న్యూఢిల్లీ: రిజర్వేషన్ విభాగంలోని అంధ, పక్షవాత అభ్యర్థుల వయోపరిమితిని పది ఏళ్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్వహించే ఉద్యోగ నియామకాల్లోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయోపరిమితి సడలింపు 15 ఏళ్లుగా, ఓబీసీ అభ్యర్థులకు 13 ఏళ్లుగా ఉండనుంది. వికలాంగులకు పోస్టులు ఉన్నాయా, లేదా అనే దానితో సంబంధం లేకుండా వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) తన నియమావళి ముసాయిదాలో పేర్కొంది. ఈ సడలింపు సివిల్ సర్వీస్ పరీక్షలకు వర్తించదు. 55 ఏళ్లు దాటిన అంగవికలురకు, కనీసం 40 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నవాళ్లకు ఈ సడలింపు వర్తించదు.