వాగులో పడిన బస్సు : ఐదుగురు మృతి | Five killed, 25 injured as minibus falls into ditch in Patna | Sakshi
Sakshi News home page

వాగులో పడిన బస్సు : ఐదుగురు మృతి

Published Wed, Jan 13 2016 3:36 PM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM

Five killed, 25 injured as minibus falls into ditch in Patna

పాట్నా: బిహార్ రాజధాని పాట్నా జిల్లాలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు వాగులో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ మేరకు జిల్లా గ్రామీణ ఎస్పీ లలన్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

అతివేగం కారణంగా బస్సు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లలన్ మోహన్ ప్రసాద్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement