ditch
-
Maharashtra: లోయలో పడిన పాల ట్యాంకర్.. ఐదుగురు మృతి
నాసిక్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై నాసిక్ హైవేపై న్యూ కసర ఘాట్ సమీపంలో ఒక పాల ట్యాంకర్ 300 అడుగుల దిగువకు ఒక లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మంది మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ బృందం, హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే వర్షం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలం నుంచి మృతదేహాలను బయటకు తీసింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
విలేకరి ప్రశ్నపై ప్రపుల్ పటేల్‌కు కోపం వచ్చింది.. వీడియో వైరల్..
ముంబయి: శరత్ పవార్ అనుయాయులైన ప్రఫుల్ పటేల్ మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్.. షిండే ప్రభుత్వంతో చేతులు కలిపారు. నిన్న రాజ్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ అంశంలో మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ప్రపుల్ పటేల్ దురుసుగా స్పందించారు. ఈ రోజు ప్రపుల్ పటేల్ అజిత్ పవార్ ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అజిత్ పవార్‌తో కలిసి షిండే ప్రభుత్వంలో కలిసినందుకు కేంద్ర మంత్రి పదవి దక్కనుందనే పుకార్లలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఇంకా ఢిల్లీకి వెళ్లి మాట్లాడలేదని చెప్పారు. మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి మాత్రమే చర్చించామని స్పష్టం చేశారు. ఎన్సీపీ పార్టీని, నాయకుడు శరద్ పవార్‌ను వదిలేస్తున్నారా? అనే ప్రశ్నకు ప్రపుల్ పటేల్ కోపం తెచ్చుకున్నారు. కారు అద్దాలను పైకి ఎత్తేశారు. కారును ముందుకు పోనివ్వమని ఆదేశాలు ఇచ్చారు. ఈ వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎన్సీపీలో సీనియర్ నాయకులుగా ఉన్న ప్రపుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ కూడా అజిత్ పవార్‌తో కలిసి షిండే ప్రభుత్వంలో కలిశారు. #WATCH | NCP leader Praful Patel, says "We are the NCP and that is what we are doing. We will decide now if I have to go to Delhi. We have not discussed anything about Delhi, we have only discussed about the formation of our government in Maharashtra" pic.twitter.com/Wp4e3X7RIi — ANI (@ANI) July 3, 2023 కాగా ఎన్సీపీలో ఆదివారం చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అనూహ్యంగా షిండే- బీజేపీ ప్రభుత్వంలో చేరడంతో ఆ పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు పెద్ద షాక్ తగిలినటైంది. అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్ పాటిల్, సంజయ్ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రమేశ్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్ తోపాటు డిప్యూటీ స్పీకర్ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: 'కుటుంబంలో సమస్యల్లేవు..' ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. -
ఆర్కిమెడ్స్కి సూత్రమే ఆ ఏనుగుని రక్షించింది!
