Disabled Persons
-
దివ్యాంగుల కోసం ఆర్బీఐ..
దివ్యాంగులకు (పీడబ్ల్యుడీ) డిజిటల్ చెల్లింపు విధాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులు అన్ని వర్గాలలో బాగా ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ పేమెంట్ ప్రొవైడర్లు.. చెల్లింపులను సమీక్షించి, సవరించాలని ఆర్బీఐ ఆదేశించింది.పీడబ్ల్యుడీల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిస్టమ్‌లు, పరికరాలు.. పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్ల వంటి చెల్లింపు మౌలిక సదుపాయాలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇవన్నీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన యాక్సెసిబిలిటీ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.చెల్లింపు వ్యవస్థలకు అవసరమైన మార్పులను చేపడుతున్నప్పుడు, భద్రతా అంశాలలో రాజీ పడకుండా చూసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. అంతే కాకుండా.. ఆర్బీఐ ఈ సర్క్యులర్‌ను జారీ చేసిన ఒక నెలలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని పీఎస్పీలను ఆదేశించింది. నివేదికలో ఈ మార్పులను అమలు చేయడానికి సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను కూడా చేర్చాలి. -
Smita Sabharwal: ‘ఏఐఎస్‌కు దివ్యాంగులెందుకు?’
సాక్షి, హైదరాబాద్: ‘వైకల్యం కలిగిన పైలట్‌ను ఏదైనా విమానయాన సంస్థ ఉద్యోగంలో తీసుకుంటుందా? వైకల్యం కలిగిన శస్త్రచికిత్స నిపుణుడిపై మీరు నమ్మకం ఉంచుతారా? మరీ అత్యంత ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సేవల (ఏఐఎస్) (ఐఏఎస్/ఐపీఎస్/ఐఎఫ్ఎస్ తదితర) ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?’అని సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ‘ఎక్స్’వేదికగా ఆదివారం ప్రశ్నించారు. ఉద్యోగ స్వభావ రీత్యా అఖిలభారత సేవల అధికారులు క్షేత్రస్థాయిలో గంటల తరబడి పనిచేయాల్సి ఉంటుందని, ప్రజల విన్నపాలను నేరుగా వింటూ పనిచేయాల్సి ఉంటుందని, దీనికి శారీరక ఆరోగ్యం అవసరమని స్పష్టం చేశారు. స్మితా వ్యాఖ్యలు సరికాదు.. వైకల్యాలు శక్తిసామర్థ్యాలు, మేధోశక్తిపై ప్రభావం చూపవని సీనియ ర్ సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ, బ్యూరోక్రాట్లు తమ సంకుచిత స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతు ర్వేది విమర్శించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదని ఆమె వారికి క్షమాపణ చెప్పాలని, వికలాంగుల కమిషన్ ఆమెపై కేసు నమోదు చేయాలని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ కనీ్వనర్ నారా నాగేశ్వరరావు ఆదివారం ప్రకటనలో వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. -
నరకం చూపి ‘నారా’ నాడు
చోడవరం: గత తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులనూ వదల్లేదు. నరకం చూపించింది. జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు మానవత్వాన్నే మరిచి అంగవైకలురుపైనా కక్షసాధింపు చర్యలకు దిగారు. పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైన వారిపైనా కర్కశం ప్రదర్శించారు. ఎన్నిసార్లు వేడుకున్నా.. పింఛన్లు మంజూరు చేయలేదు. అప్పటికే ఉన్నవీ భారీ స్థాయిలో తొలగించారు. ఫలితంగా బాధితులు అష్టకష్టాలు పడ్డారు. పింఛన్ల మంజూరు, పునరుద్ధరణ కోసం శరీరం సహకరించకున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధుల చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా నాటి ప్రభుత్వ పెద్దల మనసు కరగలేదు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆత్మహత్యయత్నాలు చేసి తమ హక్కును సాధించుకున్నారు. ఇప్పటికీ నాటి ప్రభుత్వ అకృత్యాలను గుర్తుచేసుకుని దివ్యాంగులు మదనపడుతున్నారు. ఇక జన్మలో చంద్రబాబును నమ్మబోమని కరాఖండీగా చెబుతున్నారు. అప్పట్లో నరకం చవిచూసిన అంగవైకలుర మనో‘గతాన్ని’ ఆవిష్కరించే యత్నమిది.. అంధుడిపైనా కర్కశం: అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, ఖండిపల్లికి చెందిన సియాద్రి దుర్గాప్రసాద్ పుట్టుకతోనే అంధుడు. చోడవరం దివ్యాంగుల స్కూల్లో 10వ తరగతి చదివాడు. ఆరోగ్యం బాగోలేక మధ్యలో చదువు ఆపేశాడు. మళ్లీ ఈ ఏడాది గుంటూరు సమర్ధన ట్రస్టులో చేరి ఇంటర్మిడియెట్ చదువుతున్నాడు. 2014 ముందు వరకు ఇతనికి దివ్యాంగ పింఛన్ వచ్చేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీ సభ్యులు ఇతని కుటుంబంపై ఉన్న రాజకీయ కక్షతో పింఛన్ తొలగించారు. ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో 2017లో లోక్‌అదాలత్‌ను ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో అధికారులు పింఛన్ పునరుద్ధరించారు. నేడు వేకువజామునే ఇంటికి.. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతినెలా 1వ తేదీన వేకువజామునే లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి మరీ వలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారు. ఫలితంగా దివ్యాంగులు, అవ్వాతాతల మోములు ‘సిరి’నవ్వులు చిందిస్తున్నాయి. కాళ్లు లేకున్నా.. కరుణించలేదు నేను లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడిని. 2015లో రాజమండ్రి దగ్గర విద్యుత్ తీగలు లారీకి తగిలి ప్రమాదం జరిగింది. నేను చాలా వరకూ కాలిపోయాను. వైద్యులు నా రెండు కాళ్లూ తొలగించారు. కదల్లేని పరిస్థితి తలెత్తింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా జన్మభూమి కమిటీ సభ్యులు కరుణించలేదు. చివరకు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ అప్పటి కలెక్టర్ పింఛన్ మంజూరు చేయలేదు. ఆ తర్వాత కూడా సక్రమంగా పెన్షన్ నగదు ఇచ్చేవారు కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వలంటీర్ వచ్చి నగదు ఇస్తున్నాడు. – వియ్యపు సోమునాయుడు, దివ్యాంగ పింఛన్‌దారు, పెదపాడు, బుచ్చెయ్యపేట మండలం ఆత్మహత్యాయత్నం చేస్తేకానీ ఇవ్వలేదు నేను లారీలో పనిచేసేవాడిని. 2014లో అనకాపల్లి దగ్గర అడితీలో కర్రలు లోడ్ చేస్తుండగా అవి నాపై పడ్డాయి. కాలు, చెయ్యి పూర్తిగా విరిగిపోయాయి. వాటిని వైద్యులు శరీరం నుంచి తొలగించారు. అప్పట్లో దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేశా. జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడ్డారు. 2017లో బుచ్చెయ్యపేట మండల ఆఫీసు దగ్గర ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తేగానీ పింఛన్ రాలేదు. అయినా సక్రమంగా ఇచ్చేవారు కాదు. – ఐతిరెడ్డి గోవింద, వికలాంగ పింఛన్‌దారు, ఐతంపూడి, బుచ్చెయ్యపేట మండలం -
APPSC: ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ను ఏపీపీఎస్సీ ఈ ఏడాది రానున్న నోటిఫికేషన్ల నుంచి అమలు చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ తెలిపారు. గతంలో దివ్యాంగులకు 3 శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. -
బాబు కాదన్నారు.. జగనన్న జాలి చూపారు
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: వేలి ముద్రలు పడటం లేదనే సాకుతో గత ప్రభుత్వ హయాంలో నిలిపి వేసిన పింఛను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వచ్చి అందిస్తున్నారని దివ్యాంగుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక పంచాయతీ గణపతి నగర్‌కు చెందిన వీరిశెట్టి ఫణిబాబు, లక్ష్మీప్రసన్నలకు 15 ఏళ్ల కుమారుడు లక్ష్మణ్ ఉన్నాడు. దివ్యాంగుడైన లక్ష్మణ్‌కు వేలి ముద్రలు పడటం లేదనే సాకుతో మంజూరైన పింఛను కూడా గత ప్రభుత్వ హయాంలో రద్దు చేశారు. తిరిగి కరోనా సమయం 2020 సంవత్సరంలో పింఛను కోసం దరఖాస్తు చేయగా జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిందని అప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలనెలా ఇంటికే వచ్చి తమ బిడ్డకు వికలాంగుల పింఛను అందిస్తున్నారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక సచివాలయం పరిధిలోని వలంటీర్ ప్రతాప్ లబ్ధిదారు లక్ష్మణ్‌కు పింఛను నగదు అందిస్తున్న సందర్భం ఇది. -
సీఎం జగన్ ఆదేశం.. దివ్యాంగుడికి ఆధునిక కృత్రిమ కాలు
అనంతపురం అర్బన్: సీఎం వైఎస్ జగన్ చొరవతో ఓ దివ్యాంగుడికి అతి ఖరీదైన కృత్రిమ కాలు అందింది. అనంతపురానికి చెందిన సయ్యద్ ఖాజా రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. గత నెల 8న సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటనకు రాగా, హెలిప్యాడ్ వద్ద సీఎంను కలిసి తన కష్టాన్ని చెప్పుకొన్నాడు. స్పందించిన సీఎం బాధితుడికి సాయం చేయాలని అనంతపురం కలెక్టర్ గౌతమిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గౌతమి ఖాజాకు కృత్రిమ కాలు అందించాలనుకున్నారు. అయితే మామూలు కాలిపర్స్ కాకుండా నాణ్యమైన, సౌకర్యవంతంగా ఉండేలా కృత్రిమ కాలును సిద్ధం చేయించి సోమవారం బాధితుడికి అందించారు. చదవండి: సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం -
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఆధార్ నమోదు
సాక్షి, అమరావతి: వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులకు తమ ఇంటి వద్దే ఆధార్ నమోదు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. ఈ విధానాన్ని బుధవారం నుంచే ఆందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు, ఇతర అవసరాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులు తమ సమాచారాన్ని ఈ–మెయిల్ ద్వారా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రీజనల్, రాష్ట్ర కార్యాలయాలకు అందిస్తే ఏడు పనిదినాల్లో వారి ఇంటికే వెళ్లి ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇంటికే వెళ్లి ఆధార్ నమోదు చేసినందుకు అదనపు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తారు. ఒక అడ్రెస్ ఉన్న ఇంటిలో మొదటి వ్యక్తికి రూ.700, ఆ తర్వాత ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి రూ.350 చొప్పున జీఎస్టీతో కలిపి సేవా రుసుం వసూలు చేస్తారు. యూఐడీఏఐ ప్రాంతీయ, రాష్ట్ర కార్యాలయాలను https://www.uidai.gov.in/en/ contact&support/regional&offices. html అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించాలని సూచించింది. -
టిఫిన్ డబ్బులు అడిగినందుకు దాడి
కొత్తగూడెం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఓ కానిస్టేబుల్, సీఐ దాష్టీకానికి పాల్పడ్డారు. దివ్యాంగుడనే కనికరం కూడా చూపకుండా ఓ యువకుడితోపాటు మరో వ్యక్తిని చితకబాదారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం సూపర్‌బజార్ సెంటర్లోని ఓ టిఫిన్ సెంటర్లో విజయ్ అనే దివ్యాంగుడు, శంకర్‌నాయక్ పని చేస్తున్నారు. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే నాగేశ్వరరావు నిత్యం అక్కడ టిఫిన్ చేస్తుంటాడు. శుక్రవారం టిఫిన్ చేశాక కానిస్టేబుల్‌ను విజయ్, శంకర్‌నాయక్ డబ్బులు అడగ్గా చెల్లించకుండానే వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10:30 గంటలకు సీఐతో కలసి పెట్రోలింగ్‌కు వచ్చిన నాగేశ్వరరావు.. సమయం దాటినా ఇంకా టిఫిన్ సెంటర్ ఎందుకు మూసేయలేదంటూ విజయ్, శంకర్‌నాయక్‌లను చితకబాదారు. నాగేశ్వరరావు అప్పుడప్పుడూ వచ్చి మద్యానికి డబ్బు ఇవ్వాలని కూడా అడుగుతుంటాడని బాధితులు ఆరోపించారు. ఈ దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై సీఐ అబ్బయ్యను వివరణ కోరగా టిఫిన్ సెంటర్ బంద్ చేయాలని చెప్పామే తప్ప కొట్టలేదన్నారు. -
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసా న్ని పెంపొందించడం, వారిని శక్తివంతం చేయడం ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2021, 2022 సంవత్సరాల కుగాను వికలాంగుల సాధికారత జాతీయ అవార్డులను రాష్ట్రపతి అందించారు. దివ్యాంగులను సశక్తులుగా తయారు చేసే ప్రక్రియలో భాగమైన సంస్థకు ఇచ్చే జాతీయ పురస్కారాన్ని 2022 సంవత్సరానికి తెలంగాణకు చెందిన డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు అందించారు. రెడ్డీస్ ఫౌండేషన్ తరపున సంస్థ చైర్మన్ కె.సతీశ్‌రెడ్డి రాష్ట్రపతి చేతు ల మీదుగా అవార్డును అందుకున్నారు. కూచిపూడి, భరతనాట్యం శాస్త్రీయ నాట్యకారిణి ఏపీ విజయనగరానికి చెందిన దివ్యాంగ బాలిక శ్రేయామిశ్రా(16)కు 2022 సంవత్సరానికి శ్రేష్ఠ్ దివ్యాంగ బాలిక విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందించారు. -
వైఎస్సార్ పెన్షన్ కానుక.. అవ్వా తాతలకు పండగ
సాక్షి, అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం 62.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1590.50 కోట్లు విడుదల చేసింది. ఉదయం 8 గంటల వరకు 31.84 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. చదవండి: ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు సూర్యోదయానికి ముందే.. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా అయిదో తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తోంది. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వీళ్లు ఎవ్వరూ ఇంటి గడప దాటకుండానే పింఛన్లు అందుకుంటున్నారు. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి ₹1,590.50 కోట్లు పంపిణీ చేస్తోంది. గత ఏడేళ్లలో ప్రతి సెప్టెంబర్ నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఖర్చు చేసిన మొత్తం వివరాలివి... సంవత్సరం పంపిణీ చేసిన మొత్తం సెప్టెంబర్ 2022 ₹1,590.50 కోట్లు సెప్టెంబర్ 2021 ₹1,397 కోట్లు సెప్టెంబర్ 2020 ₹1,429 కోట్లు సెప్టెంబర్ 2019 ₹1,235 కోట్లు సెప్టెంబర్ 2018 ₹477 కోట్లు సెప్టెంబర్ 2017 ₹418 కోట్లు సెప్టెంబర్ 2016 ₹396 కోట్లు సెప్టెంబర్ 2015 ₹405 కోట్లు -
మురిసిన మానవత్వం
ఉంగుటూరు(ఏలూరు జిల్లా): నెలల తరబడి శుభ్రం చేయని శరీరం, అట్టలు కట్టిన తల, మురికి పట్టిన దుస్తులు, మాసిన గెడ్డంతో మతి స్థిమితం లేని స్థితిలో జాతీయ రహదారిపై నెలల తరబడి సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను లవ్ ఇన్ యాక్షన్ టీమ్ సభ్యులు మానవత్వంతో స్పందించి వారికి ప్రేమతో సపర్యలు చేశారు. నారాయణపురానికి చెందిన ఈ టీమ్ సభ్యులు వారిని చేయి పట్టుకుని తీసుకువెళ్లి నారాయణపురంలో ఏలూరు కాలువ వద్ద సోమవారం వారికి జుట్టు కత్తిరించి, గెడ్డం గీసి, పిల్లలకు చేయించినట్లు సబ్బుతో ఒళ్లు రుద్ది షాంపూతో తల స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగారు. అనంతరం వారికి కడుపు నిండా ఆహారం అందించారు. ఈ టీమ్ అధ్యక్షుడు శ్రీరాముల పాలదినకరన్, ఉపాధ్యక్షుడు ఎస్.అబ్నేర్, కార్యదర్శి పెండ్యాల ప్రసాద్, కోశాధికారి పండుబాబు, కార్యనిర్వాహక సభ్యుడు కలపాల కుమార్‌తో మరికొంతమంది సభ్యులు ఎంతో మానవత్వంతో అందించిన ఈ సేవలను చూసినవారు వారిని మనసారా అభినందించారు. -
ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది
చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుని పేరు పాలుపోక భాస్కరరావు. ఆయనది మక్కువ మండలంలోని కాశీపట్నం గ్రామం. బీఎస్సీ, బీఈడీ పూర్తిచేశారు. ఉపాధ్యాయుడు కావాలన్న ఆశయంతో రాత్రీపగలు కష్టపడి చదివారు. డీఎస్సీ– 1998లో క్వాలిఫై అయ్యారు. చేతికందొచ్చిన ఉద్యోగం వివాదాలతో దూరమైంది. 2001లో డీఎస్సీ రాయగా అరమార్కులో అనర్హుడయ్యారు. మరోమారు 2006లో స్కూల్ అసిస్టెంట్ బయోలజీలో ఒక్కమార్కులో ఉద్యోగం పోయింది. తరువాత అనారోగ్యం కారణంగా 2007, 2012 సంవత్సరాలలో పరీక్షలు రాయలేకపోయారు. 2009లో ఇన్ఫెక్షన్ సోకడంతో రెండుకాళ్లు తీసేయాల్సి వచ్చింది. అక్షరాలపై మమకారం, ఉపాధ్యాయ వృత్తిపై ప్రేమతో కృత్రిమ కాళ్లతో కొన్నాళ్ల పాటు కాశీపట్నం ప్రభుత్వ పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేశారు. కొన్నాళ్లకు వలంటీర్ వ్యవస్థను ఎత్తేయడంతో ఆ చిరుద్యోగమూ దూరమైంది. జీవనం భారంగా మారింది. పొట్టపోషణ కోసం కాశీపట్నం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకొని మక్కువలోని ఓ మీసేవా కేంద్రంలో పనిచేసేవారు. కొంతకాలం తర్వాత మీ సేవా కేంద్రం వేరే ప్రదేశానికి మార్పుచేయడంతో ఆ బాధ్యతలూ దూరమయ్యాయి. కొద్దిరోజుల తర్వాత మక్కువలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) మేడ మెట్లకింద చిన్న కుర్చీవేసుకొని బ్యాంక్‌కు వచ్చిన ఖాతాదారులకు బ్యాంకు ఫారాలు నింపుతూ సాయపడేవారు. అలా వారిచ్చిన ఐదు,పది రూపాయలతో రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు సంపాదించేవారు. భాస్కరరావు దీనస్థితిని చూసిన ఆ గ్రామ పెద్దలు ఆయన భార్య లక్ష్మికి అంగన్వాడీ ఆయా గా అవకాశం కల్పించారు. దంపతులిద్దరూ శ్రమిస్తూ అబ్బాయిని బీటెక్, అమ్మాయిని 9వ తరగతి చదివిస్తున్నారు. వారి కుటుంబ జీవితం అలలపై సాగుతున్న నావ. ఆ నావకు సీఎం జగన్మోహన్రెడ్డి దిక్సూచీగా మారారు. 23 ఏళ్లుగా ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తూ డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగ మార్గాన్ని సుగమం చేశారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. సీఎం రూపంలో మా జీవితంలోకి ఉద్యోగ ‘భాస్కరుడు’ ఉదయించాడంటూ సంతోషపడుతున్నారు. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటామని చెబుతున్నారు. (చదవండి: మాటకు కట్టుబడి... జోరుగా సాగుతున్న నాడు నేడు) -
ఫిర్యాదు చేస్తే అవిటితనాన్ని వెక్కిరించి కొట్టి...
అనంతపురం క్రైం: ‘న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే.. కుంటి నాయాలా.. వడ్డీ వ్యాపారం చేస్తావా? అంటూ పామిడి సీఐ ఈరన్న కొట్టాడు’ అని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఎదుట ఓ దివ్యాంగుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప చేపట్టిన స్పందన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన దివ్యాంగుడు సుంకిరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆపద సమయంలో కొందరికి రూ.లక్షల్లో డబ్బు ఇచ్చానని, ప్రస్తుతం వారు ఆ డబ్బు వెనక్కు ఇవ్వకుండా తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాపోయాడు. దీనిపై పామిడి సీఐ ఈరన్నకు ఫిర్యాదు చేస్తే తన అవిటితనాన్ని వెక్కిరించి కొట్టాడని ఫిర్యాదు చేశాడు. కాగా, స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై మొత్తం 94 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్బీ సీఐ చక్రవర్తితో కలిసి వినతులను ఎస్పీ స్వీకరించి, పరిశీలించారు. తక్షణ పరిష్కారం నిమిత్తం ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. 79 సెల్ఫోన్ల అందజేత పోగొట్టుకున్న సెల్ఫోన్లను సంబంధీకులకు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అందజేశారు. సోమవారం డీపీఓలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 79 మందికి ఆయన సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు 94407 96812 వాట్సాఫ్ నంబర్‌కు సమాచారం అందించడంతో వాటిని రికవరీ చేసి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 541 సెల్ఫోన్లను రికవరీ చేసి, 450 మంది సంబంధీకులకు అందజేసినట్లు పేర్కొన్నారు. మిస్సింగ్ కేసులను నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్పీ మిస్సింగ్ కేసుల ఛేదింపులో నిర్లక్ష్యం తగదని పోలీసు అధికారులను ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సూచించారు. పిల్లలు, మహిళలు, యువతులు... ఇలా కనిపించకుండా పోయిన వారిపై సంబంధీకులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాలన్నారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి సోమవారం డీపీఓలో సీఐలతో ఆయన సమీక్షించారు. వివిధ పీఎస్‌ల్లో పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులపై ఆరా తీశారు. ఛేదింపులో విఫలమైన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మిస్సింగ్ అయిన వ్యక్తుల ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడి దర్యాప్తునకు ఉపయోగపడే వివరాలు సేకరించాలన్నారు. ఈ విషయంగా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. (చదవండి: రెండు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య) -
అన్నీ బాగున్నా.. ఆ సర్టిఫికెట్ కావాలే! స్థోమతను బట్టి రూ.40 వేల నుంచి లక్ష
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ♦కరీంనగర్లో సుభాష్‌నగర్‌కు చెందిన ఓ విశ్రాంత పోలీసు అధికారి దంపతులు 100శాతం వైకల్యం సర్టిఫికెట్ సంపాదించారు. అందులో భార్యకు అంధత్వం ఉన్నట్టు, సదరు అధికారికి కాళ్లు పనిచేయవని సర్టిఫికెట్ (నంబర్ 09190181710100001) తీసుకున్నారు. ఏఎస్సై హోదాలో రిటైరైన సదరు అధికారి ఇలా దొంగ సర్టిఫికెట్లు తీసుకోవడం ఆశ్చర్యకరం. ♦జమ్మికుంట మండలంలోని ఓ ఊరి సర్పంచ్ భర్త కూడా దివ్యాంగుడిగా సదరం సర్టిఫికెట్ తీసుకున్నాడు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయనకు ఆ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో అంతుచిక్కడం లేదు. ♦ఇలా ఒకటీరెండు కాదు కరీంనగర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో తప్పుడు సదరం సర్టిఫికెట్ల వ్యవహారం సాగుతోంది. సదరం సర్టిఫికెట్లు జారీ చేసే కొందరు డిస్ట్రిక్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ (డీఆర్డీఏ) సిబ్బంది, కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే వైద్యసిబ్బంది కలిసి యథేచ్ఛగా ఈ దందాకు తెరలేపారు. అడిగే సర్టిఫికెట్, వారి స్థోమతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అనర్హులు ఇలా పొందిన సర్టిఫికెట్లతో దివ్యాంగ పింఛన్లు, ఆర్టీసీ, రైల్వే పాసులు, పారిశ్రామిక రాయితీలు, సబ్సిడీ రుణాలు వంటివి పొందుతున్నారు. కొన్నేళ్లుగా నడుస్తున్న ఈ తప్పుడు సదరం సర్టిఫికెట్ల దందా ఇటీవల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు కింద చేసుకున్న దరఖాస్తుతో బయటపడింది. అధికారులు కుమ్మక్కై.. ప్రతినెలా గ్రామాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ముందుగా నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్ ప్రకటించి, వైకల్యం ఉన్నవారిని రావాల్సిందిగా సూచిస్తారు. తర్వాత ఆ నెలలోని ఒక్కోవారంలో వేర్వేరుగా ఆర్థో (ఎముకల సంబంధిత), దృష్టి, వినికిడి, మానసిక వైకల్యం ఉన్నవారిని పరీక్షిస్తారు. సదరు వ్యక్తికి ఏ వైకల్యం ఉంది? ఎంతశాతం లోపం ఉందనేది నిర్ధారించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఇందులో కొందరు వైద్యసిబ్బంది, డీఆర్డీఏలోని కొందరు సిబ్బంది కుమ్మక్కై తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన జిల్లాకు చెందిన సామాజిక ఉద్యమకారుడు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేయడంతో వ్యవహారం మొత్తం బయటపడింది. దివ్యాంగుల జాబితాలో అర్హుల కంటే అనర్హులే అధికంగా ఉండటం చూసి విస్తుపోవాల్సి వచ్చింది. అంతేకాదు.. సదరం సర్టిఫికెట్లు పొందినవారిలో పలువురు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ పోలీసులు, ప్రజాప్రతినిధులు, భూస్వాములు ఉండటం గమనార్హం. 80 శాతం అనర్హులే.. గతంలో జోరుగా నడిచిన తప్పుడు సర్టిఫికెట్ల దందా కోవిడ్ కారణంగా దాదాపు ఏడాదిపాటు ఆగిపోయింది. తిరిగి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ ఏడాది జనవరి వరకు నిర్వహించిన సదరం క్యాంపుల్లో దివ్యాంగులను పరీక్షించి, సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ ఏడాది కాలంలో 1,000కిపైగా సర్టిఫికెట్లు జారీ అయితే.. అందులో దాదాపు 800 మంది వరకు అనర్హులేనని సమాచారం. ఇలా తప్పుడు సర్టిఫికెట్ల కోసం పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలుఉన్నాయి. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.40 వేలదాకా, కొందరి వద్ద అయితే రూ.లక్ష దాకా వసూలు చేసినట్టు తెలిసింది. 800 మంది నుంచి రూ.40 వేల చొప్పున తీసుకున్నట్టు లెక్కించినా.. రూ.32 కోట్లకుపైనే దండుకున్నట్టు అంచనా. ఎక్కడ చూసినా అవే.. తప్పుడు సదరం సర్టిఫికెట్ల దందా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్ రూరల్, మానకొండూరు, కేశవపట్నం, జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, తిమ్మాపూర్, చొప్పదండి, వీణవంక, ఎలగందుల, మామిడాలపల్లి, కొత్తగట్టు తదితర మండలాల్లోనూ కొనసాగింది. ఇంక కరీంనగర్ కార్పొరేషన్‌లోని అన్ని వార్డుల పరిధిలో తప్పుడు సర్టిఫికెట్లు పొందినవారు ఉన్నట్టు తెలిసింది. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న విశ్రాంత పోలీసు అధికారి దంపతులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్న విషయం పరిశీలనలో వెల్లడైంది. వారి పనులు వారే చేసుకుంటున్నా.. సదరు విశ్రాంత అధికారి కదల్లేడని, అతడి భార్యకు కంటిచూపు లేదని సర్టిఫికెట్లు జారీ చేసిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిజమైన అర్హులను నెలల తరబడి తిప్పుకొంటున్నారని, అలాంటిది ప్రభుత్వ పింఛన్ తీసుకునేవారికి 100% వైకల్యమున్నట్టు సర్టిఫికెట్ ఎలా ఇస్తారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ‘తప్పు’తో మరెన్నో అక్రమాలు ప్రభుత్వం దివ్యాంగ పింఛన్ కింద నెలకు రూ.3,016 ఇస్తుండటంతో చాలా మంది తప్పుడు సదరం సర్టిఫికెట్ల కోసం ఎగబడుతున్నారు. అధికారులు దీనిని ‘ఆసరా’గా తీసుకుని ఒక్కొక్కరి నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. తప్పుడు సర్టిఫికెట్లు పొందినవారిలో చాలా మంది ఆసరా పింఛన్లు పొందుతున్నట్టు తేలింది. అదే సమయంలో విశ్రాంత ఉద్యోగులు, ధనవంతులు, స్థానిక ప్రజాప్రతినిధులూ తప్పుడు సర్టిఫికెట్లు తీసుకోవడంపై సందేహాలు వస్తున్నా యి. చాలామంది వివిధ దివ్యాంగుల కోటాలో బస్సు, రైల్వే పాసులు తీసుకున్నారని తెలిసింది. మరికొందరు ఆదాయపన్ను మినహాయింపు కోసం వాడుతున్నట్టు బయటపడింది. ఇంకొం దరు పారిశ్రామికంగా రాయితీలు, బ్యాంకు రుణాలు, వాహనాల్లో సబ్సిడీలు పొందుతున్నట్టు సమాచారం. కొందరైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో దివ్యాంగుల కోటా ఉద్యోగాల్లోనూ చేరినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
3 నెలలుగా పింఛన్ లేదు.. బతికుండగానే చంపేశారు!
సాక్షి. జనగామ: అతనో దివ్యాంగుడు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా రూ. 3,016 పింఛన్ తీసుకుంటున్నాడు. అయితే గత ఏప్రిల్ నుంచి ఆయనకు పింఛన్ రావడం లేదు. దీంతో ఈనెల 4న మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మెప్మా పీడీ హర్షవర్ధన్‌ను నిలదీశాడు. తన పేరును చనిపోయిన జాబితాలో చేర్చారని అధికారి చెప్పడంతో హతాశుడయ్యాడు. జనగామ జిల్లా కేంద్రంలోని 25వ వార్డు కృష్ణాకళామందిర్ ఏరియాకు చెందిన దివ్యాంగుడు కానుగ బాల్‌నర్సయ్య సర్వే సమయంలో ఇంటి దగ్గర లేకపోవడంతో, మెప్మా సిబ్బంది డోర్‌లాక్ అని రాసుకుని, ఆ తరువాత విచారణ చేపట్టకుండానే ఆయన పేరును చనిపోయిన జాబితాలోకి ఎక్కించారు. కాగా, ఈ విషయాన్ని బహిర్గతం చేయవద్దని బాల్‌నర్సయ్యను పీడీ హర్షవర్ధన్ కోరినట్టు తెలిసింది.దీనిపై పీడీ హర్షవర్ధన్‌ను వివరణ కోరగా, ఇంటింటి సర్వేలో డోర్‌లాక్ ఉండడంతోనే బాల్‌నర్సయ్య చనిపోయినట్లుగా తమ సిబ్బంది నమోదు చేసుకున్నారని చెప్పారు. ఆర్పీకి మెమో ఇచ్చి ఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. -
వైరల్: మెక్ డొనాల్డ్ సిబ్బంది ఔదార్యం
