హిమాయత్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వికలాంగులంతా ఏకమై ఓ శక్తిగా ఎదిగి హక్కులపై ప్రభుత్వాలతో ఢీ కొట్టాలని ఎన్‌జీఆర్‌ఐ సీనియర్ సైంటిస్ట్, సెంటర్ ఫర్ డిసబల్డ్ స్టడీ జాతీయ చైర్మన్ బాబూ నాయక్ అన్నారు. వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్‌లను అమలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇస్తే ప్రభుత్వాలు ఆ తీర్పును పక్కన పెట్టి వివక్ష చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ‘వికలాంగుల ఉద్యోగ రిజర్వేషన్లు–సుప్రీం కోర్పు తీర్పు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిత సంస్థ కార్యాలయంలో నిర్వహించారు.
ముఖ్య అతిధిగా హాజరైన బాబూనాయక్ మాట్లాడుతూ ఇతరులకు అన్యాయం జరుగుతుందనే కారణంతో వికలాంగులను సమాజంలో అణగదొక్కుతున్నారన్నారు. డీఎస్‌డీ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, వికలాంగుల హక్కుల పోరాట సంఘం జాతీయ అధ్యక్షులు అంజ.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.