Elephant Saved By Using Archimedes' principle: ఇంతవరకు పలు జంతువులను ఫారెస్ట్ సిబ్బంది రక్షించిన పలు ఘటనలు గురించి విన్నాం. అయితే తాళ్ల సాయంతోనే లేక మరో విధంగానో రక్షించటం గురించి విన్నాం. కానీ ఇక్కడ ఆ ఏనుగుని రక్షించేందుకు ఆర్కిమెడ్స్కి సూత్రాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అసలు విషయంలోకెళ్తే...పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో ఒక ఏనేగు మురుగు కాలువలో పడిపోయింది. అయితే ఆ కాలువ కుంచెం లోతుగా ఉండటంతో ఆ ఏనుగు ఆ కాలువలో ఇరుక్కుపోయింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఏనుగుని తీయడానికి శత విధాల ప్రయత్నించారు. కానీ ఆ కాలువ చాలా లోతుగా ఉండటంతో తీయడం కష్టంగా అనిపించింది. దీంతో వారు ఆర్కిమెడ్క్సి సూత్రాన్ని వినియోగించి ఆ ఏనుగుని రక్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. కాసేపటికి ఆ ఏనుగు నీళ్లల్లో తేలడంతో తాళ్ల సాయంతో బయటకు తీశారు. ఈ మేరకు ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. An elephant fell into a ditch in Midinapur. Now how to rescue it. By applying Archimedes' principle. Watch to believe. pic.twitter.com/1mPs3v8VjC — Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 21, 2022 (చదవండి: సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్) -
బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బస్సులోయలో పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం లక్షచోప్పున ఎక్స్గ్రెషియాను ఇస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజేశ్‌కుమార్ తెలిపారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన వారికి 40,000 వేల రూపాయలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న (ఆదివారం) బైల గ్రామం నుంచి వికాస్‌నగర్‌కు బయలు దేరిన బస్సు.. చక్రాటా అనే ప్రాంతంలో అదుపుతప్పి 300 అడుగుల లోతున పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. చదవండి: 300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి -
300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చక్రాటా అనే ప్రాంతంలో బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు .. బైల గ్రామం నుంచి వికాస్‌నగర్‌లోని చక్రాటాకు బయలు దేరింది. ఈ క్రమంలో మలుపుల వద్ద.. బస్సు అదుపుతప్పింది. ప్రమాద ప్రాంతం.. అత్యంత లోతుగా ఉండటంతో సహయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సహయక చర్యలకు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. चकराता क्षेत्र के अंतर्गत बुल्हाड़-बायला मार्ग पर हुए हृदय विदारक सड़क हादसे पर शोक व्यक्त करता हूँ। ईश्वर मृतकों की आत्मा को शांति और परिजनों को दुःख सहने की शक्ति प्रदान करे। — Pushkar Singh Dhami (@pushkardhami) October 31, 2021 చదవండి: ర్యాష్ డ్రైవింగ్.. అడ్డంగా ఉన్న కార్లన్ని ధ్వంసం.. అంతలో.. -
నేలబావిలో పడిన బైక్ .. ముగ్గురు గల్లంతు
రాజానగరం/మధురపూడి: బైక్ అదుపుతప్పి పాడుపడిన నేలబావిలో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఘటన తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, దోసకాయలపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోసకాయలపల్లికి చెందిన లలితపద్మాకుమారి కొడుకు గుమ్మడి సనీల్ (17), తుమ్మలపల్లి నుంచి సెలవులకు వచ్చిన తన చిన్నమ్మ కస్తూరి అచ్చుతరాణి కుమారుడు కస్తూరి అభిరామ్ (7)తో కలిసి బైక్‌పై గుమ్ములూరులో ఉంటున్న మరో చిన్నమ్మ చిన్నం పాప ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి వారి పిల్లలు చిన్నం వీర్రాజు (17), చిన్నం శిరీష (13)తో కలిసి సోమవారం మధ్యాహ్నం ఒకే బైక్‌పై నలుగురు దోసకాయలపల్లికి బయలు దేరారు. అయితే ఈ మార్గంలోని పుంత రోడ్డు మలుపులో బైకును తిప్పే ప్రయత్నంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పాడుపడిన నేలబావిలో పడిపోయారు. ఇదే సమయంలో బైక్‌పై చివరన కూర్చున్న అభిరామ్ దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అతడిచ్చిన సమాచారం మేరకు.. వెంటనే గజఈతగాళ్లను రప్పించారు. డీఎస్పీ నార్త్ జోన్ కడలి వెంకటేశ్వర్రావు, కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, సిబ్బందితోపాటు రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలు గల్లంతు కావడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. మైనర్లు వాహనం నడపడం.. ఒకే బైక్‌పై నలుగురు ఎక్కడం..రోడ్డు పక్కనే పాడుపడిన నేలబావిని పూడ్చకపోవడం ఈ దుర్ఘటనకు కారణమని భావిస్తున్నారు. -
కంటతడి పెట్టిస్తున్న చిన్నారి వీడియో; ఒంటి కాలితో..
అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే కొన్ని పనులు చేయలేకపోతుంటారు. అనేక విషయాల్లో చాలా బద్దకంగా వ్యవహరిస్తుంటారు. కానీ అంగ వైకల్యం కలిగిన ఓ చిన్నారి ఔరా అనిపించింది. ఆమె సంకల్పించిన బలం ముందు తన వైకల్యం చిన్నబోయింది. పట్టుదల, కృషితో దేన్నైనా సాధించగలనని నిరూపించింది. ప్రొస్తెటిక్ కాలు కలిగిన (కృత్రిమ కాలు) అంటోనెల్లా అనే ఐదేళ్ల చిన్నారి చిన్న లోయలా ఉండే ఓ గుంతలో పడిపోయింది. అక్కడి నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మళ్లీ జారీ కిందకే పడిపోతుంది. అసలు తను మీదకు వెళ్లగలుగుతుందో తెలియదు కానీ.. తన తల్లి ప్రొత్సాహపరుస్తుంటే కచ్చితంగా ఎక్కగలను అనే నమ్మకాన్ని కూడగట్టుకుంది. నువ్వు చేయగలవు.. కింద పడవు. నీవు బలవంతురాలివి అంటూ తల్లి ఎంజరేజ్ చేస్తుండటంతో ఒంటి కాలితో మెల్లమెల్లగా పైకి ఎక్కింది. పైకి వెళ్లిన తరువాత వెనక్కి తిరిగి తల్లిని చూస్తూ చిరునవ్వు విసిరింది. దీనికి సంబంధించిన వీడియోను గుడ్ న్యూస్ కరస్పాండెంట్ ట్విటర్లో పోస్ట్ చేశారు. చిన్నారి లోయనుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. అనేకమంది లైకులు, రీట్వీట్లతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ‘అంటోనెల్లా తన తల్లిని ఎప్పటికి గుర్తుంటుచుంటుంది. తను పెద్దయ్యాక ఒక పోరాట యోధురాలిగా ఎదుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు’. అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: వెరైటీగా వంతెన మీద వివాహం.. కారణం ఇదేనా ‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు Antonella wasn’t sure she could do it, but with her encouraging mom cheering her on— she did it! 🙌🏼🥰🇧🇷 (📽antonella.funghetto)👏🏼👏🏼👏🏼 Você é uma campeã 💓 pic.twitter.com/wT04GvfOUh — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 26, 2021 -
లోయలోకి దూసుకెళ్లిన ట్రక్కు: 11 మంది దుర్మరణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర సంఘటన జరిగింది. లోయలోకి అదుపు తప్పి డీసీఎం (ట్రక్కు) దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన ఇటావా జిల్లా రవెనెలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం.. బద్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రవెనె ప్రాంతంలో 50 మందికి పైగా ప్రయాణికులను వేసుకుని వెళ్తోంది. అయితే సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించడంతో ట్రక్కు నియంత్రణ కోల్పోయి చక్కర్‌నగర్ రోడ్డులోని లోయ ప్రాంతంలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారని ఆ ప్రాంత అదనపు ఎస్పీ ప్రశాంత్‌కుమార్ ప్రసాద్ తెలిపారు. మృతులందరూ పురుషులేనని చెప్పారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. చదవండి: ‘మేం చచ్చిపోతున్నాం.. మా పార్ట్స్ నా భార్యకు ఇవ్వండి’ చదవండి: సముద్ర గర్భంలో భూకంపం: తప్పిన సునామీ ముప్పు -
‘మాల్యా అప్పగింతకు నో టైమ్‌లైన్’
లండన్ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడం కోసం నిర్దిష్ట గడువును నిర్ణయించడం సాధ్యం కాదని బ్రిటిష్ హై కమిషనర్ సర్ ఫిలిప్ బార్టన్ గురువారం చెప్పారు. విజయ్ మాల్యాను భారత దేశానికి ఎప్పుడు అప్పగిస్తారు? అని అడిగిన ప్రశ్నపై బార్టన్ స్పందిస్తూ, ఇటువంటి అంశాలపై తమ ప్రభుత్వం ఎటువంటి వ్యాఖ్యలు చేయబోదని చెప్పారు. అయితే బ్రిటన్ కోర్టులు స్వతంత్రంగా పని చేస్తాయన్నారు. నేరస్థులు వేరొక దేశానికి వెళ్ళడం ద్వారా చట్టం నుంచి తప్పించుకుపోవడాన్ని నిరోధించడంలో పోషించవలసిన పాత్ర గురించి బ్రిటన్ ప్రభుత్వం, న్యాయస్థానాలకు తెలుసునని చెప్పారు. ఆన్లైన్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఫిలిప్ బార్టన్.. నేరస్థులు సరిహద్దులు దాటి వెళ్లినంతమాత్రాన తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. అయితే మాల్యాను ఫిబ్రవరిలోనే భారత్‌కు అప్పగించాల్సి ఉండగా, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. దీంతో ఇటీవలె ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దానికి ఆమోదముద్ర వేయవద్దని భారత్ ఇటీవలె బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు) కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. తాజాగా శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్మెంట్ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. (ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్ ) -
ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్మెంట్ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. అయితే మాల్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. బ్యాంకుల కన్సార్షియం మునుపటి ఆఫర్లను ఇప్పటికే తిరస్కరించింది. మరి తాజా ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో చూడాలి. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు) టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బ్యాంకులతో పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్టు మాల్యా న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే పరిష్కారం మొత్తం ఎంత ప్రతిపాదించారు అనేదానిపై స్పష్టత లేదు. అసలు రుణాలు, వాటిపై ఇప్పటి వరకు అయిన వడ్డీతో కలిపి 13,960 కోట్లు రూపాయలను చెల్లిస్తామంటూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (మాల్యా అప్పగింతపై సందేహాలు) కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. మరోవైపు శరణార్ధిగా దేశంలో ఉండేందుకు అంగీకరించాలంటూ బిట్రన్ ప్రభుత్వాన్ని మాల్యా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
చెరువులోకి విమానం
వెల్లింగ్టన్, న్యూజిలాండ్ : రన్ వే మీద ఆగాల్సిన విమానం కాస్తా అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దాంతో విమానంలో ఉన్న ప్రయాణికులు పడుతూ.. లేస్తూ.. ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని మైక్రోనేషియన్ ద్వీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్ న్యుగిని విమానం స్థానిక వెనో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పింది. దాంతో ఒక్కసారిగా రన్‌వే పై నుంచి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. అయితే చెరువు లోతు తక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా మునగలేదు. ఈ లోపు ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే పడవలతో వెళ్లి ప్రయాణికులను, సిబ్బందిని కాపాడారు. కొందరు ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. కానీ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాణికులను, సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. ఘటనపై పపువా న్యూ గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. -
స్వచ్ఛతలో మున్సిపాలిటీ ఆదర్శం
చైర్పర్సన్ పావని సిరిసిల్ల : స్వచ్ఛతలో సిరిసిల్ల మున్సిపాలిటీ రాష్ట్రానికే ఆదర్శంగా ఉంటుందని చైర్పర్సన్ సామల పావని అన్నారు. స్థానిక విద్యానగర్‌లో కమిషనర్ సుమన్ రావుతో కలిసి సెప్టిక్‌ట్యాంకులను పరిశీలించారు. పట్టణంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉందని, మురుగుకాలువకు పైపులను తొలగించి సెప్టిక్‌ట్యాంకులను నిర్మించేందుకు నెలరోజులుగా శ్రమించామని పేర్కొన్నారు. పందులను తొలగించేక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్ల సహకారంతో లక్ష్యాన్ని చేరామన్నారు. ఆమె వెంట కౌన్సిలర్ వెల్ముల స్వరూపరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
వాగులో పడిన బస్సు : ఐదుగురు మృతి
పాట్నా: బిహార్ రాజధాని పాట్నా జిల్లాలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు వాగులో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ మేరకు జిల్లా గ్రామీణ ఎస్పీ లలన్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అతివేగం కారణంగా బస్సు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లలన్ మోహన్ ప్రసాద్ తెలిపారు.