మన చుట్టూ ఉన్న వాళ్లకు తోచిన సహాయం చేస్తే, సాయం పొందిన వ్యక్తికి, నాకు ఇంత మంది అండగా ఉన్నారే... అనే భావన వారిలో కలుగుతుంది. మనకు కూడా ఎంతో కొంత తృప్తినిస్తుంది. కాసింత ప్రేమ పంచితే చాలు వారి జీవితాన్ని మార్చలేకపోయినా కాస్తైనా ఉపశమనం కలిగించవచ్చు. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో మనం చేసే చిన్న సాయం కూడా వారికి ఊరటనిస్తుంది. మెక్‌డొనాల్డ్ సిబ్బంది కూడా ఇదే తరహాలో ఓ వ్యక్తికి సాయం చేసి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. మెక్‌డొనాల్డ్స్‌కు వచ్చిన దివ్యాంగుడికి ఓ ఉద్యోగి తన చేతులతో స్వయంగా ఫుడ్ తినిపించగా, మరొకరు సాఫ్ట్‌డ్రింక్ తాగించి ఔదార్యం ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ది ఫీల్ గుడ్ పేజ్’ శుక్రవారం ట్విటర్లో పోస్ట్ చేయగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ కస్టమర్ పట్ల మెక్ డొనాల్డ్స్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లైకులు, రీట్వీట్ల ద్వారా నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: తండ్రి, కూతుర్ల జిమ్.. వైరల్) -
వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: తానేటి వనిత
సాక్షి, అమరావతి : వికలాంగుల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. దివ్యాంగులకు, వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమర్థవంతంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వృద్ధులకు గ్రామ వాలంటీర్ల ద్వారా పథకాలు అందజేస్తామని, భవిష్యత్తులో జిల్లాకు ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలలో, గర్భిణీలకు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 53 శాతం ఎనీమియా ఉందని నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందని, దీనిని త్వరలో మంచి విధానం ద్వారా తగ్గించేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు. -
వికలాంగులమంతా ఏకమై ప్రభుత్వాలపై పోరాడుదాం
హిమాయత్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వికలాంగులంతా ఏకమై ఓ శక్తిగా ఎదిగి హక్కులపై ప్రభుత్వాలతో ఢీ కొట్టాలని ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్, సెంటర్ ఫర్ డిసబల్డ్ స్టడీ జాతీయ చైర్మన్ బాబూ నాయక్ అన్నారు. వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇస్తే ప్రభుత్వాలు ఆ తీర్పును పక్కన పెట్టి వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ‘వికలాంగుల ఉద్యోగ రిజర్వేషన్లు–సుప్రీం కోర్పు తీర్పు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన బాబూనాయక్ మాట్లాడుతూ ఇతరులకు అన్యాయం జరుగుతుందనే కారణంతో వికలాంగులను సమాజంలో అణగదొక్కుతున్నారన్నారు. డీఎస్డీ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, వికలాంగుల హక్కుల పోరాట సంఘం జాతీయ అధ్యక్షులు అంజ.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కంటి తుడుపు పట్టింపు
విశ్లేషణ భారత జనాభాలో రెండు శాతానికి పైగా వికలాంగులు. ఇతర దేశా లతో పోలిస్తే మన దేశంలో వికలాంగుల శాతం తక్కువే. కానీ సంఖ్య రీత్యా మూడు కోట్ల వరకు ఉన్న వివిధ రకాల వికలాంగులంటే ఓ మధ్యస్త స్థాయి దేశ జనాభా అంత. ఇదేమీ పట్టించుకోకుండా వదలేయ గలిగేది కాదు. ఆందోళన కలిగించాల్సిన వాస్తవం, ఏమైనా చేయాల్సి ఉన్న విషయం. ‘బెస్ట్’ అనే పొట్టి పేరుతో పిలిచే ముంబై ముని సిపల్ రవాణా వ్యవస్థ వైఖరి మాత్రం అందుకు విరుద్ధమనిపిస్తుంది. వికలాంగులకు ఎక్కడం, దిగ డం సులువుగా ఉండే లో-ఫ్లోర్డ్ బస్సులను ప్రవేశ పెట్టడానికి వ్యతిరేకంగా అది తీర్మానం చేసింది. ఏదో కంటి తుడుపుగా అలాంటి కొన్ని బస్సులను నడిపితే చాలనేదే దాని సాధారణ వైఖరిగా ఉంది. బస్సులన్నిటినీ వికలాంగులకు అనువైనవిగా ఉండేట్టు చేసి, తద్వారా గర్వించదగ్గ గుర్తింపును సాధించాలనే మంచి ఆలోచన మాత్రం వారికి పుట్టలేదు. పేవ్మెంట్లన్నీ రోడ్డు మీది నుంచి ఒకే ఎత్తులో ఉండేలా చేయాలనీ, బస్సుల్లోకి ఎక్కి దిగడం సులువుగా అవి పేవ్మెంట్ అంచుకు దగ్గరగా ఆగేలా చేయాలనీ తన మాతృసంస్థయైన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబైని కోరాలనే యోచన సైతం దానికి రాలేదు. వాస్తవంలో వికలాంగులు బస్సులోకి ముందు ద్వారం గుండా ఎక్కి, దిగాల్సిందే. వారికి కేటా యించిన సీటు సరిగ్గా ముందు టైరుకు ఎగువన ఉంటుంది. వికలాంగుల పట్ల మనకున్న శ్రద్ధ ఆపాటిది... అసలంటూ అది ఉంటే. రోడ్డు పక్క పాదచారులు నడిచే బాటలు మునిసిపల్ సంస్థల ప్రమాణాలకు తగ్గట్టుండవు. అలాంటివి ఉన్న సందర్భాల్లో కూడా... ఒక్క నడవడానికి తప్ప, పార్కింగ్ నుంచి వ్యాపారాల వరకు వాటికి ఇతర ఉపయోగాలుంటాయి. ఈ నామమాత్రపు పట్టిం పునకు తగ్గట్టు 42,000 బస్సుల్లో ఓ 30 బస్సులంటే పెద్దగా లెక్కలోకొచ్చేవి కావు. వికలాంగులకు అవి మరింత ఎక్కువగా అందుబాటులో ఉండేట్టు చేయ డం ఎలా? అనేది ఎన్నడూ బహిరంగ చర్చకు రాలేదు. విమానాశ్రయంలో సైతం సమస్యను ఎదుర్కొనే వికలాంగులకు టీవీ చానల్ అందు బాటులో ఉండటం గురించి చెప్పనవసరమే లేదు. ఒక దేశంగా మనం వికలాంగుల పట్ల సాను కూల వైఖరిని చూపే బాపతు కాదు. అంధులను ‘విజ్యువల్లీ ఇంపైర్డ్’ అనీ, బధిరులను ‘హియరింగ్ -ఛాలెంజ్డ్’ అనేసి, వారికి ఆ పాటి గౌరవ ప్రదర్శన చాలని భావిస్తాం. ఇక చేతల్లోనైతే, సమస్యలనె దుర్కొనే ఈ ప్రజా సమూహం పట్ల రవ్వంత గౌరవమైనా చూపం. వారి సమస్యల పరిష్కారానికి సాధ్యమైనదంతా చేయడానికి బదులు మనం కంటి తుడుపువాదంలో లోతుగా కూరుకుపోయాం. ఉదాహరణకు, ముంబై నగర రైళ్లలో వికలాం గుల కోసం కంపార్ట్మెంట్లో ఒక భాగాన్ని రిజర్వు చేసి, కాలి నడక వంతెనలకు బాగా దగ్గరగా అవి ఆగే ఏర్పాటు చేశారు, అంతే. కిటకటలాడే జనం మధ్య నుంచి వారు ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కడం ఎలా? అసలా వంతెన మెట్లు ఎక్కి దిగేదెలా? అనేది ఎవరికీ పట్టలేదు. తమను ఎత్తుకుని మోయడానికి వాళ్లు పోర్టర్లను పెట్టుకోలేరు. ఆ రైళ్లు వర్ణనాతీత మైనంత అసాధారణంగా కిక్కిరిసి ఉంటాయని ఎవరైనా అంగీకరించాల్సిందే. అయినాగానీ, ఆరో గ్యవంతుడైన ఏ వ్యక్తీ ఆ కంపార్ట్మెంట్ను దురా క్రమించే ప్రయత్నం చేయడు. అంటే సమాజం వికలాంగుల పట్ల శ్రద్ధ చూపుతోందిగానీ, అధికా రులు, సేవలను అందించేవారికి మాత్రమే అది లేదని అర్థం. వైకల్యమంటే ఏమిటో సామాన్యునికి తెలుసు. అధికారులకు మాత్రం చాలా విషయాల్లో అదీ ఒకటి, అంతే. ఈ శతాబ్ది మొదటి దశాబ్దిలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ కారు ప్రమాదంలో గాయపడ్డారు. నెలల తరబడి ఆయన రెండు కాళ్లూ కట్లతో ఉండాల్సి వచ్చింది. సెక్రటేరియట్లో ఆయన లిఫ్ట్‌లను చేరుకోవడం కోసం వాలు దారిని (ర్యాంప్) నిర్మించారు. అసెంబ్లీ హాల్లో ట్రెజరీ బెంచీల వరకూ కూడా వాలు దారి వేశారు. కొట్ట వచ్చినట్టున్న ఈ మార్పులను చూసి ఏ సభ్యుడూ... ఆయనలాంటి మిగతా వారికి కూడా ఏ ఇబ్బందీ కలుగకుండా ఇలాంటి శ్రద్ధ చూపిస్తారా? అని అడగ లేదు. పాటిల్‌ది తాత్కాలిక వైకల్యమే. నేను ఈ విష యాన్ని లేవనెత్తేవరకు, ఆయన సైతం ప్రభుత్వ భవ నాలైనా వికలాంగులకు అనువుగా ఉండేలా చేయ డానికి నామమాత్రపు నిధులను కేటాయించలేదు. కాళ్లూచేతుల తొలగింపునకు గురైనవారి నుంచి అంధత్వం, బధిరత్వాల వరకు వైకల్యాలు విభిన్న మైన వి. అందరికీ చక్రాల కుర్చీ లేదా ఊత కర్రలు అవసరం లేకపోవచ్చు. బహుశా బ్రెయిలీ మాత్రమే వికలాంగులకు కల్పించిన ఏకైక ప్రత్యేక సదుపా యం కావచ్చు. ఆటిజం, హైపర్ యాక్టివ్ సిండ్రోమ్ మొదలైన వాటికి కూడా మద్దతు అవసరమని గుర్తించడం అవసరం. ఆటిజంతో బాధపడుతున్న బాలుడిని బయటకు తీసుకుపోవడానికి వెంట ఓ టీచర్‌ను పంపడానికి జేబులు ఖాళీ అయ్యేంత భారీ ఫీజును వసూలు చేసే ఒక స్కూలు గురించి నాకు తెలుసు! ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం సురక్షి తంగా నడవగలిగే ఫుట్‌పాత్ వంటి చిన్న సదు పాయాలను సైతం వికలాంగులకు నిరాకరి స్తున్నాయి. రోడ్డు పక్క గతుకులతో కూడిన గరుకైన పాదచారుల బాటమీద ఊతకర్రలతో నడవడాన్ని లేదా చక్రాల కుర్చీని ఉపయోగించడాన్ని ఊహించు కోండి. ఇక తెల్ల బెత్తాన్ని ఉపయోగించేవారు పడితే, ఒక్కోసారి మూతలేని మ్యాన్హోల్లోనైనా పడ వచ్చు. ఎక్కడైనా ఫుట్పాత్లుంటే, అవి కుంటి తనం, అంధత్వం లాంటివేవీ లేని సాధారణ వ్యక్తులను సైతం గాయపరచి, వైకల్యానికి గురిచేయవచ్చు. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
కోటాలోని అంధ అభ్యర్థుల వయోపరిమితి పెంపు
న్యూఢిల్లీ: రిజర్వేషన్ విభాగంలోని అంధ, పక్షవాత అభ్యర్థుల వయోపరిమితిని పది ఏళ్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్వహించే ఉద్యోగ నియామకాల్లోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయోపరిమితి సడలింపు 15 ఏళ్లుగా, ఓబీసీ అభ్యర్థులకు 13 ఏళ్లుగా ఉండనుంది. వికలాంగులకు పోస్టులు ఉన్నాయా, లేదా అనే దానితో సంబంధం లేకుండా వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) తన నియమావళి ముసాయిదాలో పేర్కొంది. ఈ సడలింపు సివిల్ సర్వీస్ పరీక్షలకు వర్తించదు. 55 ఏళ్లు దాటిన అంగవికలురకు, కనీసం 40 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవాళ్లకు ఈ సడలింపు వర్తించదు. -
అప్పుల బాధతో ఇద్దరు మహిళల బలవన్మరణం
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇద్దరు మహిళలను బలిగొన్నాయి. అప్పుల బాధతోపాటు తన ముగ్గురు పిల్లలు వికలాంగులు కావడం, భర్త అనారోగ్యంతో బాధపడుతుండడంతో చిలుకోడు శివారు ఫకీరాతండాలో సర్పంచ్ భార్య ఆత్మహత్యకు పాల్పడగా.. వ్యవసాయానికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో తరిగొప్పులలో మరో మహిళ బలవన్మరణానికి పాల్పడింది. చిలుకోడు(డోర్నకల్) : కుటుంబ సమస్యలతో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని చిలుకోడు గ్రామపంచాయతీ పరిధిలోని ఫకీరాతండాలో మంగళవారం జరిగింది. ఎస్సై రమేష్‌కుమార్ కథనం ప్రకారం.. ఫకీరాతండాలో నివాసముంటున్న చిలుకోడు సర్పంచ్ గుగులోత్ కిషన్‌సాదుకు భార్య జగ్ని(50), ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులు రవి, వెంకన్న, కుమార్తె కౌసల్య పోలియో కారణంగా వికలాంగులుగా మారారు. కౌసల్యకు అదే తండాకు చెందిన ఓ యువకుడితో పెళ్లి చేయగా ఒక పాప పుట్టింది. అరుుతే ఆరు నెలల క్రితం కౌసల్యను భర్త వదిలి వెళ్లడంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ముగ్గురు వికలాంగులు కావడంతో తల్లి జగ్ని వారిని కంటికి రెప్పలా కాపాడుతూ కాలం వెళ్లదీస్తోంది. కొద్దిరోజుల క్రితం కిషన్‌సాదు కళ్లకు ఆపరేషన్ కావడం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. దీంతో ఆయన ఆస్పత్రి ఖర్చులతోపాటు తన ఏడెకరాల భూమిలో వ్యవసాయం చేసేందుకు సుమారు ఐదు లక్షల రూపాయలకుపైగా అప్పు చేశాడు. పిల్లలు వికలాంగులు కావడం, భర్త అనారోగ్యం పాలవడం, అప్పులు కావడంతోపాటు కుటుంబ తగాదాల నేపథ్యంతో తీవ్ర మనోవేదనకు గురైన జగ్ని మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. చుట్టుపక్కలవారు గమనించేసరికి మృతిచెంది ఉంది. పవర్‌స్ప్రేయర్ బాగు చేయించేందుకు డోర్నకల్ వచ్చిన కిషన్‌సాదు విషయం తెలుసుకుని తండాకు వచ్చి జగ్ని మృతదేహాన్ని చూసి కుప్పకూలాడు. కుమారులు, కుమార్తె తల్లి మృతదేహంపై పడి బోరున ఏడ్చారు. పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా కళ్లల్లో పెట్టుకుని కాపాడుకున్న జగ్ని అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఇప్పుడు ఆ కుటుంభాన్ని ఎవరు చూసుకుంటారంటూ తండావాసులు కంటతడి పెట్టారు. మృతదేహాన్ని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌కుమార్ తెలిపారు. -
‘ఆసరా’ ఆందోళన
వృద్ధుల కడుపు మండింది.. వికలాంగులు కన్నెర్ర జేశారు.. వితంతువులు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు..! ‘ఆసరా’ పింఛన్ జాబితాలో అర్హులను తొలగించి అనర్హులకు చోటు కల్పించడం వివాదాస్పదంగా మారింది. జాబితాలో తమ పేరు లేకపోవడంపై అర్హులు రోడ్డెక్కారు.. అధికారులను నిర్బంధించారు.. కుర్చీలను ధ్వంసం చేశారు..గ్రామసభలను బహిష్కరించారు.. - సాక్షి ప్రతినిధి, వరంగల్ పింఛన్ రాలేదనే బెంగతో వృద్ధురాలి హఠాన్మరణం స్టేషన్‌ఘన్‌పూర్ : పింఛన్ రాలేదని బెంగతో స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడేనికి చెందిన గొడిశాల శేషమ ్మ(80) మృతిచెందింది. శేషమ్మకు గతంలో పింఛన్ వచ్చేది. సోమవారం ప్రకటించిన ఆసరా జాబితాలో పేరు లేదని ఆమెకు తెలిసింది. తీవ్ర మనస్తాపానికి గురై హఠాత్తుగా కుప్పకూలి మృతిచెందింది. ఇద్దరు అంధులను ఎలా సాదాలి దేవుడా... కేసముద్రం : పెద్ద దిక్కులేని ఆ ఇంటిలో ఇద్దరు బిడ్డలు సామేల్, స్వప్న అంధులే. కేసముద్రం స్టేషన్‌కు చెందిన వారు. భర్త చనిపోగా, బిడ్డలకు నిత్యం దగ్గరుండి సాకుతూ వస్తోంది తల్లి రమ. కొత్తగా మంజూరైన పింఛన్ జాబితాలో తమ పేరు ఉందో.. లేదోనని ఉత్కంఠగా గ్రామసభకు వచ్చారు. ముగ్గురిలో తల్లి, కొడుకు పేరు లేదని తెలియడంతో అంధుడు సామేల్ స్పృహ తప్పి కుప్పకూలాడు. కొడుకు ముఖంపై నీళ్లు చల్లింది. అంధులైన కొడుకు, కూతుర్ని పట్టుకుని.. ‘నా బిడ్డలను ఎలా సాదాలి దేవుడా’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. స్టేషన్‌ఘన్‌పూర్ : వెంకటాద్రిపేటలో గీత కార్మిక పింఛన్ రద్దు చేయడంతో తాడగోని లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జఫర్‌గఢ్ మండలంలో పింఛన్ల జాబితాను చదువుతుండగా అడ్డుకుని చించేశారు. మహబూబాబాద్ : వేమునూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ అభ్యుదయ అధికారి రుద్రను, సిబ్బందిని లబ్ధిదారులు నిర్బంధించారు. బేతోలులో జాబితాలో పేర్లులేని అర్హులు కొందరు టెంట్లను చించివేసి కుర్చీలను ధ్వంసం చేశారు. వర్ధన్నపేట : సర్వే చేసిన అధికారి వచ్చి జాబితా ప్రదర్శించాలని స్థానికులు డిమాండ్ చేయడంతో ల్యాబర్తిలో గ్రామసభ జరగలేదు. రెడ్డిపాలెంలో సభను నిర్వహించకుండా అధికారులు వెనుదిరిగారు. ములుగు : వెంకటాపూర్ మండల కేంద్రంలోని వికలాంగుడు రెడ్డి కోటయ్య పేరును అధికారులు వితంతువు పింఛన్ దారుల లిస్టులో ప్రకటించారు. వరంగల్ తూర్పు : పింఛన్ల జాబితాలో రిటైర్డ్ తహసీల్దార్‌కు చోటుదక్కింది.వరంగల్ నగరంలోని 7వ డివిజన్ చింతల్ కుమ్మరివాడలో నగర పాలక సంస్థ ప్రదర్శించిన జాబితాలో ఆ పేరును చూసి స్థానికులు నివ్వెరపోయూరు. నిలదీయడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జాబితాలో పేరు తొలగించాలని రంగయ్య నుంచి దరఖాస్తు తీసుకున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు ఇచ్చే సామాజిక పింఛన్ల అర్హుల జాబితా వెల్లడి జిల్లావ్యాప్తంగా గందరగోళానికి దారితీసింది. అధికారులు సోమవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల అర్హులు, అనర్హులు, పరిశీలనలో ఉన్న వారి పేర్లను వేర్వేరుగా జాబితాలు పెట్టారు. ఇందులో అర్హత ఉండి జాబితాలో పేరు లేని వారు, ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు కొత్త జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై నిరసనకు దిగారు. జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆందోళనకు దిగారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తే.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం : ఆసరా పింఛన్ల జాబితాల ప్రకటనపై నాలుగు మండలాల్లో వృద్ధులు, వితంతువులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పగూడెంలో అధికారులను సీపీఎం నాయకులు నిర్బంధిం చారు. పింఛన్ రాదేమోనని బెంగతో వృద్ధురాలు శేషమ్మ మృతిచెందింది. వెంకటాద్రిపేటలో గీత కార్మిక పింఛన్ రద్దు చేయడంతో లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు యత్నించా డు. రఘునాథపల్లి మండలంలో స్థానికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిం చారు. జఫర్‌గఢ్ మండలంలో పింఛన్ల జాబి తా చదువుతుండగా అడ్డుకుని చించేశారు. మహబూబాబాద్ : పింఛన్ల కోసం 4,780 దరఖాస్తులు వచ్చాయి. 1,751 మందితో అర్హుల జాబితాను వెల్లడించారు. 1,764 పెండింగ్‌లో పెట్టారు. 1,265 అనర్హుల జాబి తాను తయారు చేశారు. అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంపై కమిషనర్ రాజ లింగును లబ్ధిదారులు నిలదీశారు. 23 వార్డు కౌన్సిలర్ బి.అజయ్ అర్హుల జాబితాను అధికారుల ఎదుటే చించివేసి నిరసన తెలియజేశారు. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ ధర్నా నిర్వహించాయి. మహబూబాబాద్ మండలం వేమునూరు పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభ్యుదయ అధికారి రుద్రను, సిబ్బందిని లబ్ధిదారులు నిర్బంధించారు. బేతోలులో జాబితా లో పేర్లులేని అర్హులు కొందరు టెంట్లను చించి, కుర్చీలను ధ్వంసం చేశారు. కేసముద్రంలో పింఛను జాబితాలో పేరు లేకపోవడంతో సామెల్ సృ్పహ తప్పి పడిపోయాడు. నర్సంపేట : పింఛన్లకు అర్హత ఉన్నా వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో అధికారుల ఎదు ట పలువురు నిరసన తెలిపారు. నర్సంపేట-వుల్లంపల్లి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చెన్నారావుపేట వుండలం బాపునగర్, గుర్రాలగండిరాజపల్లిలో అధికారుల ను పంచాయుతీ కార్యాలయూల్లో నిర్బంధించారు. నెక్కొండ వుండల కేంద్రంలో ఎడ్ల సవ్ముక్క 90 శాతం అంగవైకల్యం కలిగినట్లు ఉన్నప్పటికి లీస్టులో పేరు లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి : గణపురం మండలం చెల్పూరులో జాబితలో తమ పేరు లేదని నిరసన తెలిపారు. శాయంపేట హుస్సేన్‌పల్లిలో గతంలో 67 మంది పింఛన్‌దారులు ఉన్నా రు. ప్రస్తుతం 27 మందికే పింఛన్లు మం జూ రు చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో అధికారులు నిర్బం ధించి తాళం వేశారు. పత్తిపాకలో ఎంపీడీఓ భద్రూనాయక్పై టీఆర్ఎస్ నేత దుబాసి క్రిష్ణమూర్తి, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎంపీడీఓపై ఒకరు చేయిచేసుకున్నట్లు తెలిసింది. చిట్యాల మండలం తిరుమలాపూర్, రామకిష్టాపూర్(టి), గర్మిళ్లపల్లి, జడల్పేట, నైన్పాక దాదాపు వేల మంది అర్హులకు పింఛన్లు మంజూరు కాకపోవడంతో గ్రామసభలను బహిష్కరించారు. వర్ధన్నపేట : వర్ధన్నపేట మండలం ఇల్లందలో లబ్ధిదారులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. జాబితా తప్పుల తడకగా ఉం దని పెరుమళ్లగూడెంలో జాబితాను చింపివేసి గ్రామసభను అడ్డుకున్నారు. సర్వే చేసిన అధికారి వచ్చి జాబితా ప్రదర్శించాలని స్థానికులు డిమాండ్ చేయడంతో ల్యాబర్తిలో గ్రామసభ జరగలేదు. రెడ్డిపాలెంలో సభను నిర్వహించకుండా అధికారులు వెనుదిరిగా రు. పర్వతగిరి మండలం అన్నారం అధికారులను, సిబ్బందిని పంచాయతీ కార్యాలయంలో నిరంచారు. హసన్‌పర్తి మండలం నాగారంలో వీఆర్వో లెనిన్పై లబ్ధిదారులు దాడికి ప్రయత్నించారు. డోర్నకల్ : డోర్నకల్ మండలంలో 5,454 మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించగా, డోర్నకల్తోపాటుకురవి, గుండ్రాతి మడుగులో తమకు పింఛన్ రాలేదంటూ మహిళలు అధికారులను నిలదీశారు. జనగామ : జనగామ మండలం వడ్లకొం డలో పలువురు వృద్ధులు ఆందోళన చేపట్టారు. చేర్యాల మండలంలో మండలంలోని ఆకునూరు, చుంచునకోటల్లో ధర్నాలు చేపట్టారు. మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట్ట మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పరకాల : పరకాలలోని వెలుమవాడ, పద్మశాలివాడలో జరిగిన సభలో వితంతులు తమ పేర్లు రాక పోవడంతో నిరసన వ్యక్తం చేశారు. గీసుకొండ మండలంలోని ధర్మారంలో అధికారులు ఎవ్వరు రాకపోవడంతో గ్రామ సభను నిర్వహించలేదు. పాలకుర్తి : తొర్రూరు, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల్లోని పలు గ్రామాల్లో పింఛన్లు పొందుతున్న ప్రస్తుత లబ్ధిదారుల పేర్లు తొలగించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరుప్పుల మండలం కడవెండిలో లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ములుగు : వెంకటాపూర్ మండల కేంద్రం లోని వికలాంగుడు రెడ్డి కోటయ్య పేరును అధికారులు వితంతువు పింఛన్ దారుల లిస్టులో ప్రకటించారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఆర్డీఓ మహేందర్‌జీని లబ్ధిదారులు నిలదీశారు. ఏటూరునాగారం మండలంలో జాబితాను తప్పులతడకగా ప్రకటించడంతో లబ్ధిదారులు.. నాయకులను, అధికారులను నిలదీశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ తూర్పు : రంగశాయిపేట, ఉర్సు, కరీమాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇంతకు ముందు పింఛన్లు తీసుకుని ఇప్పుడు లిస్ట్‌లో పేరురాని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ధ్రువపత్రాలు సమర్పించినా మా పేర్లెందుకు లిస్ట్‌లో లేవని పలువురు మహిళలు తమ గోడు వినిపించారు. వరంగల్ పశ్చిమ : ప్రస్తుతం అర్హులుగా ఉండి.. కొత్త జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. ‘తెలంగాణ వస్తే తెలంగణ వస్తే మంచిగ బతుకుతం’ అని అనుకున్నామని.. రెండు వందల పెంఛనుకు బదులుగా రూ.1000 పెంచితే మాకు కడుపునిండ అన్నం దొరుకుతుందని ఆశపడ్డామని, రూ.200 కూడా రాకపోయే అని పలువురు పింఛన్‌దారులు అధికారులపై శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికైనా అర్హులైన వారందరికి పింఛన్లు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
నాలుగు నెలలుగా గోస!
