడికి అందించారు.
చదవండి: సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం
Comments
Please login to add a commentAdd a comment