
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: వేలి ముద్రలు పడటం లేదనే సాకుతో గత ప్రభుత్వ హయాంలో నిలిపి వేసిన పింఛను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటికే వచ్చి అందిస్తున్నారని దివ్యాంగుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక పంచాయతీ గణపతి నగర్‌కు చెందిన వీరిశెట్టి ఫణిబాబు, లక్ష్మీప్రసన్నలకు 15 ఏళ్ల కుమారుడు లక్ష్మణ్ ఉన్నాడు.
దివ్యాంగుడైన లక్ష్మణ్‌కు వేలి ముద్రలు పడటం లేదనే సాకుతో మంజూరైన పింఛను కూడా గత ప్రభుత్వ హయాంలో రద్దు చేశారు. తిరిగి కరోనా సమయం 2020 సంవత్సరంలో పింఛను కోసం దరఖాస్తు చేయగా జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిందని అప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలనెలా ఇంటికే వచ్చి తమ బిడ్డకు వికలాంగుల పింఛను అందిస్తున్నారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక సచివాలయం పరిధిలోని వలంటీర్ ప్రతాప్ లబ్ధిదారు లక్ష్మణ్‌కు పింఛను నగదు అందిస్తున్న సందర్భం ఇది.
Comments
Please login to add a commentAdd a comment