కందుకూరు: పింఛన్ డబ్బులతోనే బతుకులీడ్చే దీనులను అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇచ్చే అరకొర డబ్బులకు లబ్ధిదారుల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. మండలంలో నాలుగు నెలలుగా పింఛన్లు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గోస పడుతున్నారు. అధికారులు మాత్రం ఈ నెల వచ్చే నెల ఒకేసారి మొత్తం వస్తుందని చెప్పి పంపుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే దయనీయ పరిస్థితి నెలకొంది. పింఛన్లు అందని వారు దాదాపు ప్రతి గ్రామంలో పది, పదిహేను, ముప్పై మంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మండలంలోని వృద్ధాప్య, వితంతు, అభయహస్తం, వికలాంగ పింఛన్ లబ్ధిదారులు 6,737 మంది ఉన్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా రూ.200, వికలాంగులకు, అభయహస్తం కింద మహిళలకు రూ.500 చొప్పున పింఛన్లు అందాల్సి ఉంది. వీటిని ప్రభుత్వం మణిపాల్ ఏజెన్సీ ద్వారా సీఎస్పీలకు అందించి వారి నుంచి లబ్ధిదారులకు ప్రతి నెలా 1 నుంచి 5 లేదా పదో తేదీ లోపు అందజేయాలి. కాగా ఏప్రిల్, మే, జూన్, జులై నెలల పింఛన్లు లబ్ధిదారుల్లో చాలా మందికి అందలేదు. పింఛన్ల పంపిణీ కోసం కొత్త స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియలో భాగంగా ఫొటో తీసుకుని ఎన్రోల్మెంట్ చే సిన లబ్ధిదారులకు నాలుగు నెలలుగా పింఛన్ పంపిణీ కాలేదు. ఇదేమని అధికారుల్ని ప్రశ్నిస్తే ప్రాసెస్ అవుతోంది, మీ డబ్బు ఎక్కడికి పోదూ.. వచ్చే నెల మొత్తం ఒకేసారి అందుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో డబ్బులు అందుతాయో లేదోననే సందిగ్ధంలో పడ్డారు లబ్ధిదారులు. కనిపించిన అధికారినల్లా అడుగుతూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కనిపించిన వారందరికీ గోడు చెప్పుకొంటున్న.. నాలుగు నెలల నుంచి పింఛన్ రావడంలేదు. గ్రామంలో ఎప్పుడూ పింఛన్ డబ్బు ఇచ్చేవారిని అడిగితే పై నుంచి రాలేదు. అధికారుల్ని అడగండి అని అంటున్నారు. ఏం చేయాలో తెలియక కనిపించిన వారందరికీ గోడు చెప్పుకొంటున్నా. - సత్తెమ్మ, జైత్వారం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. నాలుగు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. నడవటం చేతగాకపోయినా ఏదోలా కష్టాలకోర్చి పింఛన్ డబ్బు కోసం తిరగాల్సి వస్తోంది. నెలనెలా వచ్చే ఆ డబ్బే మాకు ఆధారం. ఇప్పుడు అదీ బంద్ అయింది. - సాయిలు, జైత్వారం -
ఇక ‘బాబు’ మార్కు పింఛన్లు
* లబ్ధిదారుడు మరణిస్తేనే కొత్తవారికి పెన్షన్ * వితంతు, వికలాంగుల పెన్షన్లపై ప్రభుత్వం నిర్ణయం * టీడీపీ ప్రభుత్వం నాటి విధానాన్ని ప్రవేశపెట్టిన సర్కారు * వృద్ధులు, గీత కార్మికులకు మొండిచేయి * అర్హులని తేలినా పింఛన్ల మంజూరుకు నో * రచ్చబండ ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడే ఇవ్వాలని నిర్ణయం * ఇప్పటికే 7 లక్షల మందిని అర్హులుగా తేల్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వితంతు, వికలాంగుల పెన్షనర్లు ఎవరైనా మరణిస్తే తప్ప మరొకరికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్న వారిలో ఖాళీలు ఏర్పడిన పక్షంలోనే కొత్తవారికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లు ఖాళీలు ఏర్పడితేనే కొత్త పింఛన్లు ఇవ్వాలనేది తెలుగుదేశం ప్రభుత్వ విధానం. ఇప్పుడు అదే పద్ధతిని అనుసరించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు నిర్ణయించడం గమనార్హం. వితంతు, వికలాంగుల పెన్షన్లను.. ఖాళీలు ఏర్పడిన తర్వాతే అర్హులైన వారితో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్న సర్కారు.. వృద్ధులు, గీత కార్మికులను పూర్తిగా విస్మరించింది. వీరిలో కొత్తగా పెన్షన్లకు అర్హులని తేలినా వారికి వెంటనే ఇవ్వడానికి వీల్లేదని, ప్రభుత్వం రచ్చబండ ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు మాత్రమే పంపిణీ చేయాలని అప్పటి వరకు చెల్లించవద్దని నిర్ణయం తీసుకున్నారు. 2011 డిసెంబర్ తర్వాత మళ్లీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేదు. ఇప్పటికే దాదాపు ఏడు లక్షల మందిని పింఛన్లకు అర్హులని తేల్చిన ప్రభుత్వం.. వాటిని మంజూరు చేయకుండా అట్టిపెట్టుకుంది. ఇలా అర్హులని తేలిన వారిలోనూ రెండేళ్ల కాలంలో ఎంతమంది మరణించారన్న సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర లేదు. వాస్తవంగా వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారిలో ఏటా దాదాపు 20 వేలకుపైగా లబ్ధిదారులు మరణిస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. 42 లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాల్సి ఉంటే.. రెండేళ్లుగా ఏర్పడిన ఖాళీలే దాదాపు ఎనిమిది లక్షల వరకు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మొత్తం 76 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు చెబుతున్నా.. అందులో నాలుగున్నర లక్షలు వైఎస్సార్ అభయహస్తం పెన్షన్లే ఉన్నాయి. వైఎస్సార్ అభయహస్తంలో మహిళలు కూడా తమ వంతు వాటా చెల్లించారు. వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం 18 లక్షలు మాత్రమే పెన్షన్లు ఉంటే.. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సంఖ్యను ఏకంగా 71 లక్షలకు చేర్చారు. అంతేకాదు వీరందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ చేతికందేలా కృషి చేశారు. ఇప్పుడు ప్రభుత్వ తాజా విధానంతో గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుడు చనిపోయిన తర్వాతే ఆ గ్రామంలో మరొకరికి అవకాశం లభిస్తుందన్నమాట! మీ-సేవ కేంద్రాలుగా గ్రామ సమాఖ్యలు! గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని గ్రామ సమాఖ్య కార్యాలయాలను మీ-సేవ కేంద్రాలుగా మార్చే ప్రతిపాదనను పరిశీలించడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా సాంఘిక సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు ఉంటారు.