దివ్యాంగులకు (పీడబ్ల్యుడీ) డిజిటల్ చెల్లింపు విధాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులు అన్ని వర్గాలలో బాగా ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ పేమెంట్ ప్రొవైడర్లు.. చెల్లింపులను సమీక్షించి, సవరించాలని ఆర్‌బీఐ ఆదేశించింది.
పీడబ్ల్యుడీల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిస్టమ్‌లు, పరికరాలు.. పాయింట్ ఆఫ్ సేల్ (POS) మెషీన్‌ల వంటి చెల్లింపు మౌలిక సదుపాయాలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇవన్నీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన యాక్సెసిబిలిటీ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.
చెల్లింపు వ్యవస్థలకు అవసరమైన మార్పులను చేపడుతున్నప్పుడు, భద్రతా అంశాలలో రాజీ పడకుండా చూసుకోవాలని ఆర్‌బీఐ పేర్కొంది. అంతే కాకుండా.. ఆర్‌బీఐ ఈ సర్క్యులర్‌ను జారీ చేసిన ఒక నెలలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని పీఎస్‌పీలను ఆదేశించింది. నివేదికలో ఈ మార్పులను అమలు చేయడానికి సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను కూడా చేర్చాలి.
Comments
Please login to add a commentAdd a comment