మన చుట్టూ ఉన్న వాళ్లకు తోచిన సహాయం చేస్తే, సాయం పొందిన వ్యక్తికి, నాకు ఇంత మంది అండగా ఉన్నారే... అనే భావన వారిలో కలుగుతుంది. మనకు కూడా ఎంతో కొంత తృప్తినిస్తుంది. కాసింత ప్రేమ పంచితే చాలు వారి జీవితాన్ని మార్చలేకపోయినా కాస్తైనా ఉపశమనం కలిగించవచ్చు. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో మనం చేసే చిన్న సాయం కూడా వారికి ఊరటనిస్తుంది. మెక్‌డొనాల్డ్ సిబ్బంది కూడా ఇదే తరహాలో ఓ వ్యక్తికి సాయం చేసి సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. మెక్‌డొనాల్డ్స్‌కు వచ్చిన దివ్యాంగుడికి ఓ ఉద్యోగి తన చేతులతో స్వయంగా ఫుడ్ తినిపించగా, మరొకరు సాఫ్ట్‌డ్రింక్ తాగించి ఔదార్యం ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ది ఫీల్ గుడ్ పేజ్’ శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్ చేయగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ కస్టమర్ పట్ల మెక్ డొనాల్డ్స్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లైకులు, రీట్వీట్ల ద్వారా నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: తండ్రి, కూతుర్ల జిమ్.. వైరల్)
Comments
Please login to add a commentAdd a comment