ఆర్కిమెడ్స్కి సూత్రమే ఆ ఏనుగుని రక్షించింది! | Elephant Rescued Use Archimedes Principle In West Bengal | Sakshi
Sakshi News home page

Viral Video: ఆర్కిమెడ్స్కి సూత్రమే ఆ ఏనుగుని రక్షించింది!

Published Mon, Feb 21 2022 8:33 PM | Last Updated on Mon, Feb 21 2022 9:37 PM

Elephant Rescued Use Archimedes Principle In West Bengal - Sakshi

Elephant Saved By Using Archimedes' principle: ఇంతవరకు పలు జంతువులను ఫారెస్ట్‌ సిబ్బంది రక్షించిన పలు ఘటనలు గురించి విన్నాం. అయితే తాళ్ల సాయంతోనే లేక మరో విధంగానో రక్షించటం గురించి విన్నాం. కానీ ఇక్కడ ఆ ఏనుగుని రక్షించేందుకు ఆర్కిమెడ్స్కి  సూత్రాన్ని ఉపయోగించాల్సి వచ్చింది.

అసలు విషయంలోకెళ్తే...పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో ఒక ఏనేగు మురుగు కాలువలో పడిపోయింది. అయితే ఆ కాలువ కుంచెం లోతుగా ఉండటంతో ఆ ఏనుగు ఆ కాలువలో ఇరుక్కుపోయింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఏనుగుని తీయడానికి శత విధాల ప్రయత్నించారు. కానీ ఆ కాలువ చాలా లోతుగా ఉండటంతో తీయడం కష్టంగా అనిపించింది.

దీంతో వారు ఆర్కిమెడ్క్సి సూత్రాన్ని వినియోగించి ఆ ఏనుగుని రక్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. కాసేపటికి ఆ ఏనుగు నీళ్లల్లో తేలడంతో తాళ్ల సాయంతో బయటకు తీశారు. ఈ మేరకు ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement